Murasu Cyclone: ఒంగోలు సమీపంలో మురసు తుఫాన్ తీరం దాటడంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ తుఫాన్ ధాటికి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు పెద్ద ఎత్తున విఘాతం కలిగింది.
కావలి వద్ద నిలిచిపోయిన రైళ్లు
తెల్లవారుజాము నుంచే కావలి రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్, ధన్‌బాద్-అలప్పుజ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు ఇతర రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాక్‌లపైనే రైళ్లు గంటల తరబడి ఆగిపోవాల్సి వచ్చింది. రైళ్లు కదలకపోవడంతో రైలు పెట్టెల్లోని ప్రయాణికులు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేషన్‌లో సరైన ఆహారం, తాగునీరు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద రైళ్లు నిలిపివేత
మురసు తుఫాన్ ఒంగోలు వద్ద తీరం దాటడంతో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిని రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. కావలి రైల్వే స్టేషన్‌లో శబరి, ధన్‌బాద్-అలప్పుజ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లు తెల్లవారుజాము నుంచి… pic.twitter.com/86diwVvS8O
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2026
రైళ్లు ఎప్పుడు కదులుతాయో చెప్పండి.. ఆవేదనలో ప్రయాణికులు
రైళ్ల నిలిపివేతతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్గమధ్యలో రైలు నిలిచిపోవడంతో తాగునీరు, ఆహారం దొరక్క చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్లు ఏ సమయంలో బయలుదేరుతాయో… https://t.co/I6fxAVsFtE pic.twitter.com/vHisRRoTEL
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2026
అధికారులను కోరుతున్న బాధితులు
పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో, రైళ్లు ఎప్పుడు బయలుదేరుతాయో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి తాగునీరు, ఉచిత ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అలాగే రైళ్ల సమయాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: త్రిపురలో ఘోరం.. BSF జవాన్లపై కర్రలతో దాడి.. ఆయుధాలు సైతం లాక్కొని..!