E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 1st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల చేత వ్రతం చేయిస్తానన్న అపర్ణ

Brahmamudi Serial Today Episode August 1st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల చేత వ్రతం చేయిస్తానన్న అపర్ణ
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్య గురించి ఇందు, రాజుతో బాధపడుతుంది. ఇప్పుడు ఎలా తనను కాపాడుకోవాలో అర్థం కావడం లేదని తనకు ఎలా చెప్పినా ఇగో హర్ట్‌ అవుతుందని.. కానీ ఎలాగైనా తనను మార్చుకోవాలని చెప్పి కింద పడుకుంటుంది. రాజు నిద్రపోతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న అపర్ణ వాళ్లిద్దరినీ చూసి ఇదేంటి ఇందు బెడ్‌ మీద పడుకోలేదు.. కింద పడుకుంది ఏంటి..? అనుకుని వెళ్లి సుభాష్‌తో అసలు విషయం చెప్తుంది. ఐశ్వర్య అన్న మాటలు ముందు నమ్మబుద్ది కాలేదు కానీ ఇప్పుడు డౌటు వస్తుంది. వాళ్లిద్దరూ గదిలో వేరు వేరుగా పడుకున్నారు. ఐశ్వర్య చెప్పినట్టు వాళ్లిద్దరు నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది అంటుంది.

అందుకు సుభాస్‌ భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న అలకులు ఉంటాయి కదా..? అలా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగి వేరుగా పడుకున్నారేమో అంటాడు. అందుకు అపర్ణ భయంగా ఒకవేళ ఐశ్వర్య అన్న మాటలు నిజం అయితే అనగానే.. అలాంటిదేం ఉండదులే అపర్ణ అని సుభాష్‌ చెప్పినా తన వల్ల కావడం లేదని అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని అలాగని వాళ్లను డైరెక్టుగా అడిగితే చెప్పరు. అలా అని నేను తెలుసుకోకుండా ఉండలేను ఇప్పుడు నేనేం చేయాలండి.. ఆ నిజం తెలిసే మార్గం ఏంటి అని అడగ్గానే.. సుభాష్‌ మార్గం ఉంది అపర్ణ.. ఇందు, రాజుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిద్దాం.. ఒకవేళ వాళ్లిద్దరికి పెళ్లి అయి ఉంటే పూజలో పాల్గొంటారు. లేదంటే పాల్గొనరు అని సుభాష్‌ చెప్పగానే.. అవునండి.. రేపే ఆ పూజకు ఏర్పాటు చేయిస్తాను అని అపర్ణ చెప్తుంది. వాళ్లిద్దరూ భార్యాభర్తలా కాదా అనేది రేపే తెలిసిపోతుంది అంటుంది అపర్ణ.

Advertisement

వెంకట్‌ ఆఫీసుకు వెళ్తుంటే.. నందు వస్తుంది. నందును చూసిన వెంకట్‌ వెంటనే ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి లక్ష్మీతో నందు వస్తుంది ఇంట్లో నేను లేనని చెప్పమని లోపలికి వెళ్లి దాక్కుంటాడు. ఇంతలో నందు లోపలికి వచ్చి లక్ష్మీని వెంకీ ఇంట్లోనే ఉన్నాడా అని అడుగుతుంది. లేడని బయటకు వెళ్లాడని చెప్తుంది లక్ష్మీ. మరి బైక్‌ బయటే ఉంది కదా మీరు నిజమే చెప్తున్నారు కదా అంటూ నందు అడగ్గానే.. ఏమోనమ్మ వాడికేమో చిన్న పని ఉందని వెళ్లిపోయాడు.. బైక్‌ ఎందుకు తీసుకెళ్లలేదో నాకు తెలియదు అని చెప్పగానే.. నందు సరే ఆంటీ వాడు ఇంటికి రాగానే చెప్పండి.. అంటూ ఏమోషనల్ అవుతూ వెళ్లిపోతుంది నందు. నందు వెళ్లిపోయాక వెంకట్‌ రూంలోంచి బయటకు వస్తాడు. అసలేం జరుగుతుందిరా మీ మధ్య అంటూ లక్ష్మీ అడగ్గానే..

