E-Paper
Advertisement

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!
Advertisement

Dhee 10 winner Raju: బుల్లితెరపై ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ఢీ కార్యక్రమా ద్వారా ఎంతో మంది మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజు ఒకరు. ఢీ 10 విన్నర్ (Dhee 10 winner)గా నిలిచిన రాజు ఇప్పుడిప్పుడే కెరియర్ పరంగా మంచి సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ఈయన అరెస్టు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవకాశాల పేరుతో ఒక యువతి పట్ల లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈయనని అరెస్టు చేశారు.హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాజుని అదుపులకు తీసుకున్నారు.

సినిమా అవకాశాల పేరుతో మోసం..

బాధిత యువతీ ఫిర్యాదు మేరకు సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించిన డ్యాన్స్ మాస్టర్ రాజు, తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించాడని యువతి తెలిపింది. ఇలా వేధింపులకు గురి చేయడమే కాకుండా,తన నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రస్తుతం ఈయన రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా రాజు అరెస్టు కావడంతో అసలేం జరిగింది ఈ కేసు వెనుక గల కారణాలు ఏంటి అనే విషయంపై అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజు తల్లి పద్మ (Padma)ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఆత్మహత్యకు పాల్పడిన రాజు…

తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు అంటూ పద్మ ఎమోషనల్ అయ్యారు. గత కొద్దిరోజులుగా డబ్బు కావాలి అంటూ బెదిరిస్తున్నారని ఇలాంటి బెదిరింపులు తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ సమయంలోనే తన స్నేహితుల తనని కాపాడారని పద్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తన స్నేహితురాలు అంటూ ఆ అమ్మాయి రెండు మూడు సార్లు మా ఇంటికి కూడా వచ్చిందని పద్మ తెలిపారు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని, తన కొడుకు కంటే వయసులో ఆమె చాలా పెద్దదని పద్మ తెలిపారు.

డబ్బు కోసం ఇబ్బందులు పెడుతున్నారు..

Advertisement

నా కొడుకు రాజుకు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే కానీ ఆ అమ్మాయి వయసు 35 ఉంటుందని, వయసులో తన కొడుకు కంటే చాలా పెద్దది కానీ డబ్బు కోసమే తన కొడుకును వేధిస్తూ ఇబ్బందులు పెడుతుందని తెలిపారు. ఇప్పుడిప్పుడే తన కొడుకుకు మంచి పేరు వస్తుందని ఆ మంచి పేరు రావడంతోనే ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ పద్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. నా కొడుకు ఇలాంటి తప్పు చేయలేదు తనని కాపాడండి అంటూ ఈమె మీడియా వేదికగా వేడుకున్నారు. తన కొడుకు తప్పులేదు అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజంగానే ఈ కేసు విషయంలో రాజు తప్పు లేదా? ఉద్దేశపూర్వకంగానే అతనిని ఈ కేసులో ఇరికించారా? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సెప్టెంబర్ 9వ తేదీన రాజు అరెస్ట్ అయ్యారని తెలుస్తుంది. ఇలా అరెస్టు అయినప్పటికీ ఆలస్యంగా తన అరెస్టు విషయం వెలుగులోకి రావడంతో రాజు అరెస్ట్ వెనుక ఏం జరుగుతోంది అంటూ సినీ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

Also Read:  లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

Related News

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెడుతున్న ఇద్దరు కామనర్స్ వీరే!

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Big Stories

Advertisement
×