Big Tv Kissik Talks: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big Tv Kissik Talks) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో రైతు పనులు చేసుకుంటూ ఉన్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ (Bigg Boss)అవకాశం అందుకోవడం గురించి అభిమానులతో పంచుకున్నారు. నేను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం నేను పడిన అవమానాలేనని తెలిపారు. ఒక వ్యక్తి అవమానమే నన్ను ఇక్కడ నిలబెట్టిందని తెలిపారు.
రైతు అంటే ఎందుకు చులకన భావన…
ఓసారి ఒక వ్యక్తి తన తండ్రి వద్దకు వచ్చి మీ కొడుకు ఏం చేస్తున్నాడని అడిగారు. పొలం పనులు చేసుకుంటున్నారని నాన్న చెప్పడంతో పొలం పనులు చేస్తున్నారా? అంటూ చాలా చులకనగా మాట్లాడారని పల్లవి ప్రశాంత్ తెలిపారు. రైతు అంటే అంత చులకన భావన ఎందుకు? ఇలాంటి వారికే మనం ఏంటో చూపించాలన్న ఉద్దేశంతోనే తాను బిగ్ బాస్ కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఇలా పొలం దగ్గర కూర్చుని తనకు బిగ్ బాస్ లో అవకాశం కల్పించాలని ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియో వైరల్ అవుతుందని నేను అనుకోలేదని పల్లవి ప్రశాంత్ తెలిపారు. నాకు హైదరాబాదులో ఏమీ తెలియదు. ఒక్క కూకట్ పల్లి కూరగాయల మార్కెట్ మాత్రమే తెలుసని, నాన్న దగ్గర 500 రూపాయల డబ్బులు, వారి ఆశీర్వాదాలు తీసుకొని ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు.
చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను…
ఇలా నేను చేసిన ప్రయత్నాలు ఫలించి బిగ్ బాస్ అవకాశం అందుకున్నానని పల్లవి ప్రశాంత్ తెలియజేశారు. ఇక బిగ్ బాస్ తర్వాత నుంచి ఈయన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది తనని తన కుటుంబ సభ్యులుగా భావించి హెల్ప్ చేశారని తెలిపారు. వారందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, కేవలం ఒక థాంక్స్ చెబితే సరిపోయేది కాదని తెలిపారు. అలాగే తన జీవితంలో చిన్నప్పటినుంచి ఎన్నో సంఘటనలు జరిగాయని అనారోగ్య సమస్యల కారణంగా చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని కూడా పల్లవి ప్రశాంత్ తెలిపారు.
ఇక బిగ్ బాస్ తర్వాత కూడా కొందరు తనకు ఫోన్ చేసి మీతో పని ఉందని పిలిచారు వారిని కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో అనుకోకుండా కారు యాక్సిడెంట్ (Car Accident) అయిందని, ఈ విషయం ఎవరికీ తెలియదని తెలిపారు. ఇలా ఎదురుగా లారీ వస్తుంది. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి యాక్సిడెంట్ అయిందని ఆ సమయంలో కొంతమంది మమ్మల్ని రక్షించారని తెలిపారు ఇలా మమ్మల్ని రక్షిస్తూ మీ కోసమే మేము ఇంటికి వెళ్తున్నాం కానీ మిమ్మల్ని ఇక్కడ ఇలా కలవాల్సి వచ్చింది అంటూ చెప్పారని ప్రశాంత్ తెలిపారు. జీవితానికి ఇంతకుమించి మనం ఏం సంపాదించుకోగలం అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇలా తన జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న తరువాతే సక్సెస్ అందుకున్నానని, తన సక్సెస్ గురించి పల్లవి ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: BigTv Kissik Talks: బిగ్ బాస్ ఎఫెక్ట్.. సినిమా ఛాన్స్ కొట్టేసిన పల్లవి ప్రశాంత్..