BigTV English

Youtuber Poolachokka: యూట్యూబర్ పూలచొక్కా అరెస్ట్.. రివ్యూల కోసం 40 వేలు అడిగాడా ?

Youtuber Poolachokka: యూట్యూబర్ పూలచొక్కా అరెస్ట్.. రివ్యూల కోసం 40 వేలు అడిగాడా ?

Youtuber Poolachokka: యూట్యూబర్ పూలచొక్కా గురించి అందరికి తెలుసు.. పూల చొక్క నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా..రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ ను అందుకుంది. అయితే ప్రమోషన్స్ కోసం 40 వేలు పూల చొక్క నవీన్ డిమాండ్ వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే రివ్యూ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేశాడా? పూర్తి వివరాలు పోలీసులు వెళ్లడించాల్సి ఉంది..


నిర్మాత ఫిర్యాదుతో అరెస్ట్.. 

ఈ మధ్య సినిమాలకు రివ్యూలు ఇవ్వాలంటే ఖచ్చితంగా డబ్బులు భారీ మొత్తంలో చెల్లించాలని యూట్యూబర్స్ డైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అది నిజమని ప్రూవ్ అయ్యింది.   వర్జిన్ బాయ్స్ అనే చిత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత రాజా దారపునేని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో నవీన్ పై కేసు నమోదు నమోదు చేశారు. వర్జిన్ బాయ్స్ చిత్రానికి పాజిటివ్ గా రివ్యూ ఇవ్వాలంటే తనకి రూ.40 వేలు ఇవ్వాలని నవీన్ డిమాండ్ చేశాడని ఇవ్వకుంటే నెగటివ్ రివ్యూ ఇస్తానని బెదిరించాడని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో యూట్యూబర్ పూలచోక్కా నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


నవీన్ ఏమంటున్నాడంటే..? 

వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ తనకి కాల్ చేసి ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేయాలని కోరారు. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగారు. నేను ఒక అమౌంట్ చెప్పాను. మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు ఫోన్ చేసి.. వర్జిన్ బాయ్స్ మూవీ చూసి రివ్యూ పాజిటివ్ గా చెప్పండి అని అడిగారు. నేను సినిమా నాకు నిజంగా నచ్చితే బాగా ఇస్తాను. లేకుంటే ఉన్నది ఉన్నట్లు ఇస్తాను అని అన్నాను అంటున్నాడు యూట్యూబర్. నిర్మాత కక్ష కట్టి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ప్రమోషన్స్ కి డబ్బులు అడిగిన విషయాన్ని రివ్యూకి అడిగినట్లు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటున్నారు పూలచోక్కా నవీన్..

Related News

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Sandeep Reddy Vanga: దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇంకేదీ లేదు

Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే

Ghaati Collections : అనుష్క గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా.. ఏంటీ ఈ కలెక్షన్లు ?

Pawan Kalyan: ఓజీ ప్రమోషన్స్.. పవన్ అవసరం లేదు ?

Big Stories

×