E-Paper
Advertisement

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో హార్దిక్ పాండ్యా ఊచకోత…రూ.94.91 ల‌క్ష‌ల ప్రైజ్ మనీ

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో హార్దిక్ పాండ్యా ఊచకోత…రూ.94.91 ల‌క్ష‌ల ప్రైజ్ మనీ
Advertisement

Hardik Pandya Featured MrBeast You Tube challenge: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గొప్ప మనసు చాటుకున్నాడు. ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ బేస్ బాల్ చాలెంజ్ లో (MrBeast You Tube challenge) గెలుచుకున్న డబ్బులు చిన్న పిల్లలతో పాటు కుక్కల సంరక్షణ కోసం దానం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన హార్దిక్ పాండ్యా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పాండ్యాది గొప్ప మ‌న‌సంటూ రియాక్ట్ అవుతున్నారు. క్రికెటర్ అంటే ఇలా ఉండాలని కామెంట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు.

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. హార్థిక్ పాండ్యాకు భారీ ప్రైజ్ మనీ

ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ బేస్ బాల్ చాలెంజ్ లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మిస్టర్ బీస్ట్ చాలెంజ్ లో హార్దిక్ పాండ్యా ఇరగదీసి.. విజేతగా నిలిచాడు. అత‌డు కొట్టిన ఒక్కో బంతి స్టేడియం అవ‌త‌లే ప‌డింది. ఓ బంతి కెమెరామెన్ కు త‌గిలింది. ఈ క్రమంలోనే లక్ష డాలర్ల ప్రైజ్ మనీ కూడా హార్దిక్ పాండ్యా గెలుచుకున్నాడు. అంటే దాదాపు 94.91 లక్షలు అన్నమాట. ఈ డ‌బ్బును అందుకు హార్ధిక్ పాండ్యా వెంట‌నే, దానం చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. పేద చిన్న పిల‌ల సంర‌క్ష‌ణ‌కు 70 శాతం ఇస్తాన‌ని వెల్ల‌డించాడు. మిగ‌తా మొత్తాన్ని కుక్క‌ల సంర‌క్ష‌ణ కేంద్రాల‌కు దానం చేస్తున్నట్టు వెల్ల‌డించాడు. దీంతో ఈ న్యూస్ వైర‌ల్ గా మారింది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

హార్దిక్ పాండ్యా గాయంపై అనుమానాలు?

టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్ 2026 ఐపీఎల్ తర్వాత క్రికెట్ కు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్ ఒక్క‌టి కూడా ఆడలేదు. కుడి కాలి పిక్క, మోకాలి కింద ఎముక ఒత్తిడి గాయం కారణంగా అతడు జట్టుకు దూరమవుతున్నాడని బీసీసీఐ చెబుతోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతనికి చికిత్స అందిస్తోంది బీసీసీఐ.

Advertisement

ఇది పైకి చెబుతున్న మాటే అయినప్పటికీ..బీసీసీఐతో పాటు ఇండియన్ క్రికెట్ అభిమానులను హార్దిక్ పాండ్యా మోసం చేస్తున్నాడనే ప్రచారం తాజాగా మొదలైంది. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ లో హార్దిక్ పాండ్యా ఫుల్ ఫిట్నెస్ గా కనిపించాడు. ఈ బేస్ బాల్ క్రీడలో అతడు కొట్టే షాట్లకు ప్రతి బంతి స్టేడియం అవతల పడింది. దీంతో అతడు ఫుల్ ఫిట్నెస్ గా ఉన్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కావాలనే అందర్నీ మోసం చేస్తూ గాయం పేరుతో డ్రామాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2027లో ఎంట్రీ ఇచ్చేందుకు హార్థిక్ పాండ్యా ఇలాంటి డ్రామాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

Related News

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!

అల్లా మీద ఒట్టు… 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా షాహీన్ అఫ్రిది అందుకుంటాడు

ట్రై సిరీస్ గెలిచిన పాక్…టీమిండియాకు ఇంజమామ్ వార్నింగ్

పొట్టోడా అంటూ బ‌వుమాను ట్రోల్ చేశారు..ఇప్పుడు వాడే తొక్కితే ఆస్ట్రేలియా ప్లేయర్లు పాతళంలో పడ్డారు

గ‌ల్లీ క్రికెట్ పై ట్వీట్ చేస్తావా? కొంచెమైనా సిగ్గుండాలి..పాక్ ప్ర‌ధాని ష‌రీఫ్ పై అకాశ్ చోప్రా సీరియ‌స్‌

చిచ్చు పెట్టిన అబ్రార్ అహ్మ‌ద్..గిల్ న‌న్ను మోసం చేశాడంటూ లేడీ ర‌చ్చ !

నీ ఇంగ్లీష్‌కు దండం రా నాయ‌నా… ఇఫ్తికార్ అహ్మద్ పై దారుణంగా ట్రోల్స్

Big Stories

Advertisement
×