E-Paper
Advertisement

నా ఆయుష్షు తీసుకున్నా పర్లేదు.. మా అక్కను బ్రతికించు దేవుడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖేష్!

నా ఆయుష్షు తీసుకున్నా పర్లేదు.. మా అక్కను బ్రతికించు దేవుడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖేష్!
Advertisement

Bigg Boss 10 Mukhesh Gowda:’గుప్పెడంత మనసు’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖేష్ గౌడ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇందులో రిషి పాత్రలో నటించి మంచి ప్రజాధారణ సొంతం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లపాటు సాగిన ఈ సీరియల్ 1100 కు పైగా ఎపిసోడ్లతో ప్రసారమయ్యి .. ముఖేష్ గౌడను తెలుగు రాష్ట్రాలలో ఇంటింటికి సుపరిచితుడుని చేసింది.. గుప్పెడంత మనసు సీరియల్ కంటే ముందే ప్రేమ నగర్ అనే తెలుగు సీరియల్ లో కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక కన్నడలో సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

మా నాన్నకు పక్షవాతం..

ఇకపోతే హౌస్ లో తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. మరొకవైపు దేబ్జాని, త్రిగుణ్ వంటి వారితో గొడవలు పెట్టుకుంటూ.. వర్షినితో సానుకూలంగా మాట్లాడుతూ హౌస్ లో తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఈయన తాజాగా హౌస్ లో తన పర్సనల్ విషయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ హౌస్లోకి తన ఫ్యామిలీ ఫోటో ని పంపించగా.. ఆ ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఫ్యామిలీ పరిస్థితిని అభిమానులతో పంచుకున్నారు ముఖేష్. మా అమ్మ నాన్నల కన్నా, నా కన్నా నాకు మా అక్క అంటేనే చాలా ఇష్టం. మా నాన్నకు పక్షవాతం వచ్చింది. ఆ టైంలో మా అక్క చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. అయితే హౌస్ లోకి వచ్చే నాలుగు నెలలు ముందే నాకు తెలిసింది. మా అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని.

అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్..

Advertisement

హౌస్ లోకి వచ్చే ముందు కూడా నేను మా అక్కకి కీమోథెరపీ చేయించి వచ్చాను. నేను ఇప్పుడు అక్కడ లేను. తను ఏ పరిస్థితుల్లో ఉందో కూడా నాకు తెలియదు. ఈ ఫోటోలలో ఇంత ముద్దుగా కనిపిస్తోంది కానీ అక్క ఇప్పుడు అలా కనిపించడం లేదు. ఆ కళ పూర్తిగా కోల్పోయింది. దేవుడి దగ్గర నేను కోరుకునేది ఒక్కటే.. నా ఆయుష్షును తీసుకున్నా పర్లేదు.. తనకున్న ప్రాబ్లం నుంచి దయచేసి ఆమెను బయటకు తీసుకురావాలని కోరుతున్నాను. అంటూ కన్నీళ్లు పెట్టించారు ముఖేష్ గౌడ.

ALSO READ:త్రిగుణ్ పై శివ రివేంజ్.. ఆ బాధ ఏంటో తెలియాలంటూ!

అక్క ఆరోగ్యంగా కోలుకోవాలి.. మా బావ మనసు మారాలి..

Advertisement

ఇదే షోలో భాగంగా ముఖేష్ గౌడ మాట్లాడుతూ.. “మా అక్కకు వివాహం జరిగిన తర్వాత నెలల పసికందును, మా అక్కను వదిలేసి మా బావ వెళ్లిపోయారు. బిడ్డను, మంచానికే పరిమితమైన మా నాన్నను చూసుకుంటూ అక్క ఎంతో ఇబ్బంది పడింది. ఇక ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తో ఆమె సతమతం అవుతుంది. అక్క నువ్వు త్వరగా కోలుకోవాలి. బావ మనసు మారాలి. మళ్లీ ఎప్పటిలాగే మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి” అంటూ ముఖేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ముఖేష్ జీవితంలో ఇంత ఏడిపించే స్టోరీ ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ముఖేష్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయని చెప్పవచ్చు.

Related News

తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

త్రిగుణ్ పై శివ రివేంజ్.. ఆ బాధ ఏంటో తెలియాలంటూ!

నా కలలను నాశనం చేశారు.. బిగ్ బాస్ తీరుపై ఝాన్సీ మండిపాటు!

పెళ్లి పీటలెక్కిన దీపికా రంగరాజు.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి తల్లీ?

ముఖేష్ – త్రిగుణ్ మీ పంతం వీడరా?

అందరినీ నవ్వించే రాంప్రసాద్ జీవితంలో ఇంతటి విషాదమా?

నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×