తను దుగ్గిరాల వారసురాలు అందుకే దూరంగా ఉంటున్నాను అని చెప్పగానే.. లక్ష్మీ అబద్దం చెప్పకు.. నిజం ఏంటో నీ కళ్లల్లో కనిపిస్తుందిరా..? అనగానే.. వెంకీ ఏడుస్తూ.. లక్ష్మీని హగ్‌ చేసుకుంటాడు. అప్పుడు లక్ష్మీ నువ్వు నందును ప్రేమిస్తున్నావు కదూ.. అని అడగ్గానే.. వెంకీ అవునమ్మా నేను తనను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కానీ నాన్నకు మాటిచ్చాన కదా అందుకే నేను తనను దూరంగా పెడుతున్నాను.. నా ప్రేమను సమాధి చేసుకుంటున్నాను అని చెప్పగానే.. లక్ష్మీ బాధగా నీ ప్రేమను చంపుకోవడం కరెక్ట్‌ కాదు మీ నాన్నకు ఏదో ఒకటి చెబుదాం అంటూ ఓదారుస్తుంటే.. వెంకీ వద్దని నాన్నకు చెప్పొద్దని నేను నాన్న కోసం ఈ మాత్రం చేయలేనా..? నువ్వు మాత్రం నా ప్రేమ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ వెంకీ వెళ్లిపోతాడు.

Advertisement

అపర్ణ, సుభాష్‌ ఇద్దరూ పంతులును ఇంటికి పిలిపించి వ్రతం గురించి అడుగుతారు. వ్రతం చేయడానికి ముహూర్తం ఫిక్స్‌ చేస్తారు. పంతులు వెళ్లిపోతుంటే.. అప్పుడే ఇందు వస్తుంది. ఎందుకు పంతులు వచ్చారని అడిగితే సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తుంది. దానికి ఇందు చిరాకు పడుతుంది. తనకు చెప్పకుండా నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీస్తుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. అంతా పై నుంచి గమనిస్తుంటారు భ్రమరాంబ, శేషు. చూశావా అది వ్రతానికి ఒప్పుకోవడం లేదంటే.. వాళ్లకు నిజంగా పెళ్లి కాలేదని అనిపిస్తుంది అంటూ శేషుకు చెప్తుంది. ఇందు మాత్రం ఇప్పుడు రాజు ఇంట్లో లేడని ఆఫీసుకు వెళ్లాడని చెప్తుంది. అయితే వెంటనే రాజుకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్పు.. అనగానే. రాత్రి నా మీద ఆలిగాడు ఇప్పుడు ఫోన్‌ తీస్తాడో లేదో అని ఇందు చెప్పగానే.. ఫోన్‌ తీయకపోతే నువ్వే ఆఫీసుకు వెళ్లి రాజును తీసుకురా.. ఈలోపు మేము గుడికి వెళ్లి అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్తుంది అపర్ణ.

ఇందు ఆఫీసుకు వెళ్లి రాజుకు అసలు విషయం చెప్తుంది. అందుకు రాజు ఒప్పుకోడు మనుసులతో గేమ్‌ ఆడోచ్చు కానీ దేవుడితో గేమ్‌ ఆడకూడదు నేను వ్రతం చేయడానికి రాను అంటూ కరాకండిగా చెప్తాడు. ఇందు భయంగా వెళ్లిపోతుంది. మరోవైపు అపర్ణ, సుభాష్‌ ఇద్దరూ గుడి దగ్గర ఏర్పాట్లు చేయించి రాజు, ఇందుల కోసం ఎదురుచూస్తుంటారు. ఇంకా రావడం లేదేంటి అని అపర్ణ బాధపడుతుంది. ఇందుకు ఫోన్‌ చేసి కనుక్కోమని సుభాష్‌ చెప్పగానే.. అపర్ణ ఫోన్‌ చేస్తుంది. ఇందు లిఫ్ట్‌ చేయదు. దీంతో అపర్ణ కంగారు పడుతుంది. నా అనుమానమే నిజం అయ్యేటట్టు ఉంది అంటుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Big Stories

Advertisement
×