E-Paper
Advertisement

వైరస్‌ దెబ్బకు మనుషులంతా జాంబీలుగా మారితే… క్షణక్షణం ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్

వైరస్‌ దెబ్బకు మనుషులంతా జాంబీలుగా మారితే… క్షణక్షణం ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Zombie Survival Thriller OTT : జాంబీ సర్వైవల్ సినిమాలకు వరల్డ్ వైడ్‌గా భారీ డిమాండ్ ఉంది. ఒక వింత వైరస్ వల్ల ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్నప్పుడు, ప్రాణాలు కాపాడుకోవడానికి మనుషులు చేసే పోరాటం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గానే ఉంటుంది. అలాంటి జాంబీ ప్రపంచాన్ని మరోసారి మన ముందుకు తీసుకొచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘అపోకాలిప్స్ జెడ్ న్యూ వరల్డ్’ (Apocalypse Z: New World). మానెల్ లౌరెయిరో (Manel Loureiro) రాసిన పుస్తకాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2024లో వచ్చిన ‘అపోకాలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్’కు సీక్వెల్. ప్రస్తుతం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ప్రమాదకరమైన టీఎస్‌జే వైరస్ మనుషులను క్రూరమైన జాంబీలుగా మార్చేస్తుంది. ఈ వైరస్ దెబ్బకు యూరప్‌ లోని చాలా ప్రాంతాలు ప్రమాదకరంగా మారిపోతాయి. అయితే కానరీ దీవులు మాత్రం యూరప్‌లో ఉన్న ఒకే ఒక్క సురక్షిత ప్రాంతంగా మిగులుతాయి. అక్కడి నుంచి అవసరమైన ఆహారం, ఇతర సరుకుల కోసం ఓ ప్రత్యేక బృందం మాడ్రిడ్‌ కు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఈ మిషన్‌ లోకి రాబర్టో కూడా చేరతాడు. అయితే అతడి తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉంటుంది.

Advertisement

మిషన్ మొదలైన తర్వాత ఆ బృందానికి అసలైన టెస్ట్ ఎదురవుతుంది. చుట్టూ వందలాది జాంబీలు, మరోవైపు ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితులు.. ఇలా ప్రతి అడుగులోనూ ప్రమాదమే ఎదురవుతుంది. జాంబీల దాడుల నుంచి తప్పించుకోవడంతో పాటు, తమ మధ్య దాగున్న విభేదాలను పక్కన పెట్టి మిషన్ కు బయల్దేరాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రాబర్టో, అతడి బృందం ఎలా ప్రాణాలతో బయటపడింది ? ప్రాణాలు కాపాడుకోవడం కోసం వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ? మానవత్వాన్ని కాపాడుకోవాలా, లేక తమ ప్రాణాల కోసం పోరాడాలా అన్న పరిస్థితుల్లో ఏం చేశారనేదే మిగతా కథ.

సినిమా ఆద్యంతం జాంబీల ప్రపంచంలో సాగే సర్వైవల్ థ్రిల్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇన్‌ఫెక్టెడ్ దాడులు, ప్రమాదకరమైన ప్రయాణం, బృందంలోని వ్యక్తుల మధ్య ఏర్పడే అనుమానాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి. యాక్షన్ సీక్వెన్సులు, జాంబీల దాడుల సీన్లు ఈ జానర్‌ను ఇష్టపడేవారికి మంచి థ్రిల్ ఇస్తాయి.

Advertisement

Also Read : మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా

స్ట్రీమింగ్ తెలుగులో కూడా

కార్లెస్ టోరెన్స్ (Carles Torrens) దర్శకత్వం వహించిన ఈ స్పానిష్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్‌లో కార్లోస్ అల్కైడే (Carlos Alcaide), జూలియా మార్టినెజ్ (Julia Martínez), జోస్ మారియా యాజ్‌పిక్ (José María Yázpik), మోనికా లోపెజ్ (Mónica López), బెర్టా వాజ్క్వెజ్ (Berta Vázquez) తదితరులు నటించారు. ‘అపోకాలిప్స్ జెడ్ న్యూ వరల్డ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఆడియోలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ‘ట్రైన్ టు బుసాన్’, ‘వరల్డ్ వార్ జెడ్’ లాంటి జాంబీ సినిమాలు నచ్చినవారికి ఈ మూవీ మంచి వీకెండ్ ఛాయిస్.

Related News

రిటైర్మెంట్‌ తీసుకున్న దొంగకు భారీ దోపిడీ ఛాన్స్‌… వంద మిలియన్ డాలర్ల ప్లాన్‌ బెడిసికొడితే… హై వోల్టేజ్‌ హీస్ట్ థ్రిల్లర్‌

మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా

వెకేషన్ కోసం ఇళ్లు మార్చుకున్న జంటలు… చివరకు మర్డర్ మిస్టరీలో… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఇంకా చూడలేదా ?

మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

గంటకు 50 రెట్లు జీతం ఇస్తామంటూ జాబ్ ఆఫర్… ఒక్కో షిఫ్ట్‌లో ఊచకోత… క్రేజీ కొరియన్ హారర్ థ్రిల్లర్‌ తెలుగులో

Big Stories

Advertisement
×