E-Paper
Advertisement

అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?

అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?
Advertisement

Hyundai Sales October 2026: భారత కార్ల మార్కెట్లో ఫెస్టివల్ సీజన్ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మంచి అమ్మకాలు సాధించాయి. ఈ నేపథ్యంలో  హ్యుందాయ్ మోటార్ ఇండియా అక్టోబర్ 2026లో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతుల్లోనూ మంచి వృద్ధిని సాధించి, ఒక నెలలోనే అత్యధిక అమ్మకాలను సాధించింది.

అక్టోబర్‌లో 82 వేలకుపైగా కార్ల అమ్మకాలు

Advertisement

హ్యుందాయ్ మోటార్ ఇండియా అక్టోబర్ 2026లో మొత్తం 82,299 వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్లో 62,799 కార్లను అమ్మగా, మరో 19,500 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే మొత్తం అమ్మకాల్లో 17.7 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ మార్కెట్‌ లో అమ్మకాలు 16.7 శాతం పెరిగాయి. అదే సమయంలో ఎగుమతులు కూడా 21.1 శాతం వృద్ధిని సాధించాయి. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక నెలలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవేనని హ్యుందాయ్ వెల్లడించింది.

పండుగ సీజన్‌తో పెరిగిన డిమాండ్

అక్టోబర్ నెలలో వచ్చిన అమ్మకాలపై హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ సంతోషం వ్యక్తం చేశారు. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతి విభాగంలోనూ మంచి స్పందన రావడం వల్ల ఈ రికార్డు సాధ్యమైందని తెలిపారు. పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ కంపెనీ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణమైందన్నారు. ఇక ఇటీవల పరిచయం చేసిన హ్యుందాయ్ బేయాన్ SUV కూడా కంపెనీ వృద్ధికి తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మోడల్‌ను భారత్‌తో పాటు 50కి పైగా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో భారత్ హ్యుందాయ్‌ కి కీలకమైన తయారీ, ఎగుమతి కేంద్రంగా మరింత బలపడనుంది.

2027 జనవరిలో బేయాన్ CNG విడుదల

Advertisement

హ్యుందాయ్ ఇటీవల బేయాన్ మిడ్‌సైజ్ SUVని రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. అయితే దీనికి CNG వెర్షన్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. 2027 జనవరిలో బేయాన్ CNGని విడుదల చేయనున్నట్లు సమాచారం. నాలుగు మీటర్లకు పైగా పొడవున్న హ్యుందాయ్ కార్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌తో రానున్న తొలి మోడల్‌గా ఇది నిలవనుంది. ఇందులో అండర్‌బాడీ CNG ట్యాంక్ ఉండే అవకాశం ఉంది.

మొత్తానికి పండుగ సీజన్‌లో వచ్చిన డిమాండ్‌తో హ్యుందాయ్ అమ్మకాలు కొత్త స్థాయికి చేరాయి. రాబోయే రోజుల్లో బేయాన్ CNG వంటి కొత్త మోడళ్లు కంపెనీ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Read Also: మహీంద్రా కార్లకు పండుగ సీజన్ బూస్ట్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

Tags

Related News

పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!

మహీంద్రా కార్లకు పండుగ సీజన్ బూస్ట్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

మారుతి అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 4 కొత్త కార్ల ఎంట్రీ!

MG విండ్సర్ EV ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

MG విండ్సర్ EV ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు.. నవంబర్‌లో రానున్న కొత్త కార్లు ఇవే!

నవంబర్ లో మార్కెట్లోకి కొత్త ఈవీలు.. టీవీఎస్, సుజుకి, ఓబెన్ నుంచి అదిరిపోయే మోడళ్లు!

Big Stories

Advertisement
×