E-Paper
Advertisement

ఆ ఐదుగురే టార్గెట్.. ఝాన్సీ వ్యాఖ్యలతో వారిలో మార్పు వస్తుందా?

ఆ ఐదుగురే టార్గెట్.. ఝాన్సీ వ్యాఖ్యలతో వారిలో మార్పు వస్తుందా?
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10) అప్పుడే 8 వారాలు పూర్తి చేసుకుంది. ఇకపోతే ఎనిమిదవ వారం అనూహ్యంగా తన పవర్ ని ఉపయోగించినప్పటికీ కూడా సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన ఝాన్సీ.. హౌస్ లోకి అడుగుపెట్టిన తొలివారమే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి, అందరి దృష్టిని ఆకట్టుకుని, ఆట తీరుతో పల్లవి ప్రశాంత్ లాగే ఈమె కూడా టైటిల్ విజేత అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ముఖేష్ , వర్షిణి, సుధీర్ బ్యాచ్ తో కలిసి వారు చెప్పినట్టే ఆడుతూ తన ఆటలో మెరుగుపరుచుకోవడంలో వెనుకబడిపోయింది. ముఖ్యంగా రెడ్ లెవెల్ లో ఉన్న ఈమెను పలుమార్లు హోస్ట్ నాగార్జున (Nagarjuna) హెచ్చరించినప్పటికీ తనను తాను ఇంప్రూవ్ చేసుకోలేకపోయింది. అలా ఎట్టకేలకు ఎనిమిదవ వారం హౌస్ నుండి బయటకు వచ్చేసింది.

హౌస్ నుండి బయటకు వచ్చిన ఝాన్సీ..

ఇకపోతే హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ స్టేజ్ పైకి రావాల్సిందే. హౌస్ లో ఉండే మిగతా కంటెస్టెంట్ ల గురించి తమ అభిప్రాయాలను చెప్పాల్సిందే. ఈ క్రమంలోనే ఝాన్సీ కూడా స్టేజ్ పైకి రాగానే నాగార్జున చెప్పినట్టు అక్కడ డిస్ప్లే చేసిన ఐదు సామెతలను హౌస్ లో ఉండే ఐదుగురికి ట్యాగ్ చేయాలని చెప్పగా.. ఒక్కొక్కరి గురించి ఒక్కో విషయం చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా హౌస్ లో ఉండే ఆ ఐదుగురిని టార్గెట్ చేసుకొని ఝాన్సీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇకనైనా ఝాన్సీ చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఆ ఐదుగురు తమ ఆటను మార్చుకుంటారో లేదో చూడాలి.

Advertisement

also read:బిగ్ బాస్ 10 నుండి ఝాన్సీ ఎలిమినేటెడ్.. 8 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

ఆ ఐదుగురు తమ ఆటతీరును మార్చుకుంటారా?

మరి ఝాన్సీ ఎవరెవరిపై ఎలాంటి కామెంట్లు చేసింది అనే విషయానికి వస్తే.. “కుక్కతోక వంకర”అనే ట్యాగ్ రోహిత్ కు ఇచ్చింది ఝాన్సీ.. ఎన్నిసార్లు మీ మాటలను కంట్రోల్ చేసుకోమని చెప్పినా సరే.. ఆయనలో మార్పు రాలేదు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. దీనిపై హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. అలా మార్చుకోకపోవడానికి కారణం ఆయన తప్పు చేసినా.. తప్పు చేయలేదనే భావనలో ఉండడమే కారణం అంటూ చెప్పుకొచ్చారు. “ఎవరు తీసిన గోతిలో వారే పడతారు ” అనే సామెతకు దెబ్జానీ షూట్ అవుతుంది అంటూ ఝాన్సీ తెలిపింది. “గోరంత దాన్ని కొండంత చేస్తారు” అనే పదానికి త్రిగుణ్ సరిపోతారని ఝాన్సీ చెప్పగా.. మళ్లీ ఒక పెద్ద సామెత చెప్పే ప్రయత్నం చేశారు త్రిగుణ్. కానీ నాగార్జున చెప్పడానికి చాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఇంట్లో పులి వీధిలో పిల్లి అనే సామెతకు నరేష్ సరిపోతారని.. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ముఖేష్ కి సరిపోతుందని.. వీళ్ళు అయిదుగురు ఈ ఇందులో మార్పులు చేసుకుంటే .. ఖచ్చితంగా టాప్ ఫైవ్ కి వెళ్తారు అనే రేంజ్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అలాగే ఇన్ని రోజులు నరేష్ లో కామెడీ చూశారని, ఇకపై నరేష్ 2.0 చూస్తారు అంటూ కూడా చెప్పుకొచ్చారు నాగార్జున.

Advertisement

Related News

మాది ఆరేళ్ల ప్రేమ.. బ్రేకప్ జరగడానికి కారణం అదే – బిగ్ బాస్ షాలిని!

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ టాక్ ఏది..?

బిగ్ బాస్ 10 నుండి ఝాన్సీ ఎలిమినేటెడ్.. 8 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Podarillu Today Episode : నారాయణ పై కన్నా కోపం.. బాధపడ్డ మాధవ్.. మహా నిజం చెప్తుందా..?

Intinti Ramayanam Today Episode: కమల్ తో రమ్య ప్రేమ.. అబ్బా ఆరాధ్య ఎంత బాగుందో..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: శోభా ప్లాన్ సక్సెస్.. డ్యాన్స్ తో సందడి.. చింతామణి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో చిచ్చు..ప్రేమ ధీరజ్ రొమాన్స్.. భాగ్యం రచ్చ..

Big Stories

Advertisement
×