Bigg Boss Beauty:వెండితెరపై నవ్వులు చిందిస్తూ.. తెర వెనుక సెలబ్రెటీలు పడే కష్టం వర్ణనాతీతం ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ.. ఆ వ్యాధులను జయించి కొంతమంది మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తే..ఆ వ్యాధులతో పోరాడలేక స్వర్గస్తులైన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇకపోతే జీవితంలో అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే అంటూ.. తాను క్యాన్సర్ బారిన పడి ఇప్పుడే కోలుకుంటున్నాను అని చెప్పి, తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పంచుకోవడమే కాకుండా.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ గా , బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న మోనాల్ గజ్జర్ (Monal Gajjar). తెలుగు, గుజరాతీ సినిమాలలో ఎక్కువగా నటించి తనకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత తమిళ , మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ‘సుడిగాడు’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది. అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అంతేకాదు సైమా ఉత్తమ తొలి నటి అవార్డుకి కూడా ఈమె నామినేట్ అవ్వడం గమనార్హం. బ్రదర్ అఫ్ బొమ్మాలి, ఒక కాలేజ్ స్టోరీ వంటి చిత్రాలలో కనిపించిన మోనాల్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో కూడా కంటెస్టెంట్గా అడుగుపెట్టి.. 98వ రోజు బయటకు వచ్చేసింది. అలాంటి ఈమె క్యాన్సర్ తో పోరాడి.. ఇప్పుడు ఆ వ్యాధి నుండి బయటపడ్డాను అని చెబుతూ అభిమానులతో ఒక వీడియో పంచుకుంది.
మోనాల్ గజ్జర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో పంచుకుంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులతో షేర్ చేసింది. ” ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాదొక విన్నపం. సక్సెస్ కంటే ఎక్కువగా మంచి ఆరోగ్యం ,ప్రశాంతమైన మనస్సు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలిగే శక్తి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ‘పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా’ అనే థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడ్డాను. ఇటీవలే శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాను. అయితే వ్యాధి కారణంగా నాకు కలిగిన అనుభవం, మనం మన ఆరోగ్యాన్ని ఎంత తేలికగా నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థమయింది.
also read:మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ తో అదరగొట్టేసిన రజినీకాంత్.. వీడియో వైరల్!
“తర్వాత చూద్దాం” అని చెప్పడం ఇకపై మానేద్దాం.. మనకు మనం ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిద్దాం. ఈ నా ప్రయాణాన్ని ఒకే ఒక ఆశతో పంచుకుంటున్నాను. ఎవరికైనా పెండింగ్లో ఉన్న వైద్య పరీక్షలు ఇప్పుడే చేయించుకోండి. ముందుగా మనం మనం? శరీరం చెప్పేది విందాం.. మానసిక , శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఈ సంవత్సరం మరింత ఆరోగ్యంగా , సంతోషంగా, మరింత జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ సాగాలని ఆశిస్తున్నాను. అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యం” అంటూ తన స్వీయ అనుభవాలను అభిమానులతో పంచుకుంది. మొత్తానికైతే థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నానని చెప్పిన మోనాల్.. ప్రస్తుతం చికిత్స చేయించుకున్నాను అని చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక త్వరగా రికవరీ అవ్వాలి అని ఆకాంక్షిస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&xtok=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==