Big Tv Kissik talks : ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షో ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం మరో కొత్త సెలబ్రిటీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి శనివారం 7:00 గంటలకు ప్రసారమయ్యే ఈ షో ఈవారం కూడా ఆగస్టు 23వ తేదీన మరో కొత్త ఎపిసోడ్ తో స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఈ కొత్త ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈసారి ఢీ డాన్సర్ గా, కమెడియన్ గా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న పండు ఈ షో కి హాజరయ్యారు.
8 సంవత్సరాలుగా పండు ఆరాటం..
ఢీ డాన్స్ షోలో డాన్సర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అటు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలి అని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు పండు. గత 8 సంవత్సరాలుగా ఢీ కప్పు కోసం ప్రయత్నం చేస్తున్న ఈయన.. ఈసారి ఎలాగైనా సరే కప్పు సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే తాను ఎదుర్కొన్న అవమానాలు, భరించిన ట్రోల్స్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు పండు.అలా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో పండు స్పందిస్తూ.. కప్పు కొట్టే వరకు ఎవరు ఎన్ని అన్నా భరిస్తాను.. ఈసారి కప్పు నాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
ట్రోల్స్ పై స్పందించిన పండు..
ఎన్ని రోజులుగా ఢీ షోలో పనిచేస్తున్నారు అనగా.. దాదాపు 8 సంవత్సరాలుగా టైటిల్ కోసం పోరాడుతున్నాను. ఈసారి కచ్చితంగా టైటిల్ కొట్టి తీరుతాను అంటూ తెలిపారు పండు. ఇకపోతే ఇదే విషయంపై వర్ష ప్రశ్నిస్తూ.. ఇప్పటివరకు మీ కళ్ళముందే జూనియర్స్ కూడా కప్పు తీసుకెళ్ళి పోతుంటే మీకు ఎలా అనిపించింది.. ? అసలు నీకు డాన్స్ వచ్చా అని ఎవరైనా మిమ్మల్ని ట్రోల్స్ చేశారా? అని ప్రశ్నించగా.. “కొన్ని విషయాలు వినడానికి చాలా బాధగా ఉంటాయి. కొంతమంది అయితే ఏకంగా డాన్స్ చేసినా సరే.. ఏం డాన్స్ చేశావు నువ్వు అని అడుగుతారు. డాన్స్ తెలియని వాళ్లు కూడా డాన్స్ గురించి జడ్జ్ చేయడం ఇంకా బాధగా ఉంటుంది. అసలు నువ్వు డాన్స్ చేస్తున్నావా అని ఎవరైనా అడిగితే నేను డాన్స్ చేయకుండానే ఎనిమిది సీజన్లుగా కొనసాగుతున్నానా అనే డౌట్ నాలో కలుగుతుంది.
ఎంటర్టైన్ చేయడమే లక్ష్యం..
ట్రోల్స్ విషయానికి వస్తే.. నన్ను చూస్తున్నవారు ఎవరైతే నన్ను చూసి ఎంటర్టైన్ అయ్యారా లేదా అనేది నేను చూస్తాను.. ట్రోల్స్ ఎన్ని వచ్చినా భరిస్తాను అంటూ తెలిపారు.. అలా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులను అలరించే పండు ఇలా ఒక్కొక్కటిగా తన లైఫ్ లో జరుగుతున్న విషాదాల గురించి చెబుతుంటే అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
ALSO READ:Big Tv Kissik talks Promo: హార్ట్ స్ట్రోక్.. అందర్నీ నవ్వించే పండు జీవితంలో ఇంత విషాదమా?