Bigg Boss 10 Telugu Day 67 Promo 2: బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం 10వ వారం పూర్తి. ప్రతివారం టాస్కులతో కంటెస్టెంట్ల మధ్య నువ్వా నేనా అంటూ పోటీ ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున గొడవలు కూడా పడేవారు. అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్(Family Week) కావడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్ లో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఈ వీక్ అంత చాలా ఎమోషనల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు అయితే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో భాగంగా రాంప్రసాద్ ఫ్యామిలీతో పాటు సుధీర్ రెడ్డి (Sudheer Reddy)ఫ్యామిలీ కూడా వచ్చారని తెలుస్తోంది.
తాజాగా ఈరోజు జరిగే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా సుధీర్ రెడ్డి తల్లి హౌస్ లోకి అడుగుపెట్టారు.
ముందుగా బిగ్ బాస్ సుధీర్ రెడ్డి మదర్ పంపిన ఫుడ్ అందరికీ ఇవ్వగా ఆ ఫుడ్ టేస్ట్ చేసిన సుధీర్ బిగ్ బాస్ తో మాట్లాడుతూ.. ఈ ఫుడ్ అచ్చం మా అమ్మ చేతి వంటలాగే ఉంది కానీ నీతూ మాస్టర్ కూడా నటరాజ్ మాస్టర్ పంపించారని చెబుతున్నారు. మా అమ్మను గుర్తు చేశారు బిగ్ బాస్ అంటూ సుధీర్ మాట్లాడుతూ ఉండగా అంతలోపే గేట్స్ ఓపెన్ అవ్వడం సుదీర్ మదర్ హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది.
ఇలా సుధీర్ రెడ్డి తన అమ్మను చూడగానే ఒక్కసారిగా వెళ్లి కౌగిలించుకోగా ఆమె మాత్రం తన కొడుకుని చూసి బోరున ఏడ్చారు. నీ కాలికి దెబ్బ తగిలింది ఇప్పుడు ఎలా ఉందో నన్ను చూడు నువ్వు అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ ఏడ్చారు. అయితే తన కాలు బాగుందని కొంచెం వాపు మాత్రమే ఉందని సుధీర్ రెడ్డి చెప్పారు. అనంతరం అందరికీ నేను నిన్ను పరిచయం చేస్తానని చెప్పగా నేనే అందరి పేర్లు చెబుతానని సుధీర్ రెడ్డి తల్లి చెప్పారు. అనంతరం నీతూ మాస్టర్(Neethu Master) రావడంతో మా అబ్బాయి లాస్ట్ లైన్ లో ఉన్నాడు రెండు స్టెప్పులు నేర్పించి పంపించండి నీతూ మేడం అంటూ డాన్స్ నేర్పించమని స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.
ఇక సుధీర్ అమ్మ మాట్లాడుతూ నేను మా ఇంట్లో మా బాబుకి సుధీర్ రెడ్డి అని పేరు పెట్టాను కానీ మీరందరూ ఎందుకు జిగా జిగా అని పిలుస్తున్నారు అంటూ అడిగారు. అంతలోనే బిగ్ బాస్ మీ ఇంట్లో ఉన్న సుధీర్ కు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సుధీర్ కు ఏదైనా తేడా ఉందా అంటూ అడగడంతో ఆమె జిగా సామి అని సమాధానం ఇచ్చారు. అనంతరం కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ కొడుకుకు ప్రేమగా భోజనం తినిపించారు. మా కోసం ఒక్కసారి సుదీర్ ను జిగా అని పిలవమ్మా అంటూ త్రిగుణ్ అడగడంతో రేయ్ జిగా రారా అంటూ ఆమె తన కొడుకును హక్కును చేర్చుకున్నారు ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
Also Read: సుడిగాలి సుధీర్ ‘జి.ఓ.ఏ.టి.’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?