E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును చూసి ఎమోషనల్ అయిన అపర్ణ   

Brahmamudi Serial Today Episode August 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును చూసి ఎమోషనల్ అయిన అపర్ణ   
Advertisement

Brahmamudi serial today Episode: గుడిలోకి వస్తున్న రాజును చూసి అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రాజు దగ్గరకు వెళ్లబోతుంటే ఇందు ఆపేస్తుంది. నాన్నమ్మ మీరు రాజు దగ్గరకు వెళ్లవద్దు.. ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ఆయన వస్తున్నారు. మీరు వెనక నుంచి వెళ్లండి అని చెప్పగానే.. అపర్ణ, సుభాష్‌ వెనక నుంచి వెళ్లిపోతారు. అప్పుడే రాజు పరుగెత్తుకుంటూ వచ్చి ఇందుతో ఏమైంది వ్రతం జరిపించడం లేదా..? నేను వ్రతానికి రావడం లేదని భ్రమరాంబ, శేషు మామలకు తెలిసిపోయింది అని చెప్పగానే..

ఇందు కంగారుపడుతూ మనం ఇప్పుడు వ్రతం చేయడం లేదు కదా..? వాళ్లకు అనుమానం వస్తుంది కదా అంటుంది. అందుకే నేను ఈ డ్రెస్‌ వేసుకుని వచ్చాను కదా అనగానే.. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ఇందు అడగ్గానే.. ఒక్క నిమిషం ఉండు అంటూ రాజు పంతులు దగ్గరకు వెళ్లి రిక్వెస్ట్ చేసి అప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వాళ్లు ఎవరో చెప్పమని అడుగుతాడు. పంతులు వ్రతం చేసిన వాళ్లను అడిగి తెలుసుకుని వాళ్లిద్దరు కూర్చున్న దగ్గరకు వెళ్లి కూర్చుంటారు. అప్పుడే గుడిలోకి వచ్చిన భ్రమరాంబ శేషు వెళ్లి పంతులు దగ్గరకు వెళ్లి రాజు, ఇందులను చూపిస్తూ.. వాళ్లిద్దరూ వ్రతం చేయించుకున్నారా..? అని అడగ్గానే.. పంతులు తిరిగి చూసి చేయించుకున్నారు అని చెప్తాడు. దీంతో శేషు అంటే మన అనుమానం నిజం కాదన్నమాట వాళ్లిద్దరూ వ్రతం చేయించుకున్నారు అనుకుంటూ వెళ్లిపోతారు. వాళ్లిద్దరూ వెళ్లిపోగానే.. రాజు.. ఇందు చూశావా..? నేను ఎలా మ్యానేజ్‌ చేశానో అంటాడు. ఇందు కోపంగా వీళ్లను మ్యానేజ్‌ చేశావు కానీ మా నాన్నమ్మ తాతయ్య ఎంత కోపంగా ఉన్నారో తెలుసా..? నీ వల్ల నేను ఎన్ని మాటల పడ్డానో తెలుసా..? అనుకుంటూ వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు శశి, ఐశ్వర్యకు కాల్‌ చేసి ఎల్లుడి తన బర్తుడే అని అబద్దం చెప్పి ఆరోజు నువ్వేం పనులు పెట్టుకోవద్దని ఆరోజు పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్తాడు. ఐశ్వర్య సరే అంటుంది. తర్వాత శశి తప్పకుండా తనకు ప్రపోజ్‌ చేస్తాడని వాడిని ఎలాగైనా పెళ్లి దాకా తీసుకెళ్లాలని అందుకోసం రెండు లక్షలు పెట్టి రింగ్‌ తీసుకుని గిఫ్ట్‌గా ఇవ్వాలని డిసైడ్‌ అవుతుంది. ఆ రెండు లక్షలు రేఖ ఆంటీని అడగాలి అనుకుంటుంది.  గార్డెన్‌లో ఉన్న రేఖ, రాజు చెప్పిన లక్కీ గాడి తల్లివి నువ్వే అన్న విషయం ఇంకొకరికి చెప్పాడన్న మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తుంది. అసలు రాజు గాడి ప్లాన్‌ ఏంటి..? ఏలా ఉండేదాన్ని ఎలా ఉండిపోయాను.. అసలు ఇందులోంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదే అని ఆలోచిస్తుంది.

అప్పుడే గుడి నుంచి వచ్చిన భ్రమరాంబ రేఖ తెలిసిపోయింది అంటూ చెప్తుంది. దీంతో రేఖ టెన్షన్‌గా తెలిసిపోయిందా..? వదిన ప్రతిసారి నువ్వు ఇలా వచ్చి తెలిసిపోయింది అంటే కంగారుగా ఉంటుంది. అసలు మీకు ఏం తెలిసిపోయింది చెప్పండి అని అడగ్గానే.. రాజు, ఇందుల మధ్య నిజంగానే పెళ్లి అయిందని వాళ్లిద్దరూ కలిసి గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఆ ఐశ్వర్య తాగి వాగిందంతా అబద్దమే పార్టీలో ఐశ్వర్య ప్లే చేసిన వీడియో ఫేకే అంటూ చెప్తుంది. అప్పుడే రేఖ దగ్గరకు వచ్చిన ఐశ్వర్య తనకు రెండు లక్షలు కావాలని అడుగుతుంది. దీంతో రేఖ కోపంగా ఐశ్వర్యను పిచ్చ తిట్టుడు తిడుతుంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్‌ ఇస్తుంది.  భ్రమరాంబ కూడా ఐశ్వర్యను తిడుతుంది. దానికి డబ్బులు ఇవ్వకుండా మంచి పని చేశావు రేఖ అంటుంది.

Advertisement

ఇంట్లో కూర్చుని రాజు గురించి ఆలోచిస్తుంటారు అపర్ణ, సుభాష్‌ అప్పుడే ఇందు ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి రాజు వస్తున్నాడని చెప్తుంది. దీంతో అపర్ణ, సుభాష్‌ నాటకం ఆడతారు. రాజును తిట్టినట్టు రాజు మీద అలిగినట్టు నటిస్తారు. రాజును నేరుగా చూసిన అపర్ణ ఎమషనల్‌ అవుతుంది. ఏదేదో మాట్లాడుతుంది. రాజు మీకోసం ఏదైనా చేస్తాను అంటూ బుజ్జగిస్తుంటే.. అపర్ణ, సుభాష్‌ను తీసుకుని రూంలోకి వెళ్తుంది. తర్వాత కిచెన్‌లోకి వెళ్లి ఇందుతో మాట్లాడుతుంటే.. కోపంగా రాజును తిట్టి వెళ్లిపోతుంది ఇందు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Big Stories

Advertisement
×