E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode November 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన  దక్షిణమూర్తి 

Karthika Deepam 2 Serial Today Episode November 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన  దక్షిణమూర్తి 
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  సూరజ్‌, జ్యోత్స్న పెళ్లి చేసుకుని వస్తారు. వాళ్లను చూసిన దక్షిణమూర్తి సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఇన్నాళ్లకు నా మనవరాలు నా ఇంటికి వచ్చింది. ఇక నా కూతురు కూడా త్వరలోనే వస్తుందన్న నమ్మకం నాకు కుదిరింది అనుకుంటూ ఎమోషనల్‌ అవుతుంటాడు. మాలిని మాత్రం షాక్‌ అవుతుంది. మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి..? అంటూ తిడుతుంది. పెళ్లి చేసుకోవడం ఏంటి కాదు అత్తా పెళ్లి చేసుకునే వచ్చాము అంటుంది జ్యోత్స్న మీ పెళ్లికి నేను ఒప్పుకోను అసలు మీ పెళ్లే చెల్లదు అంటూ మాలిని చెబితే.. ఎందుకు చెల్లదు అత్తా మేమిద్దరం మేజర్లం.. మేమిద్దరం ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాం.. మధ్యలో మీరు పెళ్లి చెల్లదు అనడమేంటి..? అంటూ జ్యోత్స్న అడిగితే..

అయినా సరే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటుంది. దక్షిణమూర్తి మాత్రం నా కల నెరవేరింది. ఇదంతా సూరజే చేశాడు. అమ్మా లక్ష్మీ నువ్వు వెళ్లి అక్షింతలు పట్టుకురామ్మా.. కొత్త పెళ్లి జంటను దీవించాలి అంటాడు. మాలిని కోపంగా మామయ్యగారు ఈ పెళ్లిని నేను ఒప్పుకోను అంటుంది. ఒప్పుకోవాలమ్మా..? అంటూ దక్షిణమూర్తి చెబితే.. ఒప్పుకోను అంటుంది మాలిని తప్పదమ్మా అంటాడు దక్షిణమూర్తి. అయినా సరే ఒప్పుకోను ఒప్పుకోను.. ఒప్పుకోను నేను ఒప్పుకోను అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే దక్షిణమూర్తి వచ్చి ఏం ఒప్పుకోవు అమ్మా అంటాడు. మాలిని కళ్లు తెరచి చూసి షాక్‌ అవుతుంది. ఇదంతా నా కలనా..? అనుకుంటూ గుమ్మం వైపు చూస్తుంది. అక్కడ ఎవ్వరూ కనిపించరు మాలిని అలాగే చూస్తుండిపోతుంది. దక్షిణమూర్తి ఏమైందమ్మా నీకు అంటే అమ్మగారు సోపాలో నిద్రపోయారు అయ్య.. మీరు కాఫీ తీసుకోండమ్మా అంటూ కాఫీ ఇచ్చేసి వెళ్లిపోతుంది లక్ష్మీ.

Advertisement

ఏమైందమ్మా నీకు రాత్రంతా సోఫాలో నిద్రపోవడం ఏంటి..? పనిమనిషి కాఫీ ఇస్తుంటే.. నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అంటావేంటి..? అని దక్షిణమూర్తి అడిగితే.. మాలిని కంగారుగా సూరజ్‌ ఏడి మామయ్యగారు అని అడుగుతుంది.. బయటకు వెళ్లాడని దక్షిణమూర్తి చెబితే.. ఎక్కడికి వెళ్లాడని మాలిని అడుగుతుంది. ఎందుకమ్మా అంత కంగరు పడుతున్నావు అని దక్షిణమూర్తి అడిగితే.. పీడకల సూరజ్‌ కు జ్యోత్స్నకు పెళ్లి అయినట్టు పీడకల వచ్చింది అని మాలిని చెబితే.. అది పీడకల ఏంటమ్మా మంచి కలే కదా..? చూశావా..? నాకు కూడా ఇదే కల వచ్చింది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయంట.. ఆ మాటే నిజం అయితే మన కల నిజం అవుతుందమ్మా..? ఆ కలను కళ్లారా చూడాలని నా మవనడు ఎప్పుడు నిజం చేస్తాడో ఏంటో..? అంటాడు. మాలిని మాత్రం మనసులో ఇప్పుడు నా భయం కూడా అదే మామయ్యగారు నాకొచ్చిన కల నిజం అవ్వకూడదు అనుకుంటుంటే.

అవునూ బంగారం లాంటి కలను పీడకల అంటావేంటి అని అడుగుతాడు దక్షిణమూర్తి. అందుకు మాలిని జ్యోత్స్నతో పెళ్లి అంటే శివనారాయణ బాబాయ్‌తో గొడవ పెట్టుకున్నట్టే కదా మామయ్య గారు అందుకే పీడకల అన్నాను అంటుంది మాలిని. అందుకు దక్షిణమూర్తి చిన్నగా నవ్వి వాడి బొంద జ్యోత్స్న నా మనవరాలు నా మనరాలు నా మనవడని చేసుకుంటుంది. శివనారాయణకు నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఇదే ఈ కాఫీ తీసుకోమ్మా..? మనిద్దరికి ఒకే కల వచ్చింది అంటే ఇది కల కాదు ఈ ఇంటి భవిష్యత్తు.. ఇది జరిగి తీరుతుందమ్మా..? జ్యోత్స్నకు సూరజ్‌కు పెళ్లి జరుగుతుందమ్మా అంటూ చెప్పి వెళ్లిపోతాడు దక్షిణమూర్తి. జరగదు అంటూ మాలిని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ హౌస్ లో పూరీ జగన్నాథ్ సపోర్టు ఎవరికో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మీనా పై బాలు సీరియస్.. అరుణ్ కు మీనా వార్నింగ్.. ట్విస్ట్ అదిరింది..

Brahmamudi Serial Today Episode November 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు సంతకం చేస్తే రాజు ఏం చేశాడో తెలుసా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ పై రౌడీలు దాడి.. చందు మాటతో వల్లి షాక్.. భద్ర ప్లాన్ అట్టర్ ప్లాప్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థును చూసిన మనోహరి ఏం చేస్తుంది…?  

ముఖేష్ కు కాళ్లు మొక్కడంపై వర్షిణి మదర్ రియాక్షన్… రామకృష్ణకు క్షమాపణలు!

Big Stories

Advertisement
×