Bigg boss 10 Jhansi:తెలంగాణ ఫోక్ సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఝాన్సీ ( Singer Jhansi) .. అగ్నిపరీక్ష సీజన్ 2 లో తనదైన ఆట మాట తీరుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అక్కడి జడ్జెస్ ను మెప్పించిన ఈమె.. బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ గా అడుగు పెట్టింది. హౌస్ లోకి వెళ్లిన మొదటి వారమే కెప్టెన్ గా నిలిచి, మరో పల్లవి ప్రశాంత్ అవుతుంది అంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా చరణ్ ఈమెను టార్గెట్ గా చేస్తూ.. రైతుబిడ్డ అనే ట్యాగ్ వాడుతూ ఆడియన్స్ సింపతీ దక్కించుకుంటుంది అనే మాటల్ని ఎదుర్కొంది. అలాంటి ఝాన్సీ కనీసం టైటిల్ రేసులో నిలవకపోయినా టాప్ ఫైవ్ లో ఉంటుందని ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సుధీర్ ను కాపాడబోయి.. ఎనిమిదవ వారమే ఈమె హౌస్ నుండి బయటకు వచ్చింది.
హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వరుసగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కొన్ని విషయాలు పంచుకుంటున్న ఝాన్సీ.. తాజాగా తన కలలను బిగ్ బాస్ నాశనం చేశాడని, తన గొంతు నొక్కేశాడు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఝాన్సీ మాట్లాడుతూ..” బిగ్ బాస్ లో మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. నిజంగా నేను హౌస్ లోకి సింగర్ ఝాన్సీగా వెళ్లినప్పటికీ.. నా గొంతు అక్కడ వినిపించాలని వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లాక నా గొంతు నుంచి ఒక పల్లవి నుండి ఒక పదం బయటకు వచ్చినా చాలు.. బిగ్ బాస్ స్పందిస్తూ ఝాన్సీ తక్షణమే పాట పాడడం ఆపండి అంటూ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అది బిగ్ బాస్ రూల్ అంట. నాకు కూడా తెలియదు.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత పాటలు కూడా పాడకూడదంట. ప్రతిరోజు ఉదయాన్నే ఒక పాటతో స్టార్ట్ అవుతుంది. ఆ పాట పాడినా సరే పాడకూడదు అంటారు.ఇక ఎక్కడ నేను నా గొంతును వినిపించుకోవాలో మీరే చెప్పండి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వరకు కూడా నాకు తెలియదు అక్కడ పాటలు పాడకూడదు అని. మీరు నా మాటల్ని నమ్మకుంటే హౌస్ లో శ్వేతా అక్క కూడా వచ్చింది కదా.. ఆమె బయటకు వచ్చిన తర్వాత మీరు ఆమెను అడగండి. సరదాగా మేమిద్దరం పాటలు పాడుతున్నా సరే ఒక అనౌన్స్మెంట్ వచ్చేది..
ALSO READ:పెళ్లి పీటలెక్కిన దీపికా రంగరాజు.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి తల్లీ?
ఇకపోతే పాటలు ఒకవేళ పాడితే ఆ హౌస్ లో ఆ వారం ఎవరైతే కెప్టెన్ గా ఉన్నారో వారు వచ్చి పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు. అలా నా టాలెంట్ను నిరూపించుకోవడానికి అవకాశం లభించలేదు.. నా గొంతు నొక్కేశారు అంటూ ఝాన్సీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.