Telangana Education: తెలంగాణ విద్యా రంగంలో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. విద్యాశాఖ పై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు… విద్యార్థులకు అల్పాహారం, పాలు, నాణ్యమైన భోజన,వసతితో పాటు తరగతి గదుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. ఇలా సమూల మార్పులు చేపడుతోంది తెలంగాణ విద్యాశాఖ .
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి వరకు నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయకుండా చూడొచ్చున్నారు. తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు ప్రత్యేక విద్య, వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అధికారులు సీఎం ఆదేశాలు..
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య అందించేలా.. డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆధునిక సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు, క్రీడా సదుపాయాలతో పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, అన్ని మౌలిక వసతులతో సొంత భవనాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం : సీఎం రేవంత్
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను… pic.twitter.com/XVR2V3U8oz
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2026
సీఎం హామీ..
మరోవైపు జూనియర్ కళాశాలల బోధనా, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వబోమని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, పాలు అందించే కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. విద్యార్థులకు యూనిఫామ్స్, స్టేషనరీ వంటి అవసరాలను కూడా అందించాలని తెలంగాణ విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
Also Read: పండుగలను మనం కోల్పోయామా..? పండుగలే మనల్ని వదిలేసి వెళ్లిపోయాయా..?