Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్’ కుకింగ్ షోతో ప్రేక్షకులను అలరిస్తోంది. సోనీ విళా ఛానెల్, సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు సమంత హోస్ట్, సెలబ్రిటీ జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రెగ్నెన్సీ గ్లోతో ఎంతో అందంగా కనిపిస్తూ షోను నడిపిస్తున్న సమంతకు తాజాగా కంటెస్టెంట్లు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో చూద్దాం.
ఈ షోలో కంటెస్టెంట్లందరూ సమంతపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ప్రత్యేకంగా పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ప్లాన్ చేశారు. త్వరలోనే అమ్మ కాబోతున్న సమంత కోసం జానపద గాయకుడు మథిచియం బాలా, చిన్నపిల్లల బొమ్మలు, అందమైన ఆర్ట్‌వర్క్‌లు ఇచ్చారు. ఇక వీటితో పాటు చిన్న పిల్లలు నడక నేర్చుకోవడానికి ఉపయోగపడే బుల్లి సైకిల్‌ను కూడా కానుకగా అందించారు.
కంటెస్టెంట్లు ఇచ్చిన ఈ క్యూట్ గిఫ్ట్స్ చూసి సమంత ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ సమయంలో ఆమె ఇచ్చిన క్రేజీ రియాక్షన్, వీడియో క్లిప్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా, వేదికపై సమంత సినీ ప్రయాణానికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను కూడా గత ఎపిసోడ్ లలో ప్లే చేశారు. అది చూసి సమంత చాలా ఎమోషనల్ అయింది. బాలా, మిగతా కంటెస్టెంట్లు అందించిన ఆత్మీయ కానుకలు చూసి ఆమె మురిసిపోయింది. అంతేకాదు తనకు పుట్టబోయే బిడ్డ ఎవరైనా సరే నడక నేర్చుకునేటప్పుడు.. ఈ వస్తువులను ఉపయోగించినప్పుడు ఆ ఫోటోలను కచ్చితంగా మీకు సెండ్ చేస్తాను అంటూ ప్రామిస్ చేసింది.
తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ షోలో మొదటిసారి కిచెన్‌లోకి అడుగుపెట్టి తమ వంటల టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఇక కఠినమైన వంట ఛాలెంజ్‌లు, ఊహించని ట్విస్టులను దాటుకుంటూ జడ్జెస్‌ను మెప్పించేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు.
ఇక కేవలం వంటల పోటీ మాత్రమే కాకుండా, సమంత మరియు కంటెస్టెంట్ల మధ్య ఉన్న ఈ సరదా, ఎమోషనల్ బాండింగ్ షోకు మరింత ఆకర్షణగా మారింది. ఈ ఎపిసోడ్ సోనీ విళా, సోనీ లివ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
also read: సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!
సమంత విషయానికి వస్తే రీ ఎంట్రీలో మా ఇంటి బంగారం సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరి సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. ప్రెగ్నెన్సీ లోనే కుకింగ్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరిలో ఈమె డెలివరీ కాబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పండంటి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&xtok=NTc4MTIwNjQ2YQ==