Big Tv Kissik Talks: నటరాజ్ మాస్టర్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే నటరాజ్ మాస్టర్ తన భార్యతో కలిసి ఇటీవల పాల్గొన్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్(Mad For each other) కార్యక్రమం గురించి మాట్లాడుతూ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) అలాగే జడ్జి అనిల్ రావిపూడి(Anil Ravipudi) పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కార్యక్రమంలో ప్రాణాలు పోయే విధంగా టాస్కులు ఉంటాయని బహుశా ఈ కార్యక్రమం ఆధారంగానే బిగ్ బాస్ 10 ప్లాన్ చేసి ఉంటారని ఈయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో తాము ఎలాగైనా విన్ అవ్వాలని చాలా ఎఫర్ట్ పెట్టాం కానీ మమ్మల్ని కిందకు లాగే ప్రయత్నాలు చేశారని నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఇక ఈ విషయంలో శ్రీముఖి గురించి కూడా ఫైర్ అయ్యారు. శ్రీముఖి తనకు నచ్చిన వాళ్లను గెలిపించడం కోసం గేమ్ లో రూల్స్ మారుస్తూ ఉండేవారని ఆ విషయంలో తనకు బాగా కోపం వచ్చి ఆరోజు బకెట్ విసిరి కొట్టాను అంటూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఇలా చేయటం వల్ల కొంతమంది మా పేర్లతో ఫేక్ ఐడి సృష్టించి ఈ కార్యక్రమంలో జడ్జెస్ గా కొనసాగుతున్న వారికి వ్యక్తిగతంగా తిట్టినట్లు వారికి మెసేజ్లు చేయటం వల్ల ఆ షో విన్నర్ అవ్వాల్సిన మేము కాలేకపోయామని తెలిపారు. దాదాపు ఓటింగ్ మొత్తం మాకు ఫేవర్ గానే ఉంది కానీ నేను కోప్పడటం వల్లే మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తొక్కేసారని నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి జడ్జెస్ ఓటింగ్ బట్టి అలాగే ప్రేక్షకుల ఓటింగ్ బట్టి విన్నర్ ని ప్రకటించారు మరి అది ఎంతవరకు సమంజసంగా జరిగిందో తెలియదని
చెప్పారు.
ఇక జడ్జిగా ఉన్నటువంటి అనిల్ రావిపూడి గారిని అడిగితే అలా కాదు ఇలా అంటూ ఆయన కూడా చాలా విషయాలు చెప్పారు కానీ ఆయన మాటలతో నేను ఏకీభవించనను మీరు తప్పు చేశారు అని చెప్పాను కానీ ఆయన అలా కాదు ఇలా అని మాట్లాడటంతో నేను అక్కడికే వదిలేసానని నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఈ షోలో విన్నర్ అవడం కోసం ప్రాణాలు పెట్టి గేమ్ ఆడము కానీ ఇలా చేసేటప్పటికి తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని నా జీవితంలో నాలుగైదు నెలల పాటు డిప్రెషన్ లో ఈ షో తర్వాతే ఉన్నాను అంటూ నటరాజ్ మాస్టర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి అనిల్ రావిపూడి శ్రీముఖి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?