Aadarsha kutumbam AK 47:విక్టరీ వెంకటేష్ (Venkatesh) , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్‌కు, కలెక్షన్స్ తగ్గడానికి ప్రముఖ నిర్మాత నాగవంశీయే కారణమనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అసలు ‘ఆదర్శ కుటుంబం’ సినిమా దసరా పండగ సీజన్‌లో విడుదల కావాల్సి ఉంది. ఆ సమయంలో కనుక సినిమా వచ్చి ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ, ఆ టైమ్‌లో తమిళ్ డబ్బింగ్ సినిమాలతో పాటూ ఇతర సినిమాలను తీసుకువచ్చి ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేయడంతోనే అసలు సమస్య వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 2 లేదా అక్టోబర్ 9 తేదీల్లో రావాల్సిన సినిమాను కావాలనే వెనక్కి నెట్టడం వల్లే కలెక్షన్స్ దెబ్బతిన్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా నిర్మాత నాగవంశీని పక్కన పెట్టి, కేవలం త్రివిక్రమ్, వెంకటేష్ మాత్రమే ముందుండి ప్రమోషన్స్ నిర్వహించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో త్రివిక్రమ్‌కు, నిర్మాత నాగవంశీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇక సరైన సమయంలో సినిమాను విడుదల చేయకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు నష్టాలు మిగిలాయని టాక్ వినిపిస్తోంది.
also read:9 నెలల్లో రూ.132 కోట్ల ఆస్తి నష్టం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ఇక ఇప్పుడు “సరైన టైమ్‌లో గనుక త్రివిక్రమ్-వెంకటేష్ సినిమా వచ్చి ఉంటే బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల పోస్టర్ పడేది” అని విక్టరీ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస వాయిదాలు, ఎలక్షన్స్, భారీ వర్షాలు వంటి కారణాలతో పాటు ప్రొడ్యూసర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే సినిమాను దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కంటెంట్ ఉన్నప్పటికీ, కేవలం రిలీజ్ డేట్ సరిగ్గా లేకపోవడం వల్లే మంచి సినిమాకు ఈ గతి పట్టిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక మొత్తానికి చూస్తే, ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఫలితం టాలీవుడ్‌లో ప్రొడక్షన్ ప్లానింగ్ ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది. ఇక ఈ నష్టాలకు నిర్మాత నాగవంశీయే కారణమనే వాదనలు వినిపిస్తుండగా, త్రివిక్రమ్-నాగవంశీ మధ్య విభేదాల వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ వివాదంపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.