Shocking Video: మద్యం గొంతులోకి దిగిందంటే చాలు.. మందుబాబులు చేసే హంగామా మామూలుగా ఉండదు. కారు రోడ్డు మీద నడుపుతున్నా, గాల్లో తేలిపోతున్నట్లు ఫీలవుతారు. కొంత మంది అసలు కారు ఎటు పోతుందో అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఓ వ్యక్తి పీకలదాకా తాగి రైల్వే స్టేషన్ లో రచ్చ చేశాడు. తాగిన మైకంలో తన కారును ఏకంగా కాంట్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీదికి తీసుకొచ్చాడు.
వణికిపోయిన ప్రయాణీకులు
ప్లాట్ ఫారమ్ మీద ఆగి ఉన్న రైలు దగ్గరికి కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ప్రయాణీకులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ కారుకు జార్ఖండ్ నంబర్ ప్లేట్ ఉంది. ఈ వీడియోలను రైల్వే పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత, కారు డ్రైవర్‌ను మొరాదాబాద్ లోని జిఆర్‌పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మొరాదాబాద్ జీఆర్పీ ఎస్పీ కీలక ప్రకటన చేశారు. “రైల్వే ప్లాట్ ఫారమ్ మీదికి కారును తీసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. జిఆర్‌పి, మీరట్ సిటీ ఆర్‌పిఎఫ్ అధికారులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని మొరాదాబాద్ జీఆర్పీ ఎస్పీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. యువకుడి కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
मेरठिया की कार!#मेरठ कैंट रेलवे स्टेशन में एक सिरफिरा अपना "जलवा अफरोज" करने के लिए चलती ट्रेन वाले प्लेटफार्म पर कार लेकर घुस आया
उसने पटरी से सटकर प्लेटफार्म कार चला दी. मुसाफिर घबरा गए
पिछले दिनों #लखनऊ स्टेशन पर एक मंत्री की कार भी यूं ही पहुंची थी pic.twitter.com/8kQL6UCcFJ
— Narendra Pratap (@hindipatrakar) August 1, 2025
Read Also: పట్టాలపై వెళ్తున్న రైలు ఒక్కసారే గాల్లోకి.. 29 మంది..
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సంఘటన దేశంలోని రైల్వే స్టేషన్లలో భద్రతలో ఉన్న లొసుగులను బయటపెట్టిందని నెటిజన్లు అధికారులను విమర్శిస్తున్నారు. “ఎప్పటిలాగే, ఆర్‌పిఎఫ్ ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ ఇది ఉగ్రవాద దాడి అయితే? పట్టించుకునేవారు ఎవరు?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గత నెలలో గ్వాలియర్ లో ఇలాంటి ఘటన
గత నెలలో గ్వాలియర్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కారును గ్వాలియర్ రైల్వే ప్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చాడు. రైలుతో ‘రేస్’ చేయడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తిని ఆదిత్యపురానికి చెందిన 34 ఏళ్ల నితిన్ రాథోడ్ గా గుర్తించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు ఆ వ్యక్తిని గమనించిన వెంటనే కారును ఆపి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. నితిన్ పై భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు.
Read Also: పాకిస్తాన్ రైళ్లు ఇంత దారుణమా.. ఈ బోగీలను పాత సామాన్లవాడు కూడా కొనడేమో!