E-Paper
Advertisement

గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్

గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ (Nataraj Master)పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో అంశాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రావడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే మనకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉంటేనే అవకాశాలు వస్తాయని లేదంటే అవకాశాలు రావడం చాలా గగనమని అందరూ చెబుతూ ఉంటారు. నటరాజ్ మాస్టర్ సైతం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోతే సినిమా అవకాశాలు రావని తెలిపారు.

బ్రతుకుతెరువు కోసం డ్యాన్స్..

తాను కూడా సినిమా ఇండస్ట్రీలో హీరో అవుదామని ఇక్కడికి వచ్చాను కానీ తనకు ఎలాంటి అవకాశాలు రాలేదు అలాగే అసలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో అవకాశం వచ్చిన పెద్దగా తన కెరీర్ కు ఉపయోగపడలేదని తెలిపారు. ఇలా హీరో అవుదామని వచ్చిన తనకు బ్రతకడమే కష్టంగా మారింది. తినడానికి తిండి లేక నీళ్లు తాగి బ్రతికిన రోజులు కూడా ఉన్నాయని తన కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఇలా బ్రతుకే భారమైన సమయంలో బ్రతుకుతెరువు కోసం తాను కొరియోగ్రాఫర్ గా మారాల్సి వచ్చిందని నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఇక తనకు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చే కోరికలు లేకపోయినా డైరెక్టర్ అవ్వాలని కోరిక మాత్రం చాలా ఉందని ఆ దిశగానే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

సినీ బ్యాగ్రౌండ్ ఉంటేనే అవకాశాలు..

Advertisement

ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా మనకంటూ ఒక సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఉండాలని అప్పుడు మాత్రమే సినిమా అవకాశాలు వస్తాయి అని తెలిపారు. ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమా అవకాశాలు వచ్చాయి అంటే అది మన అదృష్టం, ప్రకృతి వైపరీత్యం అని మాత్రమే చెప్పాలి అంతేకానీ మనకంటూ అవకాశాలు వెతుకుతూ రావని నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఇక ఈయన తన తదుపరి కెరియర్ ప్లానింగ్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ అవ్వాలని కోరికగా ఉందని అదే దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయని త్వరలోనే తన డైరెక్షన్ లో సినిమా రాబోతుందని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఇక తన డైరెక్షన్లో రాబోయే సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కాబోతున్నాయని తెలుస్తుంది. అయితే ఈయనకు హర్రర్ సినిమాలంటే ఎక్కువగా ఇష్టమని అదే జోనర్ లో సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్ తన కెరియర్ లో జరిగిన ఒడిదుడుకుల గురించి తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈయన హీరోగా అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఆ కాల నెరవేరకపోవడంతో ఇప్పటివరకు సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ చేయలేదని ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

 

Related News

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెడుతున్న ఇద్దరు కామనర్స్ వీరే!

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×