E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 4th : ప్రేమ ధీరజ్ లను ఎలాగైనా కలపాలి అని విశ్వం అనుకుంటాడు.. అమూల్య హెల్ప్ తీసుకుని వాళ్ళిద్దర్నీ కలిపే ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు.. అమూల్య విశ్వాన్ని చూసి కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడదు.. అమూల్య నేను చెప్పేది ఒక్కసారి విను అని ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే అమూల్య నా జోలికి రావద్దు అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.. అమూల్యని ఏడిపిస్తున్నాడని చూసిన సాగర్ విశ్వం ని దారుణంగా కొట్టేస్తాడు.. ఇంకొకసారి నా చెల్లెలు జోలికొస్తే మర్యాదగా ఉండదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. అటు వేదవతి అమూల్యంగా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

వేదవతికి షాకిచ్చిన రామరాజు..

వేదవతి బయట అటు ఇటు తిరుగుతూ కంగారు పడిపోతూ ఉంటుంది.. ఏమైంది అత్తయ్య గారు మీరు ఏదో దొంగతనానికి వెళుతున్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నారేంటి అని నర్మదా అంటుంది.. ఏదో దొంగతనం కోసం రెక్కీ వేసినట్టుగా మీరు అటు ఇటు తిరుగుతుంటే నిజంగానే అందరికీ అనుమానం కలుగుతుంది అని నర్మదా అనగానే ఆయన ఇప్పుడు బయటకు వెళ్తున్నారు కదా అందుకే అటు ఇటు తిరుగుతున్నాను అని నర్మదతో అంటుంది.. అనుకున్నట్లుగానే రామరాజు ఎదురుగా బ్యాగు పట్టుకుని రావడంతో… తనని చూసినా రామరాజు అమూల్య అని పిలుస్తాడు కానీ అమూల్య లేదు అని వల్లి వచ్చి చెప్పగానే నువ్వు ఎదురు రమ్మని అంటాడు.. కాకపోతే వల్లి ఎదురు వస్తున్నప్పుడు చందు నువ్వు ఎందుకు వస్తున్నావ్? అమ్మకి నీకు మనసుపడ్డలు వచ్చాయి కదా… నాన్న నీకు అమ్మ ఎదురుగా వస్తేనే సెంటిమెంట్ కదా అమ్మ ఎదురుగా వస్తుంది అని చెందు చెప్పగానే రామరాజు మౌనంగా ఉంటాడు..

శారదాంబ మాటతో నర్మదకు అనుమానం..

Advertisement

శారదాంబ తన కూతురు అల్లుడు మాట్లాడుకోవడం లేదు అని టెన్షన్ పడుతుంది. రామరాజు నా కూతురు మేనకోడలు జీవితాన్ని కాపాడాలి అనుకున్నది. కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు అని ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా సరే అతను మాత్రం వినకుండా రామరాజు వెళ్లిపోతాడు.. ఆరోజు బద్రావతి నా పుట్టినరోజు వేడుకలు జరపడానికి వద్దు అని అంది.. పుట్టినరోజునైన చేయకుండా ఉంటాను అని చెప్పింది కానీ తర్వాత ఏమైందో ఈ ఇంట్లోని పుట్టినరోజు చేయడానికి ఒప్పుకుంది.. ఏంటి బామ్మ గారు మీరు చెప్పేది మీ అమ్మాయి ఇంట్లో పుట్టిన రోజు జరుపుకోవడానికి ఒప్పుకుందా..? ఇది ఏదో అనుమానించాల్సిన విషయమే అని నర్మదా అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఎవరికో ఈ నిజం తెలిసి భద్రావతికి చెప్పి ఉంటారు అందుకే. ఆమె తన మేనకోడలు కోసం ఈ ఇంటికి వచ్చింది అని నాకు అనిపిస్తుంది అని అనగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

వల్లి పై నర్మదకు అనుమానం.. 

