Business Ideas for Housewives: ఈ రోజుల్లో పెళ్లైన మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా.. ఆర్థికంగానూ నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి అవసరమనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ సరిగ్గా రూ. 1 లక్ష బడ్జెట్‌తోనే ఇంట్లో ఉండి నెలకు వేలల్లో, లక్షల్లో సంపాదించవచ్చన్న విషయం చాలా మంది మహిళలకు తెలియదు. మహిళలు సులభంగా ప్రారంభించగల 4 లాభదాయక వ్యాపారాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా గృహిణులు వంటలను అదరగొట్టేస్తుంటారు. కేక్స్, చాక్లెట్ల తయారీపై అవగాహన ఉంటే హోమ్ మేడ్ బేకరీ ఏర్పాటు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. పుట్టినరోజులు, పెళ్లిళ్లు, వివిధ వేడుకలకు కస్టమైజ్డ్ కేకులు, కప్ కేక్స్, ప్రీమియం చాక్లెట్లకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. బేకింగ్ ఓవెన్, ముడిసరుకులు, ప్యాకింగ్ మెటీరియల్‌కు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి.. సోషల్ మీడియాలో ఉత్పత్తుల ఫోటోలు పోస్ట్ చేయడం ద్వారా సులభంగా ఆర్డర్లు పొందొచ్చు.
రసాయనాలు లేని సహజ సిద్ధమైన ఉత్పత్తులకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఆర్గానిక్ సబ్బులు, హెర్బల్ షాంపూలు, ఫేస్ ప్యాక్స్, లిప్ బామ్‌లను తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేయడం ద్వారా మంచి వ్యాపారాన్ని సృష్టించుకోవచ్చు. ఈ వ్యాపారానికి అవసరమైన ముడిసరుకులు, బ్రాండింగ్ కోసం రూ.లక్ష పెట్టుబడి పెడితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్, లోకల్ దుకాణాల ద్వారా వీటిని విక్రయించి లాభాలు అర్జించవచ్చని సూచిస్తున్నారు.
రుచికరమైన వంటలు చేసే హోస్ వైఫ్స్ కు క్లౌడ్ కిచెన్ లేదా హోమ్ మేడ్ టిఫిన్ సర్వీస్ అద్భుతమైన బిజినెస్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, బ్యాచిలర్స్.. ఇంటి భోజనం తెగ మిస్ అవుతుంటారు. అలాంటి వారికి మీ వంటగది నుంచే హోమ్ మేడ్ ఫుడ్ ను అందించవచ్చు. వంటసామాగ్రి, ప్యాకింగ్ కవర్లు, ముడి సరుకుల అవసరం దృష్ట్యా రూ.లక్ష పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!
పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లో గిఫ్ట్‌లు ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. ఫలితంగా ఫోటో ఫ్రేమ్‌లు, హ్యాండ్‌మేడ్ జ్యూవెల్లరీ, ఎంబ్రాయిడరీ వర్క్స్, డెకరేటివ్ ఐటమ్స్ వంటి వాటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల కోరికలకు అనుగుణంగా డిజైన్ చేసిచ్చే ఈ గిఫ్టింగ్ వ్యాపారంలో లాభాల మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సోషల్ మీడియాలో మార్కెటింగ్ ద్వారా పెద్దఎత్తున కస్టమర్లను సంపాదించుకోవచ్చని సూచిస్తున్నారు.
Also Read: గోల్డెన్ ఛాన్స్.. రూ.11,000 లోపే 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!