Ye Devi Varamo Neevu Serial Manish: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో ఏ దేవి వరమో నీవు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ లో హీరో మనీష్ పాత్ర(Manish Role)లో నటుడు శ్రావణ్ కుమార్(Sravan Kumar) నటించిన సంగతి తెలిసిందే. శ్రావణ్ కుమార్ ఇదివరకు పలుకు బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన ఇదివరకు స్టార్ మా లో ప్రసారమైన మగువ ఓ మగువా సీరియల్లో నటించారు. ఇప్పుడు స్టార్ మా లో ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu) అనే సీరియల్ లో నటిస్తున్నారు.
ఇలా ఈ సీరియల్ తో పాటు ఈయన గతంలో అత్తారింటికి దారేది, అమ్మకు ప్రేమతో, కస్తూరి, పల్లకిలో పెళ్లికూతురు, కళ్యాణం కమనీయం వంటి సీరియల్స్ లో నటించారు. ఇలా పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రావణ్ కుమార్ అనంతపురం జిల్లా నిదనవాడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం ఇష్టం లేకపోవడంతో ఇండస్ట్రీపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఇలా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న శ్రావణ్ కుమార్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్(Assistant Director) గా పనిచేశారు. ఇలా ఈయన ఒక చిన్న విరామం అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
ఈ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఈయన అత్తారింటికి దారేది సీరియల్ ఆడిషన్ సమయంలో పాల్గొన్నారు. ఈ సీరియల్ అవకాశం అందుకున్న శ్రావణ్ కుమార్ నటుడిగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఇక ఈ సీరియల్ మంచి సక్సెస్ కావడంతో ఈయన వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.. శ్రావణ్ కుమార్ నటుడిగా మంచి సక్సెస్ కావడంతో ఈయన భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.
ఇలా పలు టీవీ ఛానల్ లో సీరియల్స్ ద్వారా నెల రోజులు ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన ఒక్కరోజు షూటింగ్లో పాల్గొంటే ఏకంగా 35వేల రూపాయల వరకు రెమ్యునరేషన్(Remuneration) అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా ఒక్క రోజుకు రూ.35 వేల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కన ఈయన సీరియల్స్ ద్వారా నెలకు 10 లక్షలకు పైగా ఆదాయం అందుకుంటున్నారని చెప్పాలి. ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంటారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే శ్రవణ్ కుమార్ నటుడిగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలోనే సంపాదన అందుకుంటున్నారు.
Also Read: శేఖర్ మాస్టర్ కు ప్రమాదం..స్పందించిన జానీ మాస్టర్ ..ఇప్పుడు ఎలా ఉందంటే?