BigTV English

Brahmamudi Serial Today April 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కాఫీ షాపు నుంచి వెళ్లిపోయిన కావ్య – యామినికి రాజ్‌ వార్నింగ్‌   

Brahmamudi Serial Today April 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కాఫీ షాపు నుంచి వెళ్లిపోయిన కావ్య – యామినికి రాజ్‌ వార్నింగ్‌   
Advertisement

Brahmamudi serial today Episode:  కాఫీ షాపు నుంచి కావ్య వళ్లిపోతుంటే.. రాజ్‌ ఆపుతాడు. ఏమైందని అడుగుతాడు. మీ తప్పేం లేదని ఏడుస్తూ కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య బయటకు వెళ్ళి కారులో కూర్చోగానే.. యామిని వచ్చి కారు దిగి లోపలికి వెళ్తుంది. రాజ్‌ దగ్గరకు వెళ్లిన యామిని ఏంటి బావ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ నీ కోసమే చూస్తున్నాను అంటాడు. అబ్బా చా నిజమేనా..? అంటుంది యామిని. నిజంగా నీ కోసమే చూస్తున్నాను అంటాడు రాజ్‌. దీంతో యామిని నాకు తెలుసు బావ నువ్వు నా కోసమే చూస్తున్నావని..జస్ట్‌ కిడ్డింగ్‌.. అయినా చెప్పకుండా వచ్చేశావేంటి..? పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అంటుంది. యామిని. అంటే పొద్దునే నిన్ను డిస్టర్బ్‌ చేయడం ఎందుకని వచ్చేశా అంటాడు రాజ్‌. అయితే కాఫీ తాగుదాం దా అంటుంది యామిని.. చెప్పాను కదా నేను తాగేశాను. నువ్వు తాగి ఇంటికి వచ్చేసెయ్‌ అంటాడు. దీంతో యామిని కాఫీ నాకు కూడా ఏమీ వద్దులే ఇంటికి వెళ్దాం పద అంటుంది. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.


అప్పు యామిని ఫ్యామిలి గురించి కానిస్టేబుల్ తో ఎంక్వైరీ చేయిస్తుంది. కానిస్టేబుల్‌ అన్ని యామిని డీటెయిల్స్‌ తెలుసుకుని అప్పు చెప్తాడు. ఇంకా అన్ని డీటెయిల్స్‌ తెలుసుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఫాలో చేయండి అని చెప్తుంది. దుగ్గిరాల ఇంట్లో ఆపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ ఫ్రూట్స్‌ తీసుకొచ్చి ఇవ్వగానే తీసుకుని తింటుంది. నిన్నిలా చూస్తుంటే.. నాకు చాలా సంతోషంగా ఉంది. కనీసం ఫ్రూట్స్‌ అయినా తినడం మొదలు పెట్టావు అంటుంది. దీంతో అపర్ణ నాకు మాత్రం కావ్య ధైర్యం ఇచ్చింది అత్తయ్య.  తన మాటలు తన నమ్మకం చూస్తుంటే. ఎక్కడో చిన్న ఆశ మొదలైంది. అంటుంది. ఇంతలో రుద్రాణి, రాహుల్ ఎంట్రీ ఇస్తారు. నేడే చూడండి.. మీ అభిమాన నటి నట విన్యాసం. దుగ్గిరాల ఇంటి కోడలి విశ్వరూపం. ఆలసించిన ఆశాభంగం.. మంచి తరుణం మించినా దొరకదు అనగానే.. స్వప్న వెటకారంగా అబ్బా అత్తా ఫర్‌పెక్ట్‌గా మాట్లాడుతున్నావు అత్తా.. నీకు కరెక్టు ప్రొఫెషన్‌ దొరికింది.

