Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్నతో మిస్ బిహేవ్ చేసిన ఇన్వెస్టర్‌ను గల్లా పట్టుకుని లాక్కొస్తాడు సూరజ్. జ్యోత్స్సకి సారీ చెప్పమని అంటాడు. ఆ మాటలకు ఇన్వెస్టర్ కోపంగా ఒక ఉద్యోగి కోసం నాచేత సారీ చెప్పిస్తావా..? తర్వాత నీ కంపెనీకి ఇన్వెస్ట్ మెంట్ రాదని తెలుసుకో అంటూ బెదిరిస్తుంటే.. ఉద్యోగి కాదు తను నా మనిషి.. నా సొంత… అంటూ గ్యాప్ ఇచ్చి నా సొంత పీఏ సారీ చెప్పు అంటూ తిడతాడు.
జ్యోత్స్నని కూడా అతన్ని కొట్టమని చెప్తాడు. జ్యోత్స్న అతని చెంప పగులగొడుతుంది. ఇన్వెస్టర్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సూరజ్ కోపంగా ఇప్పుడే కాదు ఆఫీసులో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినా తనకు చెప్పమని సూరజ్ చెప్పి వెళ్లిపోతాడు. దీప, జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది. కాదు సగమే ఓకే ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది అంటూ మాలిని దగ్గరకు వెళ్తుంది. దీప వద్దని చెప్పినా జ్యోత్స్న వినకుండా వెళ్లిపోతుంది.
మాలిని దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న ఏంటత్తా వెళ్లిపోతాను అనుకున్నావా..? అని అడిగితే.. నువ్వు శివనారాయణ మనవరాలివి కదా అంత ఈజీగా వెళ్లవు అంటే.. నేను శివనారాయణ మనవరాలినే కాదు అత్తా ఇప్పుడు నేను సూరజ్ గారి తాలుకా.. నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆఫీసులో కాఫీ కప్పులు పగులుతాయి.. నా మీద ఎవరైనా చేయి వేస్తే చెమటలు పట్టేస్తాయి అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. అప్పుడే ఎగిరిపడకే మేనకోడలా..? ఏదో ఈ మాత్రం దానికే అంత బిల్డప్ ఇవ్వకు అంటే.. అవునా అత్త అయితే ఇప్పటి వరకు నేను సూరజ్ తాలుకా కాదు సూరజే ఈ జ్యోత్స్న తాలూకా..? కావాలి అంటే నా ఐడీ కార్డు మీద జ్యోత్స్న సూరజ్ అని రాసుకుంటాను అంటుంది.
మాలిని కోపంగా జ్యోత్స్నను తిడుతుంది. నువ్వు తిట్టి నన్ను ఇంకా రెచ్చగొట్టకు అత్త.. నీ కొడుకు నా కోసం ఏమైనా వదులుకునేలా చేస్తాను. అవసరం అయితే నిన్ను కూడా వదులుకునేలా చేస్తాను.. కావాలంటే ఇది ఓ పేపరు మీద రాసుకో అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. ఆఫీస్ బాయ్ వచ్చి జ్యోత్స్నను సూరజ్ పిలుస్తున్నాడని చెప్తాడు. చూశావా అత్తా నీ కొడుకు నన్ను చూడకుండా ఐదు నిమిషాలు కూడా ఉండలేడు అని చెప్తూ.. వెళ్లిపోతుంది.
సూరజ్ తన క్యాబిన్‌లోకి వచ్చిన జ్యోత్స్నతో ఇన్వెస్టర్ మిస్ బిహేవ్ చేస్తున్న విషయం తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అందుకు జ్యోత్స్న తాను చెప్పినా ఎవ్వరూ నమ్మరని అందుకే చెప్పలేదని అంటుంది. నువ్వు చెబితే నేను నమ్ముతాను కదా అంటూ సూరజ్ అంటే.. ఇప్పుడు కూడా నేను చెప్పలేదు కదా సార్.. ఇప్పటికీ మీ అమ్మ ఇదంతా డ్రామా అంటుంది అని జ్యోత్స్న చెబితే.. నేను నమ్మను అని ఎలా అనుకున్నావు అంటూ సూరజ్ అడిగితే.. ఎలా నమ్ముతారు సార్ మీరు నమ్మాలి అంటే సాక్ష్యాలు కావాలి. నా దగ్గర సాక్ష్యాలు లేవు అందుకే చెప్పలేదు అంటుంది.
నువ్వు చెప్పింది నేను నమ్ముతాను ఎందుకంటే నువ్వు మా అమ్మ నాకు ఒక్కటే.. జీవితంలో చాలా తక్కువ మందికే నేను విలువ ఇస్తాను అందులో నువ్వు ఒకదానివి.. నేను అడిగినా నువ్వు చెప్పలేదు.. అందుకే నీ మీద కోపం వచ్చింది అంటూ సూరజ్ చెప్తుంటే.. ఈ డీట్ మీకు ఎంతో ముఖ్యం అని చెప్పారు.. అందుకే నేను ఈ డీల్‌ను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను అంటూ జ్యోత్స్న చెబితే.. ఈ డీల్ నేను నా టాలెంట్‌తో తీసుకొచ్చాను ఇది కాకపోతే ఇంకోటి తెచ్చుకోగలను అంటూ సూరజ్ చెప్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.