E-Paper
Advertisement

నేను గోల్డెన్ లెగ్ అంటున్న మల్లి సీరియల్ నటి లాస్య..ఏ సీరియల్ చేసిన బ్లాక్ బస్టర్!

నేను గోల్డెన్ లెగ్ అంటున్న మల్లి సీరియల్ నటి లాస్య..ఏ సీరియల్ చేసిన బ్లాక్ బస్టర్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ వారి కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా ప్రతి వారం బుల్లితెర నటీనటులతో సందడి చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మల్లి సీరియల్ (Malli Serial)నటి లాస్య (Lasya)పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మల్లి సీరియల్ తో గుర్తింపు పొందిన లాస్య..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా లాస్య తన సీరియల్స్ కి సంబంధించిన విషయాలతో పాటు ఇండస్ట్రీలో ఎదురైనా అనుభవాల గురించి తన తల్లిదండ్రుల గురించి పలు విషయాలను తెలియచేశారు. ఇక ఈమె స్టార్ మా లో ప్రసారమైన మల్లి అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే వర్ష ప్రశ్నిస్తూ మల్లి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గర అయిపోయారు. ఈ సీరియల్ కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

గోల్డెన్ లెగ్ అనుకుంటా..

Advertisement

ఈ ప్రశ్నకు లాస్య సమాధానం చెబుతూ ప్రస్తుతం తాను తమిళంలో సంధ్యారాగం సీరియల్ చేస్తున్నాను. ఈ సీరియల్ దాదాపు 1000 ఎపిసోడ్లను పూర్తి చేసుకొని విజయవంతంగా ప్రసారమవుతుందని తెలిపారు. తెలుగులో లక్ష్మీనివాసం సీరియల్ చేస్తున్నాను ఇది కూడా 500 ప్లస్ ఎపిసోడ్స్ ప్రసారం అవుతుందని లాస్య తెలిపారు. ఇలా ఈమె చేస్తున్న సీరియల్స్ అన్నీ కూడా 1000 ఎపిసోడ్స్ పైనే ప్రసారమవుతున్న నేపథ్యంలో వర్ష గోల్డెన్ లెగ్ అనుకుంటా అంటూ మాట్లాడగా వెంటనే లాస్య మేబి నేను కూడా అదే అనుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చారు.

Advertisement

ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా మీరు సింగలా , కమిటెడా అంటూ కూడా ప్రశ్న వేయడంతో ప్రస్తుతానికి తాను సింగిల్ అని తెలిపారు. తనకు పెద్దగా బయట తిరగడానికి నచ్చదని ఇంట్లోనే తన ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తానని తెలిపారు. ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు తన అమ్మ నాన్నలతో పాటు వెళ్లానని అయితే పబ్ కు కూడా మా అమ్మ నాన్నలను తీసుకువెళ్లానని ఈమె చెప్పటం విశేషం. అలాగే తను వైజాగ్ లో పుట్టి పెరగానని చెప్పడంతో వైజాగ్ స్లాంగ్ లో మాట్లాడుతూ, పాటలు పాడుతూ లాస్య ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

Also Read: ‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?

Related News

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన మల్లి సీరియల్ నటి!

గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

నల్లగా ఉన్నారని నాన్నను ఇష్టపడమా? కాబోయే భర్త పై లాస్య కామెంట్స్!

తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!

బిగ్ బాస్ లో ఆ నలుగురికి జీరో స్టార్స్.. కంటెస్టెంట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున!

బాయిలోనే బల్లిపలికే పాటతో సెన్సేషన్.. నాగవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఆ పని చేసి ఉంటే విన్నర్ అయ్యేవారు: కౌశల్ మండా

Big Stories

Advertisement
×