Rohit Naidu:కళ్ల ముందు మంచి ఐటీ ఉద్యోగం, చేతి నిండా ఆరు అంకెల జీతం ఉన్నప్పుడు ఎవరైనా ఆ లైఫ్‌ను వదులుకోవడానికి వెనుకాడతారు. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్ పట్నం రోహిత్ నాయుడు మాత్రం ఆ రిస్క్ తీసుకుని హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఎనిమిదో వారంలో డబుల్ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చిన తర్వాత, ఆయన జీతం, రెమ్యూనరేషన్ విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అంత పెద్ద జాబ్ ఎందుకు వదిలారు?ఆ వివరాలు చూద్దాం..
బిగ్ బాస్‌లోకి రాకముందు రోహిత్ నాయుడు ప్రముఖ సంస్థ లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ‘అగ్నిపరీక్ష’ సమయంలో తన జీతం గోప్యమని చెప్పినా, ఆ తర్వాత నాగార్జున ముందు తాను నెలకు ఆరు అంకెల జీతం (రూ. లక్షకు పైగా) వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని వెల్లడించారు. ఇక ఇప్పుడు వెళ్లిన నా జాబ్ నాకు ఉంటుంది అని తెలిపాడు. ఇక ప్యాకేజీ వివరాలు కచ్చితంగా చెప్పకపోయినా, కార్పొరేట్ ప్రపంచంలో సెటిల్ అయిన లైఫ్ వదిలి రావడం అందరూ చేసే పని కాదు.
ఎనిమిదో వారంలో సింగర్ ఝాన్సీతో పాటు రోహిత్ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చారు. వారానికి సుమారు రూ. 70,000 చొప్పున 8 వారాలకు గానూ దాదాపు రూ. 5.60 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. దీనికి ‘అగ్నిపరీక్ష’ అదనపు మొత్తం రూ. 50,000 కూడా తోడై సుమారు రూ. 6.10 లక్షల దాకా చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బయట వచ్చే నెలవారీ జీతంతో పోలిస్తే ఇది భిన్నమైన లెక్కే అయినా, బిగ్ బాస్ క్రేజ్ వేరుగా ఉంటుంది.
సీజన్ 10 మొదటి నుంచి రోహిత్, త్రిగుణ్ మధ్య గొడవలతోనే హౌస్‌లో ఎక్కువ చర్చ నడిచింది. మాటల విషయంలో, ప్రవర్తనలో ఇద్దరూ పోటాపోటీగా కనిపించారు. మరోవైపు షాలినీతో ఉన్న సాన్నిహిత్యం రోహిత్ ఆటపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక ఎపిసోడ్లలో చూపించినంత మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారని, తన ఆటలో చాలా విషయాలు బయటకు రాలేదని రోహిత్ ఇంటర్వ్యూలలో చెప్పారు. కొందరు రోహిత్ కోసమే షో చూసేవారు.
also read:ఘనంగా స్టార్ కమెడియన్ M.S.నారాయణ మనవరాలి పెళ్లి..వీడియో వైరల్!
రోహిత్ నిష్క్రమణతో హౌస్‌లోని ఆట ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆట కోసం దేనికైనా సిద్ధపడే త్రిగుణ్‌కు బయట పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా సమానంగా ఉంది. రోహిత్ వెళ్లిపోవడంతో ఇప్పుడు ముకేష్ లాంటి కంటెస్టెంట్లు రేసులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆరు అంకెల జీతం వదిలి వచ్చినా, ఈ ప్రయాణం రోహిత్‌కు కొత్త గుర్తింపు అయితే ఇచ్చింది.