E-Paper
Advertisement

బడా కంపెనీలకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. ఇక మహిళల చేతుల్లోకి సోలార్ విద్యుత్..?

బడా కంపెనీలకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. ఇక మహిళల చేతుల్లోకి సోలార్ విద్యుత్..?
Advertisement

CM Revanth: కొడంగల్ పర్యటలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ పరిదిలోని హకీంపేట్ మహిళా సంఘాలతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం వారితో మట్లాడారు. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరురాలు కావడమే నా జీవిత లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరురాలు కావడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. కుట్టే వ్యాపారం కోసం మంచి మెషిన్లతో శిక్షణ ఇప్పించి, ఆ వ్యాపారాన్ని ప్రభుత్వం మహిళల చేతుల్లోనే పెట్టిందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 15 నుండి 20 కోట్ల రూపాయల ఆదాయం మహిళల చేతిలో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.

కుటుంబానికే చెప్పనోడు.. ప్రజలకు చేస్తారా..

కేటీఆర్ గురించి ఆయన సొంత చెల్లెలే తీవ్ర వ్యాఖ్యలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొడుకు అలా ప్రవర్తిస్తుంటే తండ్రి కేసీఆర్ పిలిచి మందలించాల్సింది పోయి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. తన కుటుంబంలోని నలుగురిని ఒక దగ్గర కూర్చోబెట్టి మంచి చెడు చెప్పలేని వ్యక్తి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మంచి చేస్తాడని ఎలా నమ్మాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేటీఆర్‌ సొంత చెల్లినే గెంటేశారు..

Advertisement

కష్టకాలంలో పుట్టింటికి వచ్చిన సొంత చెల్లెలికి అండగా నిలవాల్సింది పోయి, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఆమెను ఇంట్లోకి రానీయకుండా బయటికి గెంటేశారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సమస్య చేయి దాటినప్పుడే ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటికి వస్తుందని, అలాంటి సమయంలో సొంత అన్నే చెల్లెలిని వెళ్లగొట్టడం దుర్మార్గమైన చర్య అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Also Read: మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు?

Advertisement

ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో వ్యాపారం దెబ్బతిన్నదని, తక్షణమే ఆ పథకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహిళలపై కక్ష కట్టి, కడుపులో విషం పెట్టుకొని ఉచిత బస్సును రద్దు చేయాలని తనపై యుద్ధానికి వచ్చారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసే సమస్యే లేదని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. ఈ పథకాన్ని ఎవరైనా రద్దు చేయాలని డిమాండ్ చేస్తే మహిళలు చీపురుతో సమాధానం చెప్పాలని సీఎం హెచ్చరించారు.

సంక్షేమ పథకాలతో..

ప్రతి ఇందిరమ్మ ఇల్లును ఆడబిడ్డల పేరు మీదే ఇవ్వడం వల్ల, ఏవైనా తగాదాలు వస్తే భర్తలను “బయటకు నడు, నీ ఇంటికి వెళ్లు” అని చెప్పే ధైర్యం మహిళలకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇల్లు, రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలు మహిళలకు ఎంతో భరోసాను ఇస్తున్నాయని సీఎం పేర్కోన్నారు. కష్టపడి సంపాదించిందంతా కరెంటు, పాలు, నల్ల బిల్లులకే ఖర్చైతే పిల్లల చదువులు, పండుగలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

వ్యాపారవేత్తలుగా ఆడబిడ్డలు..

మహిళా సాధికారతలో భాగంగా పెట్రోల్ బంకుల నిర్వహణతో ప్రతి నెలా ఒక్కో బంకుపై ఆడబిడ్డలు రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు సంపాదిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే గతంలో పెద్ద కంపెనీలకే పరిమితమైన సోలార్ విద్యుత్ ఉత్పత్తిని జిల్లాకు వెయ్యి మెగావాట్ల చొప్పున మహిళల చేతికి అప్పగించామని తెలిపారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్ల నిర్వహణ, 70 లక్షల మంది మహిళలకు రూ. 79 వేల కోట్ల బ్యాంకు లింకేజ్ కల్పించడంతో పాటు, వారికి ఆర్థికతోడ్పాటు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Also read: కటకటాల వెనుక అక్షర వెలుగులు.. ఖైదీల విద్యా హక్కుపై తెలంగాణ సంచలనం!

Tags

Related News

డబిల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో డ్రైవర్ మృతి!

ధరణి అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 9 మంది అరెస్ట్ కీలక నేతగా..?

కటకటాల వెనుక అక్షర వెలుగులు.. ఖైదీల విద్యా హక్కుపై తెలంగాణ సంచలనం!

తెలంగాణ యంగ్ క్రికెటర్లకు భారీ గుడ్ న్యూస్..?

అమెరికాలో జగిత్యాల యువకుడు అనుమానాస్పద మృతి..!

గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు

Big Stories

Advertisement
×