Big Tv Kissik talks Promo: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ టాక్ షోలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఈ షోల వల్ల సెలబ్రిటీల జీవితాలలో జరిగే చాలా అంశాలు అభిమానులకు తెలుస్తున్నాయనే చెప్పాలి. ఇలాంటి షోలు నిర్వహించే ఎన్నో సంస్థలు ఈ షోలను ప్రత్యేకంగా నిర్వహిస్తూ.. అటు టిఆర్పి రేటింగ్ పెంచుకోవడమే కాకుండా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ కూడా కిస్సిక్ టాక్స్ అంటూ ఒక సెలబ్రిటీ టాక్ షో నిర్వహిస్తోంది. జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష (Jabardast varsha) ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు
కిస్సిక్ టాక్స్ ప్రోమో రిలీజ్..
ఇదిలా ఉండగా తాజాగా ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఈ టాక్ షో.. ఆగస్టు 23వ తేదీ రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈసారి ఢీ డాన్సర్ పండు (Dancer Pandu) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోలో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్లు వింటుంటే అందర్నీ నవ్వించే పండు జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా? అంటూ అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రోమో ఎలా ఉంది? ఆ ప్రోమోలో పండు చెప్పిన విషయాలేంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
నాన్నకు హార్ట్ స్ట్రోక్.. ప్రదీప్ లేకపోతే నేడు నేను లేను – పండు
ప్రోమో మొదలవ్వగానే.. పండుని ఇంటర్వ్యూ చేయాలి అంటే మినిమం ఉండాలి అంటూ వర్ష హర్ట్ అయ్యేలా కామెంట్ చేసి కాస్త ఝలక్ ఇచ్చాడు పండు.. ఆ తర్వాత ప్రోమో మొదలయ్యింది. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా..” మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏంటి.. ? ముఖ్యంగా మీకు , యాంకర్ ప్రదీప్(Anchor Pradeep) కి మధ్య మంచి ర్యాపో ఉందట కదా.. అసలు మీ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి?” అని అని వర్షా అడగగా.. పండు మాట్లాడుతూ..” మా నాన్నకు ఒకసారి అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబం కోసమే జీవిస్తున్న నాకు నాన్నకు గుండెపోటు అనేసరికి తట్టుకోలేకపోయాను. పైగా నా చేతిలో డబ్బులు కూడా లేవు. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కు తోచలేదు. కానీ ప్రదీప్ డబ్బు సహాయం చేసి మా నాన్నను బ్రతికించారు. ఒకవేళ నాడు ప్రదీప్ సహాయం చేయకపోయి ఉండి ఉంటే.. మా ఫ్యామిలీ నేడు ఏ దీనస్థితిలోనో ఉండేది” అంటూ ఎమోషనల్ అయ్యారు పండు.
ప్రాణంగా నమ్మిన స్నేహితులే మోసం చేశారు – పండు
అలాగే తన ఫ్రెండ్స్ సర్కిల్ గురించి కూడా మాట్లాడుతూ.. “నేను ఒకప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసేవాడిని. ఒక ఫ్రెండ్ పేరు ఏకంగా చేతి పైన కూడా పచ్చ బొట్టుగా కూడా వేయించుకున్నాను. అంత మంచి స్నేహితులు ఉండేవాళ్లు. కానీ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో దూరమయ్యారు. ఆ దూరం ఎంతలా పెరిగింది అంటే ఇక నాకు ఫ్రెండ్స్ అంటేనే నమ్మకం పోయింది. పెద్దగా ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు” అంటూ స్నేహితుల వల్ల తాను మోసపోయిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు పండు.
ఆర్థిక పరిస్థితిపై స్పందించిన పండు..
ఇకపోతే తమ ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుతూ..” తాను ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని, అసలు తనకు ఆదాయం చాలా తక్కువ” అని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఈ ప్రోమో వైరల్ అవ్వడంతో అందరినీ కడుపుబ్బా నవ్వించే పండు జీవితంలో ఇంత విషాదం ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ: Comedian Ramachandra: పక్షవాత బారినపడ్డ వెంకీ కమెడియన్.. రవితేజను హెల్ప్ అడిగితే?