E-Paper
Advertisement

త్రిగుణ్ పై శివ రివేంజ్.. ఆ బాధ ఏంటో తెలియాలంటూ!

త్రిగుణ్ పై శివ రివేంజ్.. ఆ బాధ ఏంటో తెలియాలంటూ!
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10లో ఆడియన్స్ ఊహకి కూడా అందని టాస్కులు, ఛాలెంజ్ లు షోపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు అరుచుకోవడాలు, తిట్టుకోవడం , ఆఖరికి కొట్టుకోవడం వరకు వెళ్లిన కంటెస్టెంట్స్.. నిన్నటి ఎపిసోడ్లో ఒకరి బాధలను మరొకరు పంచుకొని ఎమోషనల్ అయ్యారు. అయితే నేటి ఎపిసోడ్లో బాధ అంటే ఎలా ఉంటుందో ఇంకొకరికి కూడా తెలియాలి అంటూ రివేంజ్ తీసుకునే టైం రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఎవరికి రివేంజ్ ఇవ్వాలనుకుంటున్నారో కవర్లో పెట్టి వారికి రివేంజ్ ఇవ్వండి అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

రివార్డ్ అండ్ రివేంజ్..

59వ రోజుకు సంబంధించి విడుదల చేసిన 2వ ప్రోమోలో.. పోటీదారులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీరు ఎవరిపై రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ సభ్యుడి పేరుని రివెంజ్ కార్డు పైన రాసి ఎన్వలప్ లో పెట్టండి అంటూ ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. రివార్డ్ అండ్ రివేంజ్ ఛాలెంజ్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ తాము ఎవరిపైన అయితే రివేంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారో.. ఒక్కొక్కరుగా వెళ్లి ఆ కార్డులపై వారి పేర్లు రాశారు.

త్రిగుణ్ పై శివ రివేంజ్ ..

Advertisement

బిగ్ బాస్ ఇక్కడ మరో షాక్ ఏమిచ్చారంటే.. రివేంజ్కి గురైన వారు కంటెండర్ షిప్ తో పాటు తన ఫ్యామిలీని కలుసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతారు అంటూ షాక్ ఇచ్చారు. అలా అందరూ ఒక్కొక్కరు రివేంజ్ కార్డు పై పేర్లను రాశారు. అయితే ఎవరు ఎవరి పేర్లు రాశారు అనే విషయాన్ని చూపించలేదు. కానీ శివ మాత్రం తాను త్రిగుణ్ పై రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాను అనే విషయాన్ని ఏకంగా కెమెరా ముందుకు వచ్చి చెప్పారు. “బిగ్ బాస్ ఈ మనిషికి రివేంజ్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలియాలి..
ఎందుకంటే ఒక్కరు ఆ ఎక్స్పీరియన్స్ అయితేనే వారి బాధ తెలుస్తుంది” అంటూ శివ తన బాధను వెళ్ళబుచ్చారు. మొత్తానికైతే ఒక వ్యక్తి పై తాను రివేంజ్ తీర్చుకోవాలని చూశారు అంటే శివ ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది అంటూ శివ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:సంచలనం రేపుతున్న ఫిల్మ్ ఛాంబర్ కూల్చివేత కుట్ర! గుండెకాయ లాంటి భవనాన్ని మింగేస్తున్న పెద్దల స్వార్థం?

శ్వేత కి దక్కిన రివార్డ్..

Advertisement

ఇక తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ మీలో ఎవరికీ ఆ రివార్డు దక్కాలో మీరే నిర్ణయించుకొని చెప్పండి అంటూ అన్నాడు. వచ్చినప్పటి నుంచి ప్రియాంకను తాను చాలా మిస్ అవుతున్నాను అంటూ తన బాధను చెప్పాడు శివ. మా అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి నాకు చాన్స్ ఇవ్వండి అని అడిగాడు ముఖేష్. మా పాప మమ్మీ నేను లోపలికి వస్తానని చాలా అడుగుతుంది అని చెప్పింది నీతూ మాస్టర్. నేను హౌస్ లోకి వచ్చే ముందు మా నాన్నకు స్టంట్ పడింది అంటూ తన బాధను చెప్పింది శ్వేత. ఇక ఒక్కొక్కరు తమ బాధలను చెప్పకుంటుంటే అమన్ మాత్రం ఎమోషనల్ పాయింట్స్ చెప్పకు ఇక్కడ అంటూ నీతూ పై మండిపడ్డారు. ఇక విజేతగా నిలిచిన రెయిన్బో టీంలో సంచాలక్ గా నిలిచిన ముఖేష్ శ్వేతా కి రివార్డు ఇచ్చారు.

Related News

తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

నా కలలను నాశనం చేశారు.. బిగ్ బాస్ తీరుపై ఝాన్సీ మండిపాటు!

పెళ్లి పీటలెక్కిన దీపికా రంగరాజు.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి తల్లీ?

ముఖేష్ – త్రిగుణ్ మీ పంతం వీడరా?

అందరినీ నవ్వించే రాంప్రసాద్ జీవితంలో ఇంతటి విషాదమా?

నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!

తెలుగు సీరియల్స్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూడు అవుట్..

Big Stories

Advertisement
×