E-Paper
Advertisement

నల్లగా ఉన్నారని నాన్నను ఇష్టపడమా? కాబోయే భర్త పై లాస్య కామెంట్స్!

నల్లగా ఉన్నారని నాన్నను ఇష్టపడమా? కాబోయే భర్త పై లాస్య కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks: బుల్లితెర ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో మల్లి సీరియల్(Malli Serial) ఒకటి. ఈ సీరియల్ ద్వారా హీరోయిన్ గా మన తెలుగమ్మాయి లాస్య (Lasya)బుల్లితెరకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సీరియల్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లాస్య ప్రస్తుతం తెలుగు తమిళ సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. పీ నేపథ్యంలోనే తాజాగా నటి లాస్య బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు.

నా పట్ల శ్రద్ధ చూపించాలి..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా లాస్య తనకు రాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలో భాగంగా యాంకర్ వర్ష లాస్యను ప్రశ్నిస్తూ మీరు సింగిలా అని అడగడంతో అవునని సమాధానం చెప్పారు అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీకు భర్తగా రావాలనుకుంటున్నారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు లాస్య సమాధానం చెబుతూ.. తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తన పట్ల చాలా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. మనం సీరియల్స్ లో నటిస్తున్నాం కాబట్టి ఇన్ సెక్యూరిటీ లేకుండా ఉండే వాళ్ళయితే బాగుంటుందని తెలిపారు.

నల్లగా ఉంటే ఇష్టపడమా..

Advertisement

చాలామంది తనకు కాబోయే వాడు ఇలాంటి కలర్ ఉండాలి ఇంత హైట్ ఉండాలని చెబుతుంటారు మీకు అలాంటి క్వాలిటిస్ ఏవి లేవ అని అడగడంతో నాకు కలర్ గురించి ఎలాంటి సమస్య లేదు మా నాన్న కూడా కొంచెం బ్లాక్ కలర్ ఉంటారు. నాన్న నల్లగా ఉన్నారని ఇష్టపడటం లేదా? అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతుంది. చాలామంది కలర్ కు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ ఈమె మాత్రం నల్లగా ఉన్నా, మంచి వాళ్లయితే ఓకే అని చెప్పడంతో ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Advertisement

ఇక లాస్య మల్లి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం ఈమె తెలుగులో లక్ష్మీనివాసం అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ తో పాటు తమిళంలో సంధ్యారాగం అనే సీరియల్ లో కూడా నటిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇక తన స్వస్థలం వైజాగ్ అని, వైజాగ్ వారందరికీ బీచ్ ఒక బిగ్ థెరపీ అంటూ లాస్య మాట్లాడారు. ఓయ్ సినిమాలోని 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత అంటూ సాగిపోయే పాటను పాడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా లాస్య ఎలాంటి విషయాలు గురించి అభిమానులతో ముచ్చటించారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: నేను గోల్డెన్ లెగ్ అంటున్న మల్లి సీరియల్ నటి లాస్య..ఏ సీరియల్ చేసిన బ్లాక్ బస్టర్!

Related News

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన మల్లి సీరియల్ నటి!

గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

నేను గోల్డెన్ లెగ్ అంటున్న మల్లి సీరియల్ నటి లాస్య..ఏ సీరియల్ చేసిన బ్లాక్ బస్టర్!

తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!

బిగ్ బాస్ లో ఆ నలుగురికి జీరో స్టార్స్.. కంటెస్టెంట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున!

బాయిలోనే బల్లిపలికే పాటతో సెన్సేషన్.. నాగవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఆ పని చేసి ఉంటే విన్నర్ అయ్యేవారు: కౌశల్ మండా

Big Stories

Advertisement
×