E-Paper
Advertisement

అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?

అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న వారిలో నటరాజ్ మాస్టర్ ఒకరు. ఇప్పటివరకు ఈయన సినిమాలకు కొరియోగ్రఫీ అందించక పోయిన ఎన్నో డాన్స్ షో కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగారు. అదేవిధంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేశారు. ఇకపోతే తాజాగా నటరాజ్ మాస్టర్(Nataraj Master) బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే అగ్నిపరీక్ష (Agnipariksha)కార్యక్రమం గురించి కూడా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నటరాజ్ మాస్టర్ బిందు మాధవి మధ్య గొడవ..

నటరాజ్ మాస్టర్ ఇది వరకే రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ లో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ అలాగే బిందు మాధవి (Bindhu Madhavi)మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనే విధంగా వివాదాలు కొనసాగేవని చెప్పాలి. ఇలా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉండేవి. నాడు నామినేషన్స్ సందర్భంగా బిందు మాధవిని శూర్పణఖ అంటూ బాణాలు విసరడం, దీనికి బిందు మాధవి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది అయితే తాజాగా ఈ అంశం గురించి అగ్ని పరీక్షలో భాగంగా బిందు మాధవి మాట్లాడుతూ… ఆ సమయంలో తాను చాలా ఇరిటేట్ అయ్యానని కానీ అలాంటి వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి వారికి థాంక్స్ చెప్పాలని బిందు మాధవి మాట్లాడారు.

మొహానికి నీళ్ళు కొట్టడం ఏంటీ?

Advertisement

ఇలా బిందు మాధవి చేసిన ఈ వ్యాఖ్యల గురించి నటరాజు మాస్టర్ తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఒక వేదికపై కూర్చుని అలాంటి మాటలు మాట్లాడటం సరికాదు తన మాటలను వెంటనే బిందు మాధవి వెనక్కి తీసుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఇదే అంశం గురించి ప్రస్తావనకు రావడంతో నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. అగ్నిపరీక్ష ద్వారా ఒక మనిషి మోహనా నీళ్లు చల్లడం అక్కడికి వెళ్తే ఇలాంటి పరిస్థితులను తట్టుకుంటావో లేదో అంటూ ఇక్కడ టెస్టు చేయడం, తట్టుకోలేకపోతే ఇంటికి వెళ్లిపోతాడు. మీకు కావాల్సింది ఆయన క్యాపబిలిటీగా మాట్లాడుతున్నారా లేదా టాస్కులు ఆడుతున్నారా లేదా అని మాత్రమే చూడాలి కాని ఇక్కడే అవమానించి పంపిస్తే అక్కడ వెళ్లిన తర్వాత కిక్కేం ఉంటుంది అంటూ అగ్నిపరీక్ష కార్యక్రమం పై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

అగ్ని పరీక్ష లో భాగంగా తన పేరు రావడంతో ఈ విషయం గురించి నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ ఆ సమయంలో ఆమెకు చెప్పాలనిపించింది చెప్పింది అయితే సరిగా చెప్పి ఉంటే బాగుండేది. ప్రతి మనిషి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అలాంటప్పుడు గౌరవం ఇచ్చి మాట్లాడాలి అంటూ బిందు మాధవి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత తనతో ఒక రెండు సార్లు మాట్లాడాను మా పాప బర్త్డేకి కూడా పిలిచాను రాలేదు. రావడం రాకపోవడం తన ఇష్టం కానీ పది మందిలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా అంటూ మరోసారి బిందు మాధవి వ్యవహార శైలి పై నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు.

Also Read: గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్

Related News

అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్

గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెడుతున్న ఇద్దరు కామనర్స్ వీరే!

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

Big Stories

Advertisement
×