పనిలో పనిగా మన కంపెనీ పోస్టర్లు కూడా ఒక నాలుగు ఇస్తాను వెళ్లి గోడలకు అతికించి ప్రచారం చేసి వచ్చేయ్‌ డబ్బులకు డబ్బులు వస్తాయి. మన కంపెనీకి ప్రచారం వస్తుంది అనగానే.. వెంటనే రుద్రాణి పోస్టర్లు గోడకు అతికిస్తే ఏమోస్తుందే..అదే  నీ చెల్లెలు నటించిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఆడిస్తే దాని పెర్మామెన్స్‌కు వంద రోజులు గ్యారంటీగా ఆడుతుంది. అని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి ఏంటా వెర్రి వాగుడు. నా మనవరాలు నటించడం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో రుద్రాణి వెర్రి వాగుడు నాది కాదమ్మా నీ మనవరాలిది. ఏంటి ఏవ్వరికీ నమ్మకం కలగడం లేదా..? పోనీ వీడియో చూస్తే నమ్ముతారా..? మొబైల్‌ లో చిన్నగా కనిపిస్తుంది. బిగ్ స్క్రీన్‌ కనెక్ట్ చేస్తాను. చూసి తరిండండి. అంటూ తన మొబైల్‌ లో కావ్య ఒక్కతే రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడిని వీడియో చూపిస్తుంది. వీడియో చూసిన అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కావ్య వస్తుంది.


దీంతో రుద్రాణి.. ఓ మన హీరోయిన్‌ కూడా వచ్చింది. నీ గురించి నీ పెర్మామెన్స్‌ గురించే మాట్లాడుతున్నాం కావ్య. ఇప్పుడు వాళ్లు రివ్యూ ఏమిస్తారో నీ యాక్టింగ్‌ కు ఎన్ని స్టార్స్‌ ఇస్తారో తెలుసుకుందామా..?ఏంటి వదిన ఏం మాట్లాడావు. తన నమ్మకాన్ని చూసి మీలో ధైర్యం వచ్చిందా..? మరి ఈ వీడియో చూసి ఏమనిపించింది. నిన్నటి వరకు అందరూ ఏమన్నారు కావ్యను నేను టార్చర్ పెడుతున్నానా..? ఇప్పుడు ఎవరు ఏంటో అందరికీ బాగా అర్థం అయిందా..? అంటూ కావ్యన తిడుతుంది.   దీంతో రుద్రాణిని తిడుతూ నేను ఒక్కదాన్నే మాట్లాడాను అని ఎలాఅనుకుంటారు. నేను ఫోన్‌ మాట్లాడాను కదా అంటుంది. దీంతో ఆ వీడియోలో ఫోన్‌ ఎక్కడుంది అమ్మా.. అంటుంది రుద్రాణి. దీంతో కావ్య వీడియోను జూమ్‌ చేసి తన చెవిలో ఉన్న బ్లూతూట్‌ చూపిస్తుంది. నేను క్లయింట్స్‌ తో ఫోన్‌ మాట్లాడుతుంటే.. వీడియో తీసి నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్నారు. అసలు నన్ను ఫాలో అవ్వడానికి మీరెవరండి అంటూ నిలదీస్తుంది. ఇంకొక్కసారి నన్ను ఇలా ఫాలో అయితే ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

ఇంటికి వెళ్లాక రాజ్‌, యామిని తిడతాడు. నేను ఎక్కడికి వెల్లాలి. ఏమీ చేయాలి అనేది నువ్వే చెప్పాలా..? నన్ను నన్నుగా ఉండనివ్వు కాస్త ప్రైవసీగా ఉండనివ్వు అంటూ లోపలికి వెళ్తాడు. దీంతో యామిని బాధపడుతుంది. చూశావా మమ్మీ తనను ఫ్రీగా వదిలేయాలట. అలా చేస్తే నాకు దక్కుతాడా..? అంటుంది. దీంతో వైదేహి ఊరడింపు మాటలు చెప్తుంది. మరోవైపు అపర్ణ, సుభాష్‌, ఇందిరాదేవి బాధపడుతుంటారు. కావ్య గురించి ఆలోచిస్తూ ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందోనని ఆందోళన చెందుతుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Intinti Ramayanam Srikar : ‘ఇంటింటి రామాయణం’ శ్రీకర్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Illu Illalu Pillalu Today Episode: వల్లికి కడుపు మంట.. భాగ్యం మాస్టర్ ప్లాన్.. ప్రేమ, ధీరజ్ ఒక్కటవుతారా..?

Nindu Noorella Saavasam Serial Today october 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  చంభా, ఘోరాకు షాక్‌ ఇచ్చిన అంజు

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. మారిపోయిన అక్షయ్.. అవనికి మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today October 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణి ప్లాన్‌ సక్సెస్‌ – గంగలో కలిసిపోయిన దుగ్గిరాల పరువు

GudiGantalu Today episode: మీనా పై ప్రభావతి సీరియస్.. శిష్యులుగా చేరిన మీనా, బాలు.. ప్రభావతికి నొప్పుల బాధ..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×