Podarillu Today Episode November 12th : చక్రి నారాయణతో అందరిని ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. అయితే ముందుగా మాధవ్ మనిషా జంటగా నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత చక్రి మహాలక్ష్మి తీసుకోవాలని అనుకుంటే మహాలక్ష్మి ముందు నువ్వు తీసుకువచ్చాలు అని అంటుంది. కానీ మహాలక్ష్మికి నారాయణ మాత్రం షాక్ ఇస్తాడు. ఇక కేశవ మహాలక్ష్మి చెప్పిన విషయానికి గుర్తు తెచ్చుకొని నారాయణ కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. అయితే కేశవ ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కేశవ ఏడుస్తున్నందుకు కన్నా కూడా షాక్ లో ఉండిపోతాడు. మొత్తానికి అందరూ కూడా నారాయణ గొప్పతనాన్ని తెలుసుకొని బాధ పడిపోతూ ఉంటారు.. చక్రి ప్లాన్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయిందని అర్థమవుతుంది.
నారాయణ ఆశీర్వాదం తీసుకోమంటే మాధవ దగ్గరికి వెళ్లి నాకు అన్నయ్య నాన్న అయినా అన్ని నువ్వే కాబట్టి.. మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వే నన్ను ఆశీర్వదించాలి అన్నయ్య అని ఎమోషనల్ అయిపోతాడు కన్నా.. ఇక చక్రి నారాయణ కాళ్ళకి దండం పెట్టమని ఎంతగా అడుగుతున్నా సరే కన్నా మాత్రం అస్సలు వినడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కాళ్లు పట్టుకుంటాను కానీ అతని కాళ్లు మాత్రం నేను అస్సలు పట్టుకొని అని అనగానే నారాయణ కూడా షాక్ అయిపోతాడు.
మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందని ఇంప్రెస్ చెయ్యాలి అనిపిస్తుంది నాకు ఏదైనా తక్కువ సమయంలో వంట చేసుకుని తినాలనిపిస్తుంది కూడా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చిన మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందని ఇంప్రెస్ చెయ్యాలి అనిపిస్తుంది నాకు ఏదైనా తక్కువ సమయంలో వంట చేసుకుని తినాలనిపిస్తుంది కూడా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చిన చాట్ జీపిటి అడిగి ఎలాంటి వంటలు చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తుంది అయితే ఇక తక్కువ సమయంలో మంచి వంటలు చేసుకునేందుకు ఏఐ నుంచి సమాధానం దొరకడంతో మహాలక్ష్మి ఫుల్ హ్యాపీగా ఉంటుంది..
కేశవ షాప్ ఓపెనింగ్ కోసమని అంత సిద్ధం చేసి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాడు. అయితే అక్కడ మొత్తం అంతా చూసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అందరూ కలిసి ఈ షాప్ ని ఇంత దూరం తీసుకొని వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే కేశవ ఒక షాప్ కి ఓనర్ కాబోతున్నాడు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని మాధవ్ కూడా సంతోషంగా ఉంటాడు. అప్పుడే నారాయణ ఏంట్రా ఎవరైనా షాప్ పేరు కనిపించేలాగా పెద్దగా పెడతారు మీరేంటి తెరవేశారు అని అడుగుతాడు. అయితే మహాలక్ష్మి ఏది చెప్తే అది చేశాను అని కేశవ అంటాడు. అందరూ కలిసి షాప్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాకుండా ఉంటుంది అని అనగానే అందరూ వెళ్లి రిబ్బన్ కట్ చేస్తారు.
శైలు చీర కట్టుకొని రెడీ అయ్యి ఈ చీరలు ఎంత అందంగా ఉన్నానో అని మురిసిపోతూ ఉంటుంది. పెళ్లికి రెడీ అయినట్టుగానే ఉన్నాను కదా నన్ను ఈ చీరలో చూస్తే ఆ ముంగిస గాడు అస్సలు తట్టుకోలేడు అంటూ తనకు తానే పోగుడుకుంటూ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే వరాలుని పిలిచి ఈ చీర ఎలా ఉందో కనుక్కోవాలని అనుకుంటుంది అయితే అమ్మ ఒకసారి లారా అని గట్టిగా కేకలు వేసి పిలుస్తుంది. చీర కట్టుకొని నన్ను వాడు రమ్మన్నాడు అని చెప్పగానే వరాలు ఇంకేదో అనుకుంటుంది. ఇక తన కొడుకుని పిలిచిన వరాలు పెద్ద హంగామా చేస్తుంది. నేను లేచిపోయి పెళ్లి చేసుకోవడం లేదు. వాడు షాప్ ఓపెనింగ్ కి నన్ను రమ్మని ఆ చీర కూడా వాడే ఇచ్చాడు కాబట్టి కట్టుకొని వెళ్తున్నాను అని చెప్పగానే.. వాళ్ళ అమ్మ అన్నయ్య అవమానించేలా మాట్లాడుతారు. అయినా కూడా పోలీసులకి చెప్పిన నా మాట చెల్లుతుంది అని ధైర్యంగా వెళ్ళిపోతుంది.. శైలు వరాలు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
శైలు అక్కడికి రాగానే పెళ్లికి రెడీ అయినట్టు వచ్చావు చాలా బాగున్నావు అని చక్రి తనని పొగిరేస్తూ ఉంటాడు. అంత అదృష్టమా ముందు మీ అన్నయ్య పెళ్లి కావాలి కదా అంటూ శైలు అనగానే అందరూ కూడా చాలా ఫీల్ అయిపోతారు.. షాప్ ఓపెనింగ్ కి దీపం వెలిగించాలి కదా అని అనగానే అందరూ మహాలక్ష్మిని వెలిగించమని. శైలు ఫీలవుతుందని గమనించిన నారాయణ ముగ్గురు కోడలు ముగ్గురు కలిసి దీపం వెలిగించండి అని చెప్పగానే శైలు చాలా సంతోషంగా ఉంటుంది ఇక మొత్తానికి షాప్ ఓపెనింగ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: జంగమదేవర ఎంట్రీ.. భయంకరమైన నిజం.. పల్లవి డ్రామా అదుర్స్..