E-Paper
Advertisement

అక్రమ అండాల కేసులో సంచలనం.. హై-డోస్ ఇంజెక్షన్లతో సేకరణ దందా!

అక్రమ అండాల కేసులో సంచలనం.. హై-డోస్ ఇంజెక్షన్లతో సేకరణ దందా!
Advertisement

Oasis Fertility: సరూర్‌నగర్ పోలీసుల దర్యాప్తులో ఓయాసిస్ ఫెర్టిలిటీ అక్రమాలు బయటపడ్డాయి. సద్గురు హెల్త్‌కేర్ COO ప్రతీక్ అనిల్ గగ్లానీని A-8గా.. మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్‌ను A-9గా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వైద్యుల నియామకం నుంచి కోట్ల రూపాయల నిధుల మళ్లింపు వరకు వీరి కనుసన్నల్లోనే నడిచినట్లు పోలీసులు. టూర్ల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పేద యువతులను హైదరాబాద్‌కు రప్పించి ఒక్కో సైకిల్‌కు 30 వేల ఆశచూపి అండాలను పిండేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

20కి పైగా అండాలు..

డబ్బు కక్కుర్తితో మహిళల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టారు ఈ కేటుగాళ్లు. ఒక్కో మహిళ నుంచి ఏకంగా 20కి పైగా అండాలు సేకరించేందుకు హ్యూమో-జి, ఫాలీ సర్జ్, మెటీనా, ట్రెగర్ వంటి హై-డోస్ హార్మోన్ ఇంజెక్షన్లను ఇష్టారాజ్యంగా వాడినట్లు తేలింది. ఐదు రాష్ట్రాల్లోని 43 క్లినిక్‌ల ద్వారా నెలకు వందల సైకిళ్లు నడిపిస్తూ, ఇప్పటివరకు 600 మంది మహిళలను ఈ ఉచ్చులోకి లాగారు. ఈ దందాలో మియాపూర్ ART బ్యాంక్ ఇన్‌చార్జ్ సునీల్ రాయ్‌తో పాటు పద్మజ, నర్మదా ఫెర్టిలిటీ సెంటర్ల పాత్రపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు.

బయటపడ్డ ఆర్థిక కోణం..

Advertisement

ఇక ఈ కేసులో బయటపడ్డ ఆర్థిక కోణం పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది. సద్గురు హెల్త్‌కేర్ HDFC ఖాతాలో కేవలం ఎనిమిది నెలల్లోనే 487 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న 6 కోట్ల 83 లక్షల రూపాయలను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. బ్లాక్ మనీని వైట్ చేసేందుకు 39 షెల్ కంపెనీలను వాడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితులు కిరణ్, దుర్గారావులపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. బేగంపేట కార్పొరేట్ ఆఫీసులో దొరికిన హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌ల చిక్కుముడి విప్పుతున్నారు.

పెద్దల హస్తం..

అండాల దానం ముసుగులో సాగిన ఈ దందాలో ఇంకా ఎంతమంది పెద్దల హస్తం ఉంది? పరారీలో ఉన్న కిరణ్, దుర్గారావు దొరికితే ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయి? 487 కోట్ల రూపాయల లెక్క తేలితే ఈ మాఫియా సామ్రాజ్యం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Also read: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్.. ఇండియాలో దుమ్మురేపుతున్న 5 బడ్జెట్ బైక్‌లు!

Tags

Related News

ఐటీ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. సైబరాబాద్ పోలీసులు అదిరిపోయే ప్రయోగం

కరీంనగర్ దీక్షా దివస్ సభపై బండి సంజయ్ ఫైర్.. కేటీఆర్ పై మాస్ పంచులు

ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌పై వ్యాపారులు ఫైర్.. జరిమానాలు తప్పవా..?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. డీలిమిటేషన్‌‌తో బీజేపీకి లాభమా నష్టమా..?

మరో మైలురాయిని దాటుతున్న తెలంగాణ.. అదేంటో తెలుసా..?

కరీంనగర్ దీక్షా దివస్ సభలో.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్ భిక్షతోనే రేవంత్‌కు సీఎం పదవి.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×