Chaitra Rai: చైత్ర రాయ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అష్టా చమ్మ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన చైత్ర తన మొదటి సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా మొదటి సీరియల్ తోనే సూపర్ సక్సెస్ కావడంతో ఈమె తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరకు కాస్త దూరంగా ఉన్న చైత్ర తన వ్యక్తిగత జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్నారు. ఈమె ఇటీవల తన రెండో బిడ్డకు జన్మనివ్వడంతోనే సీరియల్స్ కు చిన్న విరామం ప్రకటించారు.
ఇక తనకు రెండో కుమార్తె పుట్టిన విషయాన్ని తెలియచేసిన చైత్రరాయ్(Chaitra Rai) పాప పుట్టిన కొద్ది నెలలకి ఈమె తెలుగు బిగ్ బాస్ 10 (Bigg Boss 10)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. తెలుగులో ఎంతో మంచి ఉన్న ముద్దుగుమ్మ హౌస్ లోకి అడుగు పెట్టడంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటుందని అందరూ భావించారు. కానీ ప్రేక్షకుల ఊహలకు అందకుండా మొదటి వారమే ఈమె హౌస్ నుంచి బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇలా బిగ్ బాస్ నుంచి ఈమె బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన చిన్న కుమార్తె ప్రిష్క శెట్టి (prishakhashetty)క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసేవారు. ఇదివరకు పలు సందర్భాలలో తన చిన్న కూతురుతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన చైత్ర తన ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా తన చిన్న కుమార్తె ఫేస్ చేస్తూ ఈమె ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన చిన్న కూతురు పేరుతో ప్రత్యేకమైన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినట్టు కూడా తెలిపారు.
ఇలా చైత్ర తన కూతురి ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలపై అభిమానులు స్పందిస్తూ చిన్నారి చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక చైత్ర ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ ఇద్దరు కూడా అమ్మాయిలు కావటం విశేషం. చైత్ర పెద్ద కుమార్తె నిష్క కాగా, చిన్న కుమార్తె ప్రిష్క. ఇలా ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంతో కెరియర్ పరంగా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక చైత్ర కన్నడ సీరియల్స్ తో పాటు తెలుగులో కూడా పలు సీరియల్స్ చేశారు అలాగే సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నారు. ఈమె ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Also Read: ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న ఆదర్శ కుటుంబం!