E-Paper
Advertisement

అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!

అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!
Advertisement

Avinash:టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ముక్కు అవినాష్ (Mukku Avinash). జబర్దస్త్ లో తనదైన కామెడీతో.. గెటప్లతో.. నవ్వులు పూయించి.. అటు బిగ్ బాస్ లో కూడా సందడి చేశారు. అల్లరి చేస్తూ ఆకట్టుకుంటూ అందరినీ నవ్వించే అవినాష్ జీవితంలో కూడా పుట్టెడు దుఃఖం ఉందంటే ఎవరైనా నమ్మగలరా? ముఖ్యంగా అది సంవత్సరమో.. రెండేళ్లలో ఆ దుఃఖం పోయేది కాదు.. జీవితాంతం మోయలేని నరకాన్ని దేవుడు తనకు ఇచ్చాడంటూ మరొకసారి కన్నీటి పర్యంతమయ్యారు ముక్కు అవినాష్. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ప్రముఖ లేడీ యాంకర్ శ్రీముఖితో కలసి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మెన్స్ డే స్పెషల్ సందర్భంగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో అవినాష్ తన బాధను వ్యక్తపరుస్తూ చేసిన కామెంట్లు అందరిచేత కన్నీళ్లు పెట్టించాయి.

మొదటి బిడ్డను కోల్పోయిన అవినాష్..

అవినాష్ భార్య అనూజ 2024లో తొలిసారి గర్భం దాల్చింది. అయితే ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించి యూట్యూబ్ వీడియోలు చేసిన అవినాష్ తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఏం పేరు పెట్టాలి? ఎలాంటి దుస్తులు వేయాలి ? అని ప్రతిదీ కూడా ఆడియన్స్ తో పంచుకునేవారు. తమ మొదటి బిడ్డ రాక కోసం కోటి ఆశలు పెట్టుకున్న ముక్కు అవినాష్ దంపతులకు దేవుడు ఆ ఆశలను విచ్ఛిన్నం చేశాడు. ఈ ప్రపంచాన్ని చూడకుండానే ఆ చిన్నారి కన్నుమూసారు. ఆయన భార్య అనూజకు గర్భస్రావం అయింది ఈ విషయాన్ని కూడా అవినాష్ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

డాక్టర్స్ కాళ్ళ మీద పడ్డాను. కానీ..

Advertisement

ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బాబు అనూజ కడుపులో ఉన్నాడు. అయితే సడన్ గా ఫోన్ వచ్చింది. బాబు లోపల చనిపోయారండి అని ఫోన్ చేశారు. నేను అనూజ పొట్ట దగ్గరకు వెళ్లి నాన్న లెగు లెగు అని అడిగాను. అయితే వాడు మార్నింగే చనిపోయాడంట. ఆ విషయం నాకు తెలియదు. చనిపోయిన ఆ బాబుతోనే ఈవినింగ్ అంతా ఆడుకున్నాను. డాక్టర్ కాళ్ళ మీద పడ్డాను. సినిమాల్లో గుండెపై నొక్కితే బ్రతుకుతారు కదా..అలా మీరు ఏదైనా చేయండి నా కొడుకును బ్రతికించండి అని ప్రాధేయపడ్డాను” అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇక ఈ నరకాన్ని జీవితాంతం మోయలేనిది అంటూ అవినాష్ కన్నీళ్లు పెట్టుకోవడం వైరల్ గా మారింది.

also read:బంపర్ ఆఫర్ కొట్టేసిన కావ్య.. అంతా సుధీర్ దయ?

ఏడాది తర్వాత కొడుకును పరిచయం చేసిన అవినాష్ దంపతులు..

Advertisement

ఇకపోతే ఆ బాధను తగ్గిస్తూ దేవుడు ఈ దంపతులకు 2025 మే 14న మరో పండంటి మగ బిడ్డను ప్రసాదించారు. అయితే కుమారుడి జననాన్ని పూర్తి ఒక ఏడాది పాటు గోప్యంగా ఉంచిన ఈ జంట.. మే 14 2026న తమ కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభిమానులకు అధికారికంగా తమ కొడుకును పరిచయం చేశారు. ఆ బాబుకి అద్వైత్ అని నామకరణం చేశారు. ఇకపోతే ఈ జంట 2021 నవంబర్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Related News

బంపర్ ఆఫర్ కొట్టేసిన కావ్య.. అంతా సుధీర్ దయ?

ఏ దేవివరమో నీవు సీరియల్ మనీష్ సీరియల్స్ చేయకముందు ఏం చేసేవారో తెలుసా?

రామ్ ప్రసాద్ సీక్రెట్ బయటపెట్టిన అమ్మ!

క్యాన్సర్ బారిన పడ్డ బిగ్ బాస్ బ్యూటీ.. ఆరోగ్య పరిస్థితిపై వీడియో రిలీజ్!

‘గోదావరి ‘ సీరియల్స్ లవర్స్ బిగ్ షాక్.. హీరో అవుట్..

తండ్రిగా ప్రమోట్ అయిన జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

Illu Illalu Pillalu Today Episodes: ట్రావెల్ ఏజెన్సీ కోసం గ్రాండ్ ఏర్పాట్లు..భాగ్యం మాస్టర్ ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Big Stories

Advertisement
×