Radhamma Kuthuru:గాజులు గల గల అంటూ ఒక్క పాటతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ కొట్టేసింది రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య.వచ్చిన 12 రోజుల్లోనే ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. అయితే పాట ఒకవైపు సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే మరో వైపు దివ్య కి ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో అంతకు మించిన విమర్శలు వచ్చాయి.ఇక ఇవిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య తానేం చేస్తున్నానో,గతంలో ఏ ఏ పాటలు చేశాను అనే ఆసక్తిరమైన విషయాల్ని ఇలా చెప్పుకొచ్చింది.
ఒకవైపు చదువుకుంటూనే
ఇక తాను ప్రస్తుతం mba రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపింది.అయితే ఒకవైపు చదువుకుంటూనే షార్ట్ ఫిలిమ్స్ ,ఫోక్ సాంగ్స్ చేస్తున్నానని ,ఇప్పటికే దాదాపు నాలుగైదు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించానని చెప్పింది.అయితే గాజులు గల గల పాట మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాక తాను సోషల్ మీడియాలో వైరల్ అయ్యానే తప్ప గత కొన్నేళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపింది.
సర్పంచ్ ప్రేమకథ అనే షార్ట్ ఫిలిమ్
ఇక తను చేసిన ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ తను మొదటిసారిగా సర్పంచ్ ప్రేమకథ అనే షార్ట్ ఫిలిమ్ లో నటించానని ,అది దాదాపు రెండు లక్షల వ్యూస్ ని దాటిందని తెలిపింది.అంతే కాకుండా చనిపోయిన వైషు అమ్మ వాళ్ళ ఆనం అయిన సూపర్ రంజిత్ తో కలిసి పట్నం పోతావ్ బావా అనే ఫోక్ సాంగ్ లో కూడా మెయిన్ లీడ్ గా నటించానని ఇక ఈ పాట ఇప్పటికె వన్ మిలియన్ వ్యూస్ కూడా దాటిపోయిందని తెలిపింది.
ఇలా ఇప్పటికే పదుల సంఖ్యలో చేసినప్పటికీ రాని ట్రోల్స్ కేవలం రాత్రికి రాత్రే గాజులు గలగల పాట మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడంతో ఓర్వలేక ఇలా నెగెటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారని ,ఇలా సెన్సేషన్ క్రియేట్ చేసినందుకు మెచ్చుకోవాలి కాని ఇలా ట్రోల్ చేయడం ఏంటని వాపోయింది.
ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటా
ఇక కొంతమందికి తానేదో డబ్బులు ఇచ్చి కొంతమందితో తనకి సపోర్ట్ గా మాట్లాడాలనిపించాను అని అని అంటున్నారు ,అసలు అందులో ఎలాంటి నిజం లేదని ఒకవేళ ఎవరైన అది ప్రూవ్ చేస్తే తనే ఇంస్టా అకౌంట్ ని డిలీట్ చేస్తానని చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం తనపై వస్తున్న ట్రోల్స్ పై రియాక్ట్ అయితూ ఈ వివాదాల నుండి బయటపడి, ప్రశాంతంగా పెళ్లి చేసుకొని తనదారేదో తను చూసుకోవాలి అన్నంత బాధ కలుగుతుందని మనసులోని ,బాధని బయటపెట్టింది.
ALSO READ :గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!
ఎప్పుడు ఈ విమర్శల జడివాన నుండి తప్పించుకుంటుందో !
అంటే కాకుండా ఇక ఎవరెన్ని అన్నా సోషల్ మీడియాలో ఎలాంటి విధంగా రియాక్ట్ అవ్వకూడదని డిసైడ్ అయ్యానని తెలిపింది.ఇప్పటి నుండి కేవలం తన చదువు,తన కెరీర్ పై మాత్రమే ఫోకస్ చేస్తానని ,ఈ విమర్శల మాయలో పడి తన టార్గెట్ ని మిస్ కావాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది.చూడాలి మరి గాజుల గాజుల గల గలతో వైరల్ అయిన ఈ రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ఎప్పుడు ఈ విమర్శల జడివాన నుండి తప్పించుకుంటుందో !