E-Paper
Advertisement

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!
Advertisement

Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ (Bigg boss);ఇప్పుడు 10వ సీజన్లో తొమ్మిదవ వారం చివరి దశకు చేరుకుంది. ఇకపోతే గత వారం ఎలిమినేషన్ లో ఝాన్సీ, రోహిత్ నాయుడు ఎలిమినేషన్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాప్ 5 లో నిలవాల్సిన వ్యక్తి 8వ వారమే ఎలిమినేట్ అవ్వడంతో రోహిత్ ను మళ్లీ హౌస్ లోకి తీసుకోవాలని కొంతమంది నెటిజన్స్ డిమాండ్ చేయగా. ఆయన అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున బిగ్ బాస్ పై మండిపడ్డారు కావాలనే రోహిత్ ను ఎలిమినేట్ చేశారు అంటూ విమర్శలు గుప్పించాడు. అటు నాగార్జున హోస్టింగ్ ను కూడా తప్పుపట్టారు. దీంతో తొమ్మిదవ వారం ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు అనే ఉత్కంఠ కూడా నెలకొంది.

డేంజర్ జోన్లో సుధీర్ రెడ్డి..

ఇక ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఏకంగా 10 మంది నామినేషన్ లోకి వచ్చారు. రాంప్రసాద్, నీతూ, అమన్, నరేష్, వంశీ, వర్షిణి, ముఖేష్ గౌడ, శివకుమార్, సుధీర్, దేబ్జాని నామినేషన్ లో నిలిచారు. వీరిలో రోహిత్ లేకపోవడం, త్రిగుణ్ కూడా నామినేషన్స్ నుండి తప్పుకోవడంతో ముఖేష్ గౌడ కి భారీ ఓట్లు లభించాయి. ప్రస్తుతం ఆయన టాప్ లో కొనసాగుతున్నారు. సపోర్ట్ తో పాటు కెప్టెన్సీ కూడా కలిసి రావడంతో టెంపర్ వంశీ రెండవ స్థానంలో దూసుకుపోతున్నారు. ఇక ఆ తర్వాత రాంప్రసాద్, అమన్, నరేష్, దెబ్జానీలు సేఫ్ జోన్ లో ఉన్నట్లు ఓటింగ్ చూస్తే అర్థమవుతుంది. వర్షిని, శివకుమార్, సుధీర్ లీస్ట్ పర్సంటేజ్ లో ఉండగా.. గతవారం ముఖేష్ పవర్ ద్వారా తృటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న సుధీర్.. తక్కువ ఓట్లు సాధించడంతో ఈ వారం ఎలిమినేట్ అవుతారు అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఊహించని సర్ప్రైజ్..

Advertisement

అయితే ఇలాంటి సమయంలో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. అది కూడా దీపావళి కావడంతో.. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ తొమ్మిదవ వారంలో ఎలాంటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళి ధమాకా ట్రీట్ గా బిగ్ బాస్ మేకర్స్ ఈ వారం ఎలిమినేషన్ ను రద్దు చేసే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

also read: అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న జెన్ జీ మెచ్చిన మూవీ.. ఏది? ఎక్కడంటే?

డబుల్ ఎలిమినేషన్ తప్పదా?

Advertisement

ఒకవేళ ఇదే గనుక నిజమైతే డేంజర్ జోన్ లో ఉన్న సుధీర్ కి ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఒకవైపు గ్రాండ్ ఫినాలే కి కౌంట్ డౌన్ మొదలవుతున్న సమయంలో.. హౌస్ లో ఇంకా చాలామంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. మధ్య మధ్యలో నో ఎలిమినేషన్ వీక్ గనుక వస్తే.. రాబోయే రోజుల్లో హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ అమలు చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ వారం ఎలిమినేషన్ నుండి కంటెస్టెంట్స్ తప్పించుకోబోతున్నారని చెప్పవచ్చు.

Related News

ఫస్ట్ టైమ్ నాగ్ చేత తిట్లు తిన్న నరేష్.. కన్నీళ్ల వెనుక అసలేం జరిగిందంటే?

Karthika Deepam 2 Serial Today Episode November 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లతో చాలెంజ్ చేసిన జ్యోత్స్న 

Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Brahmamudi Serial Today Episode November 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇంట్లో మార్పులకు రాజు  శ్రీకారం – అయోమయంలో రేఖ

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య .. పల్లవికి మరో షాక్.. రమ్యను కొట్టిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? అడ్డంగా బుక్కయిన అరుణ్.. హైలెట్ సీన్ ఇదే..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు భద్ర ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా సర్ప్రైజ్.. నర్మదా ప్లానేంటి..?

Big Stories

Advertisement
×