Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఈ వారం మల్లి సీరియల్(Malli Serial) ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి లాస్య (Lasya)ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది ఇందులో భాగంగా లాస్య ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch)గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ ఎంతోమంది సెలబ్రిటీ తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి బహిరంగంగా మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని మనకు నచ్చిన పాత్రలలో చేయాలి అంటే కూడా తప్పకుండా కమిట్మెంట్స్ అడుగుతారని చాలామంది సెలబ్రిటీలు ఇదివరకే తెలియజేశారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి లాస్యకు కూడా ఇదే ప్రశ్న ఎదురయింది. ఎప్పుడైనా ఇండస్ట్రీలో నచ్చిన పాత్ర చేయడం కోసం కమిట్మెంట్ అడిగారా అంటూ ప్రశ్నలు ఎదురు కావడంతో లాస్య ఇండస్ట్రీలో తనకు ఎదురైనా చేదు సంఘటనల గురించి తెలిపారు.
లాస్య క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చాలా వరకు తాను కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశానని తెలిపారు. క్యాస్టింగ్ డైరెక్టర్ కాల్ చేసి మాకు తెలిసిన బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు సో మీరు ఏమైనా అంటూ నేరుగా కమిట్మెంట్స్ గురించి అడిగారని లాస్య తెలిపారు. మరి కమిట్మెంట్స్ గురించి ఈమె ఇంకా ఎలాంటి విషయాలను తెలియచేశారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ లాస్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా లాస్య నేరుగా వర్షను ప్రశ్న వేశారు. మీరు కూడా సీరియల్స్ లో చేశారు ఇలా సీరియల్స్ నుంచి ఎందుకు దూరమయ్యారు అంటూ ప్రశ్న వేయడంతో అందుకు వర్షా కూడా సమాధానం చెబుతాను ఏడు సంవత్సరాలు కంటిన్యూగా సీరియల్స్ చేశానని చెప్పారు అయితే ఈమె హాస్పిటల్స్ లో ఉన్నటువంటి కొన్ని క్లిప్స్ యాడ్ చేశారు. మరి ఎందుకు వర్ష సీరియల్స్ నుంచి తప్పుకున్నారనేది తెలియాలి అంటే కూడా పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: నల్లగా ఉన్నారని నాన్నను ఇష్టపడమా? కాబోయే భర్త పై లాస్య కామెంట్స్!