Priyanka Jain: జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియాంక జైన్ (Priyanka Jain) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి అడుగుపెట్టి.. టాప్ 5 లో ఒకరిగా నిలిచి అందరి మన్ననలు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు శివకుమార్ (Shiva Kumar) కలిసి తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక సేవ, రీల్స్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. అక్కడ తనదైన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
అలాంటి శివ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో శివ టైటిల్ విజేత కావాలని ఆకాంక్షిస్తూ.. నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శివ విజయం కోసం స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనే ప్రత్యేక సంకల్పంతో ఆమె ఏడుకొండలవాడి సన్నిధికి చేరుకున్నారు. ప్రియాంక జైన్ తన తిరుమల యాత్ర వెనుక ఉన్న భావోద్వేగ కారణాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
గతంలో శివ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు, తన కోసం శివ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు కోరారని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే విధంగా తాను కూడా శివ కోసం తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. “శివ నా కోసం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తిరుమలకు వెళ్లారు. ఇప్పుడు శివ కోసం నేను కూడా ఏడుకొండలవాడి దగ్గరకు వచ్చాను” అనే భావనతో ఆమె ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేపట్టారు. శివ బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని, తన ప్రయాణం విజయవంతం కావాలని ప్రియాంక స్వామివారిని ప్రార్థించారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన ప్రియాంక జైన్, శివ పట్ల తన ప్రేమను, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.బిగ్‌బాస్ ప్రయాణంలో ఒకరికొకరు అందించిన మద్దతు, వారి మధ్య ఉన్న అనుబంధం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు శివ కోసం ప్రియాంక తిరుమల వెళ్లడం సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారితీసింది. మొత్తానికి అయితే ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రియాంక పంచుకున్న ఫోటోలలో ఆమె తిరుమల లో మోకాళ్ళ పర్వతం వద్ద మోకాళ్లపై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఎందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీటిని చూసిన అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&knvt=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==