IPL 2025: శ్రీలంక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) ప్లేయర్ మతిష పతిరానా ( Matheesha Pathirana ) గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే స్టార్ బౌలర్ గా ఎదిగాడు మతిష పతిరానా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా వెలుగులోకి వచ్చాడు ఈ కుర్రాడు. 22 సంవత్సరాలు ఉన్న మతిష పతిరానా… అంతర్జాతీయ క్రికెట్ లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే… లసిత్ మలింగ తరహాలో.. భయంకరమైన బౌలింగ్ వేసే చాతుర్యమున్న మతిష పతిరానా ( Matheesha Pathirana )ను… ఇండియన్ ప్రీమియర్ మెగా వేలంలోకి ( Indian Premier Mega Auction) తీసుకువచ్చారు.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
ఈ తరుణంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనిని కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు మతిషా పతిరన. మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) కెప్టెన్సీలో మొదట్లో ఆడిన మతిష పతిరానా… ఆ తర్వాత రుతురాజు కెప్టెన్సీలో కూడా కొనసాగుతున్నాడు. ఇక మొన్న జరిగిన మెగా వేలంలో… బౌలర్ మతిష పతిరానాను 13 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. గత ఐపిఎల్ సీజన్లలో.. మతిష పతిరానా అద్భుతంగా ఆడిన నేపథ్యంలో.. అతని మళ్లీ రిటర్న్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) . ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) కూడా మతిష పతిరానా.. అద్భుతంగా ఆడుతున్నాడు. డెత్ ఓవర్ల లో.. అద్భుతం గా బౌలింగ్ చేసే మతిష పతిరానా… జట్టుకు కావాల్సిన సమయంలో వికెట్లు తీస్తున్నాడు.
Also Read:Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
ముఖ్యంగా యార్కర్లు వేసి… బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నాడు మతిష పతిరానా. అయితే తాజాగా మతిష పతిరానా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రత్యర్థి వికెట్ తీసిన తర్వాత.. తమ దైవాన్ని ప్రార్థిస్తూ… గ్రౌండ్ లోనే పూజలు చేస్తూ ఉంటాడు మతిష పతిరానా. కళ్ళు మూసుకొని… భయంకరంగా కనిపిస్తాడు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రతి మ్యాచ్ లోనూ మతిష పతిరానా ఇలాగే చేస్తాడు. అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జూనియర్ అండర్టేకర్ ( the undertaker ) ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అండర్ టేకర్ కూడా… రింగులోకి రాగానే… తన కళ్ళతో అందరినీ భయపట్టిస్తాడు. అతన్ని చూస్తే అందరూ వణికి పోవాల్సిందే. అలా అతను కండ్లను… మార్చుకుంటాడు అండర్ టేకర్. అయితే ఇప్పుడు శ్రీలంక బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతిష పతిరానా కూడా అలాగే చేస్తున్నాడు. దీంతో ఇద్దరు ఒకే తరహాలో చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.