E-Paper
Advertisement

పేపర్ లీకేజీకి పాల్పడితే మీ జీవితం క్లోజ్.. 2026 కొత్త చట్టం తెచ్చిన మార్పులివే!

పేపర్ లీకేజీకి పాల్పడితే మీ జీవితం క్లోజ్.. 2026 కొత్త చట్టం తెచ్చిన మార్పులివే!
Advertisement

Exam Malpractice: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయ మార్గాల నిరోధక) సవరణ బిల్లుకు 2026 చట్టరూపం దాల్చింది. దేశ పార్లమెంట్ ఉభయసభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. దీంతో ఈ బిల్లు చట్టబద్దమైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయ మార్గాల నిరోధక) సవరణ బిల్లు 2026కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇది అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి ఆమోదంతో ప్రశ్నపత్రాల లీక్, పరీక్షల్లో మోసాలకు సంబంధించిన నేరాలపై శిక్షలు గతం కంటే మరింత కఠినతరం చేశారు.

5 నుంచి 10 సంవత్సరాల శిక్ష..

ఈ ప్రధాన నేరాలకు కనిష్ఠ జైలు శిక్ష 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల విధించే అవకాశం కల్పించారు. జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు. సంస్థలు లేదా సంఘటిత నేరాలకు పాల్బడితే గరిష్ఠ జరిమానా 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచుతారు. జైలు శిక్షను 8 సంవత్సరాల వరకు పెంచుతూ చట్టం చేశారు. దీంతో పునరావృత నేరాలకు కూడా శిక్షలు, జరిమానాలు మరింత పెంచారు. ఇకపై పేపర్ లీకేజీలలో దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఏర్పాటు చేసే అధికారంకూడా కల్పించారు.

Advertisement

Also Read: టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!

స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు..

ఈ చట్టం ప్రకారం ప్రతి కేసు దర్యాప్తును కనీసం 2 నెలల్లోపు పూర్తి చేయడం తప్పనిసరి చేసారు. వీటికోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, కేసులను రోజువారీ విచారణతో చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు పూర్తి చేయాలని చట్టం తెలుపుతుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఈ చట్టానికి సంబంధించిన కేసులను కూడా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి, 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని నిబంధనను చేర్చారు. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల తీర్పులపై హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌కు అప్పీల్ చేసే అవకాశం కల్పించారు. అప్పీలను కూడా సాధ్యమైనంత వరకు 3 నెలల్లో పరిష్కరించాలని చట్టం పేర్కోంటుంది.

Advertisement

Also Read: నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!

Related News

బిచ్చగాడిగా మారిన ఎమ్మెల్యే పరాగ్.. వేల కోట్లకు అధిపతి, అసలు కారణమేంటి?

పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

Big Stories

Advertisement
×