Bigg Boss AgniPariksha Promo 2:బిగ్ బాస్ రియాల్టీ షో.. ఈ షోకి ఇండియా మొత్తంలో క్రేజ్ ఉంది. నార్త్ లో స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ సౌత్ వరకు పాకింది. అలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సక్సెస్ అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకి సంబంధించి తెలుగులో మరో కొత్త సీజన్ ని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో మరో అడుగు ముందుకు వేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 లో సామాన్యులకు కూడా ఎంట్రీ ఉంటుందని చెప్పి ఆ సామాన్యులకు కూడా బిగ్ బాస్ రియాల్టీ షో కి ముందే అగ్నిపరీక్ష అనే షో పెట్టి అందులో సెలెక్ట్ అయిన వారిని హౌస్ లోకి పంపించబోతున్నారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండవ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..
అయితే ఇప్పటికే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. తాజాగా రెండో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. మరి ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 రియాల్టీ షోని సరికొత్తగా తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈసారి హౌస్ లోకి కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుండడంతో ఆ సామాన్యులకు అగ్నిపరీక్ష పేరుతో ఒక షో స్టార్ట్ చేసి బిగ్ బాస్ మీద ఆసక్తి ఉన్న వారందరినీ ఎంపిక చేసి జడ్జెస్ ముందు తమను తాము మెప్పించుకొని.. హౌస్ లోకి వెళ్లేలా ప్రణాళికలు రచించారు.ఇప్పటికే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జెస్ గా బిందు మాధవి, అభిజిత్,నవదీప్ లు ఉండగా శ్రీముఖి హోస్ట్ గా చేస్తోంది. అయితే తాజాగా అగ్నిపరీక్ష ఎపిసోడ్ 2కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.
మిరాయ్ ప్రమోషన్స్లో హీరో తేజ..
ఆ ప్రోమోలో హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా వచ్చారు. తేజ రావడంతోనే ఆయన చేయబోయే కొత్త మూవీ మిరాయ్ మూవీ ముచ్చట్లు అడిగి తెలుసుకుంది శ్రీముఖి. మిరాయ్ అంటే అర్థం ఏంటని అడగగా.. మిరాయ్ అంటే హోప్ ఫర్ ఫ్యూచర్ అని చెబుతారు. ఆ తర్వాత శ్రీముఖి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కొంతమంది కూడా భవిష్యత్తు మీద ఆశతో వచ్చారని చెబుతుంది. ఆ తర్వాత గొర్రెలు కాచుకొని జీవనం గడిపే ఒక తాత ఎంట్రీ ఇచ్చారు. తన గొర్రెల కాపరి గెటప్ తోనే వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక తాత ఎంట్రీ తోనే ఒక పాట పాడుతానని అడిగి రైతన్న గురించి అద్భుతమైన పాట పాడారు.ఆ తర్వాత బిందు మాధవి మీరు ఈ హౌస్ లో ఒదగలేరేమో అని కొంచెం డౌట్ గా ఉంది తాత అని చెప్పగా.. ఆ తాత తన స్టామినా ఏంటో చూపిస్తాడు.
ఆ పెద్దాయనకు అవకాశం కల్పిస్తారా?
అలాగే హౌస్ లో ఎలాంటి గేమ్ లు, టాస్కులు పెట్టిన ఆడతా అమ్మా అంటూ సమాధానం ఇస్తాడు. కానీ అభిజిత్ మాత్రం మీరు హౌస్ లో కలిసిపోరేమో అనిపిస్తుంది తాత అని అంటాడు. ఇక జానపద కళలకు ప్రాణం పోసే ఈయనకు అవకాశం కల్పిస్తారా అని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మరొక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతోని శ్రీముఖి నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతుంది.ఇక శ్రీముఖి ప్రశ్నకి ఆ అమ్మాయి కాస్త ఎమోషనల్ అయినట్టుగా చూపించారు. ఆ తర్వాత మరో అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఫిజికల్ గా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఏంటి చెప్పు..మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే అంటూ ఏడుస్తూ చెబుతుంది. ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పే మాటలకు అభిజిత్ నాకు నిన్ను నమ్మాలనిపించడం లేదు అంటూ మాట్లాడుతాడు. ఇక అభిజిత్ మాటలతో ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది.మరి అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2లో ఎవరెవరు ఎంపిక అవుతారు అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
ALSO READ:Big Tv Kissik talks : డ్యాన్స్ రాదు అంటూ చులకనగా చూశారు.. ట్రోల్స్‌పై పండు మాస్టర్ ఎమోషనల్