Nagavva Singer:నాగవ్వ..ఈ పేరు చెబితే అంత ఈజీగా గుర్తుపట్టరేమో కాని బాయిలోనా బల్లి పలికే సింగర్ అని చెప్పగానే ఈజీగా గుర్తుపట్టేస్తారు.పుట్టిన ఊరిలోనే పాటలు పాడుకునే నాగవ్వ సోషల్ మీడియా పుణ్యమా అని ఇపుడు పాపులర్ అయిపొయింది.ముఖ్యంగా తను పాడిన పాటలు మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.దీంతో అసలు నాగవ్వ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?పాడిన ఆ పాటలేంటి?ఒక్కో పాటకి అసలు ఎంత పారితోషికం తీసుకుంటుంది అంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు ఫోక్ లవర్స్.
పుట్టింది జగిత్యాల జిల్లా లోని అంబారి పేటలో
నాగవ్వ విషయానికి వస్తే.. తను పుట్టింది జగిత్యాల (కరీంనగర్)జిల్లా లోని అంబారి పేట అనే చిన్న ఊరిలో.చిన్నతనం నుండే నాగవ్వ తండ్రి యక్ష గాన కళాకారుడు అవ్వడం వల్ల ఇంట్లో పాటల సందడి బాగా ఉండేది.ఆ కారణంగా నాగవ్వకి కూడా చిన్నప్పటి నుండే పాటలు పాడటం అలవాటు అయింది.ఇక తను కేవలం పెద్ద బాలశిక్ష మాత్రమే చదువుకోగలిగింది.ఇక పొలం కాడికి పోయినప్పుడు ,ఖాళీ సమయాలలో తండ్రి నేర్పిన పాటలు,బతుకమ్మ పాటలు ,కాముని పాటలు పాడేది.అయితే పెళ్లి అయ్యి అతారిల్లు గుల్లకోటకి వచ్చినంక కూడా పాటలు పాడటం విచిపెట్టలేదు నాగవ్వ.ఇక నాగవ్వ భర్త కూడా భజన పాటలు పాడేవాడు.దాంతో నాగవ్వ పాడే పాటలని కూడా ప్రోత్సహించేవాడు.
మొదటి పాట నా తిరుపతి రెడ్డి
ఇక మొదట్లో ఊర్లోనే పాటలు పాడుకుంటే నాగవ్వ తన చిన్న కొడుకు శ్రీకాంత్ కారణంగా యూట్యూబ్ ఛానల్ లో పాటలు పాడటం మొదలెట్టింది.అలా పాడిన మొదటి పాట నా తిరుపతి రెడ్డి.2022లో వచ్చిన ఈ పాట ఇప్పటి వరకు 14 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకోవడం విశేషం.ఇక ఆ తర్వాత పాడిన నా మొహనలాలి పాట కూడా నాగవ్వ కెరీర్ లో మంచి జానపదంగా నిపిచిపోయింది.మూడేళ్ళ కిందట వచ్చిన ఈ పాట ఇప్పటికి 11 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది.
మాధురీ రాథోడ్ ,ఈశ్వర్ సాయి కలిసి స్టెప్పులేసిన సిటీ చీర
ఇక మారాజు మా బావ అంటూ పాడిన పాట కూడా రెండేళ్ళ కిందట విడుదలై 12 లక్షల మందికి పైగా చేరింది.ఇక నాగదుర్గ స్టెప్పులేసిన మామిడికోనాల మీనా పాట కూడా నాగవ్వ పాడిన పాటల్లో స్పెషల్ గా చెప్పుకోవాలి.మధుప్రియతో కలిసి పాడిన ఈ పాట కేవలం 8 నెలల్లోనే ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఇక మాధురీ రాథోడ్ ,ఈశ్వర్ సాయి కలిసి స్టెప్పులేసిన సిటీ చీర కూడా నాగవ్వ గొంతు లోంచి జాలువారిన పాటే.చుంచు మల్లేశం రాసిన ఈ పాటని మల్లేశం, నాగవ్వ కలిసి పాడగా ఇప్పటికే 72 లక్షల మందికి చేరి నాగవ్వ సత్తా ఏంటో చూపించింది.
బాయిలోనే బల్లి పలికే సాంగ్స్ నెక్స్ట్ లెవెల్
అయితే ఇవన్ని ఒకెత్తు అయితే మంగ్లీతో కలిసి పాడిన బాయిలోనే బల్లి పలికే సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ని చెప్పాలి.ఎప్పుడో రాక్షస కావ్యం కోసం రూపొందించిన ఈ పాట మొత్తానికి ప్రైవేట్ ఆల్బంగా రిలీజ్ అయి సోషల్ మీడియాని షేక్ చేసింది. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీలో మంగ్లీ,నాగవ్వ కలిసి పాడి ,నటించిన ఈ పాట ఇప్పటికి 186మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుని మరింతగా దూసుకుపోతుంది.అయితే వీటన్నింటి విజయాల వెనక కారణం నాగవ్వ గొంతులో పలికే పల్లె జీవితమే అని చెప్పక తప్పదు.
ఒక్కో పాటకి డిమాండ్ ని బట్టి 20 వేల నుండి 80 వేల మధ్యలో
ఇక నాగవ్వ పారితోషికం విషయానికి వస్తే..ఒక్కో పాటకి డిమాండ్ ని బట్టి 20 వేల నుండి 80 వేల మధ్యలో తీసుకుంటుందని సోషల్ మీడియాలో వినిపిస్తుంది.అయితే సందర్భం బట్టి ఈ మొత్తం ఎక్కువ లేదా తక్కువ కావడం కూడా జరుగుతుందని తెలుస్తుంది.అయితే పాటలకి కాస్త అటూ ఇటుగా అయినా మిగతా ఈవెంట్స్ ,షోస్ వంటి వాటితో నాగవ్వ బాగానే వెనకేస్తుందని వినిపిస్తుంది.మరి ఇందులో నిజమెంతో నాగవ్వనే స్వయంగా బయటపెడితే కాని తెలీదు !
ALSO READ :గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!