Bigg Boss 10 Jhansi:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతూ రోజుకో కొత్త ట్విస్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. నాగార్జున ముందుగానే చెప్పినట్లుగానే ఈ సీజన్‌లో ఊహకందని పరిణామాలు, మైండ్ బ్లాక్ చేసే ఎలిమినేషన్లు షోపై ఆసక్తిని విపరీతంగా పెంచేస్తున్నాయి. తాజాగా ఎనిమిదో వారంలో జరిగిన హై-వోల్టేజ్ డ్రామా మరియు ఊహించని పరిణామాల మధ్య సింగర్ ఝాన్సీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో సుధీర్‌కు తక్కువ ఓట్లు రావడంతో అతడిని బయటకు పంపే ప్రయత్నం జరగగా, ముకేష్ తన దగ్గరున్న సూపర్ పవర్‌తో సుధీర్‌ను కాపాడుకున్నాడు. అయితే ఈ వ్యూహంలో భాగంగా ఝాన్సీ చేతిలో ఉన్న సేవింగ్ పవర్‌ను వదులుకునేలా చేయడంతో ఆమెకే ముప్పు ఎదురైంది. ఇక నిజానికి ఆ పవర్ ఆమె దగ్గరే ఉండి ఉంటే తనను తాను కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ ఊహించని ఈ పరిణామంతో ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఝాన్సీ హౌస్ వీడాల్సి వచ్చిందని సమాచారం.
సీజన్ 10 ప్రారంభం నుంచే ‘ట్విస్టులు, టర్న్‌లు పదింతలుంటాయి’ అని హోస్ట్ నాగార్జున చెప్పినట్లుగానే ఇప్పుడు ప్రతి వారం ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. రోహిత్, రామకృష్ణలకు సమాన ఓట్లు రావడం, త్రిగుణ్ కీలక నిర్ణయాధికారం తీసుకోవడం వంటి పరిణామాలు హౌస్‌లో రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. ఇక వర్షిణి గోట్ గ్రూప్‌లో చోటు దక్కించుకుని సేఫ్ కాగా, వరుసగా కామనర్స్ టార్గెట్ అవుతున్నారనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
also read:బిగ్ బాస్ లో ఆ నలుగురికి జీరో స్టార్స్.. కంటెస్టెంట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున!
ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో తనదైన ఆటతో అలరించిన సింగర్ ఝాన్సీ తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు వారానికి సుమారు రూ.70,000 నుండి రూ.75,000 వరకు పారితోషికం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ లెక్కన ఎనిమిది వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు సుమారు రూ.5.60 నుండి 6 లక్షల వరకు పారితోషికం దక్కనుంది. అలాగే ‘అగ్నిపరీక్ష’ టాస్క్ ద్వారా మరో 50 వేలు అదనంగా లభించినట్లు సమాచారం.
ఇక మొత్తానికి చూస్తే, బిగ్ బాస్ హౌస్‌లో ఎనిమిది వారాల పాటు తన గాత్రంతో, ఆటతో ప్రేక్షకులను అలరించిన ఝాన్సీ ఎలిమినేట్ కావడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక కామనర్‌గా హౌస్‌లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ, బిగ్ బాస్ జర్నీ ద్వారా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుని బయటకు వస్తున్నారు.