శ్రీవల్లి నర్మదకి అనుమానం వచ్చింది అంటే నా మీద డౌటింగ్ వచ్చేసినట్టే.. ఎలాగైనా సరే నర్మదకి డౌటింగ్ వచ్చిందో లేదో కన్ఫామ్ చేసుకోవాలి అని కంగారు పడిపోతుంటుంది వల్లి.. నేనే వెళ్లి ఆ భద్రకు నిజం చెప్పానని తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టదు ప్రేమ ధీరజ్ లు విడిపోవడానికి నేనే కారణం అని తెలిస్తే ఇక నా సంగతి అంతేనని అటు ఇటు తిరుగుతూ కంగారు పడిపోతూ ఉంటుంది.. క్లారిటీ తీసుకోవాలి అన్నావ్ కదా అక్క తీసుకో మరి అని నర్మదా అనగానే అమ్మో నామీద అనుమానం వచ్చేసింది నేను అడ్డంగా దొరికిపోయాను అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇక నర్మదా నాకు వచ్చిన అనుమానం నిజమే అయితే వాళ్లకి చుక్కలు చూపిస్తాను. నీకు ఒక ట్రైలర్ చూపిస్తానని భద్ర వల్లి మాట్లాడుకుంటున్న వీడియోని చూపిస్తుంది.. ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి..

శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్…

Advertisement

శ్రీవల్లి ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాయి చెమటలు పడుతూ ఉంటాయి.. కానీ ఆ వీడియోని చూసి ఇది ఏఐ తో చేసిన వీడియో అని చెప్పగానే నర్మదా అవునా అక్క నిజమా అని అంటుంది.. ఈ వీడియో తీసిన వాళ్ళని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పట్టించాలి అని హడావిడి చేస్తుంది శ్రీవల్లి. నర్మదకి కచ్చితంగా అనుమానం వచ్చేసింది కాబట్టి నా జాగ్రత్తలు నేనుండాలి అని శ్రీవల్లి అనుకుంటుంది.. ఒకవేళ గనుక నర్మదకి నిజంగానే అనుమానం వస్తే నన్ను బొంద పెట్టేంత వరకు ఊరుకోదు అని శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది..

ధీరజ్ కు షాకిచ్చిన ప్రేమ..

ధీరజ్ ప్రేమ కోసం అకాడమీలో వెయిట్ చేస్తూ ఉంటారు.. ప్రేమ ఈ రోజు స్పెషల్ క్లాస్ అని చెప్పినా కూడా ఇంకా రాలేదేంటి అని అందరు చూస్తూ ఉంటారు.. ప్రేమ రాగానే ధీరజ్ చాలా సంతోషంగా తనకోసం వెయిట్ చేస్తూ కనిపిస్తాడు.. అయితే ప్రేమ మొదటగా ధీరజ్ ని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది.. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ఎవరో తెలియలేదు అన్నట్టుగానే వెళ్ళిపోతుంది.. ఇక ప్రేమ వెనకాలే వెళ్లిన ధీరజ్ కు ప్రేమ సెక్యూరిటీ దగ్గర ఇరిగించేస్తుంది.. ఎలాగైనా సరే ప్రేమతో మాట్లాడాలి అని వెనకాలే వెళ్ళిపోతాడు ధీరజ్.. అందరూ కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా కూడా.. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కోపంగా ఉంటారు.. ఇక విశ్వం అమూల్యతో మాట్లాడాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అమూల్య విశ్వామిని చూసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అమూల్య చెయ్యి పట్టుకుని లాగగానే అమూల్య చెంప పగలగొడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..

Related News

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Brahmamudi Serial Today Episode August 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును చూసి ఎమోషనల్ అయిన అపర్ణ   

Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..

Gundeninda Gudigantalu Serial : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ అవుట్..!

Illu illaalu pillalu Narmada : నర్మదా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Tuesday Movies in Tv : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. వీటిని మిస్ చెయ్యకండి..

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

Big Stories

Advertisement
×