E-Paper
Advertisement

రైల్వే జాబ్స్.. 1,215 స్టేషన్ మాస్టర్ ఖాళీలు.. డిగ్రీ అంటే చాలు

రైల్వే జాబ్స్.. 1,215 స్టేషన్ మాస్టర్ ఖాళీలు.. డిగ్రీ అంటే చాలు
Advertisement

Railway Jobs| ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 1,215 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు నోటిఫికేషన్ విడుదల చేశాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 25 చివరి తేదీ. అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం వంటి వివరాలను తెలుసుకుందాం.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీసు (CEN) నంబర్ 08/2026 విడుదల చేశాయి. అక్టోబర్ 27, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి.

ముఖ్యమైన తేదీలు:

Advertisement

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 27, 2026

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 25, 2026

Advertisement

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబర్ 27, 2026

దరఖాస్తుల సవరణ గడువు: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 7, 2026 వరకు

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు విద్యార్హత, వయోపరిమితి

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తత్సమాన విద్యార్హతలు ఉన్నవారు కూడా అర్హులు. అయితే, చివరి సంవత్సరం పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేయలేరు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. జనవరి 1, 2027 నాటికి వయస్సును లెక్కిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు ఎంత జీతం వస్తుంది?

స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు 7వ పే కమిషన్.. పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 6 పరిధిలోకి వస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 ప్రారంభ బేసిక్ పే లభిస్తుంది. దీంతో పాటు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలు కూడా అందుతాయి.

దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి?

జనరల్ ఫీజు కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైతే రూ.400 తిరిగి చెల్లిస్తారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. పరీక్షకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు.

రైల్వే స్టేషన్ మాస్టర్ ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

అభ్యర్థుల ఎంపిక నాలుగు దశల్లో జరుగుతుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష (CBAT)
డాక్యుమెంట్స్ పరిశీలన
వైద్య పరీక్ష.

CBTలో ప్రతి తప్పుడు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు కోత విధిస్తారు.
అభ్యర్థులు తప్పనిసరిగా A – 2 వైద్య ప్రమాణాలకు తగినట్లు ఉండాలి. లాసిక్ లేదా ఇతర రిఫ్రాక్టివ్ ఎర్రర్ సర్జరీ చేయించుకున్నవారు ఈ పోస్టులకు అర్హులు కారు.

Also Read: లింక్డ్‌ఇన్, నౌక్రీ వద్దు.. డేటింగ్ యాప్స్‌లో ఉద్యోగాలు వెతుకుతన్న యువత.. ఎందుకంటే

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ముందుగా rrbapply.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
CEN నంబర్ 08/2026 దరఖాస్తు లింక్‌ తెరవండి.
అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
అవసరమైన పత్రాలు, ఫొటోలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు చెల్లించండి
వివరాలను పరిశీలించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరచుకోండి.

Also Read: అక్కడ ఉద్యోగం చేస్తే.. 480 రోజులు ప్రెగ్నెన్సీ లీవ్, ఐఫోన్, ల్యాప్ టాప్, జిమ్ భోజనం ఫ్రీ, జాబ్ ఇన్సూరెన్స్!

అభ్యర్థులు ఒక్క రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును మాత్రమే ఎంచుకోవాలి. కాబట్టి దరఖాస్తుకు ముందు ఖాళీల వివరాలను పరిశీలించండి.

Related News

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ..10 లక్షల మంది వస్తారని అంచనా, భారీగా పోలీసుల మోహరింపు

కర్ణాటక రాజకీయాల్లో స్పై ఆపరేషన్ల కలకలం.. సిద్ధరామయ్య కేసులో సంచలన ట్విస్ట్!

నడిరోడ్డుపై మహిళ హల్‌చల్.. బీఎండబ్ల్యూ కారుతో బీభత్సం.. పోలీసునే ఢీకొట్టేందుకు యత్నం!

క్లాస్‌రూమ్‌లో దారుణం.. 6 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడి రాక్షస దాడి.. షాకింగ్ CCTV విజువల్స్!

క్రూర చక్రవర్తిని కంటతడి పెట్టించిన ఆ ఒక్క సంఘటన.. కళింగ యుద్ధంలో అసలు ఏం జరిగింది?

ఖైదీల పరారీ ఘటన.. సీఎం విజయ్ సీరియస్.. జైలు అధికారిపై వేటు!

రన్నింగ్ బస్సులో పురిటి నొప్పులు.. మహిళా ప్రయాణికుల సాయం.. బిడ్డకు జన్మనిచ్చిన యువతి!

Big Stories

Advertisement
×