Brahmamudi serial today Episode: గార్డెన్‌లో బాధపడతున్న రాజ్ దగ్గరకు వెళ్లి ఇంద్రాదేవి, అపర్ణ ఓదారుస్తంటారు. దీంతో రాజ్ ఇంకా బాధపడుతూ నా లాగే మీరు కూడా మోసపోయారు కదా అంటాడు. అయినా ఎవరితో బతకాలనేది తన ఇష్టం. తను ముందు నుంచి క్లారిటీగా ఉంది. నేనే ఊహల్లో బతికేశాను. నా రాతలోనే ప్రేమకు చోటు లేదనుకుంటాను నాన్నమ్మ.. అందుకే ఆ దేవుడు యాక్సిడెంట్ రూపంలో నా గతంలో ఉన్న ప్రేమను చెరిపేసి నాకు గతమే లేకుండా చేసేశాడు. ఇప్పుడు యామిని చూపించే ప్రేమ నాక కనిపించదు.. నేను చూపించే ప్రేమ కళావతి గారికి కనిపించదు అంటూ ఎమోషనల్ అవుతుంది. అలా బాధపడకు మనవడా..? మేమందరం ఉన్నాం కదా..? దానితో మేము మాట్లాడతాం. ఇలా ఎందుకు చేసిందో కనుక్కుంటాం అని ఇంద్రాదేవి చెప్పగానే.. నాలుగు తగిలించైనా పెళ్లికి ఒప్పిస్తాం అంటుంది అపర్ణ..
రికమండ్ చేస్తే ఆఫీసులో స్థానం దొరకొచ్చేమో కానీ మనసులో స్థానం దొరకదు కదా అమ్మా.. అయినా ఇష్టం లేని షర్టే వేసుకోం అలాంటిది.. ఇష్టం లేని మనిషితో జీవితాంతం కలిసి ఉండాలంటే ఎలా కుదురుతుందమ్మా..? అలా చేసి తనను బాధపెటలేను అమ్మా..! ఇప్పటి వరకు నాకు గతమే లేదనుకున్నాను. భవిష్యత్తు కూడా లేదని ఇప్పుడే తెలిసింది. అంటూ ఏడుస్తూ ఇంద్రాదేవి, అపర్ణలను హగ్ చేసుకుంటాడు రాజ్. తనకు ఇష్టం లేదన్నాక ఇక నేను ఇక్కడ ఉండను అంటూ వెళ్లిపోతాడు రాజ్. రాజ్ వెళ్లిపోయాక అపర్ణ కోపంగా అసలు దీనికంతటికీ కారణం ఆ కావ్య ఎందుకు చేసిందో అడుగుదాం పద అత్తయ్యా అంటూ ఇద్దరూ కోపంగా కావ్య రూంలోకి వెళ్తారు. రూంలో కావ్య ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఇద్దరూ వెళ్లి ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తారు. దీంతో నా కారణాలు నాకు ఉన్నాయి అత్తయ్యా అని చెప్తుంది. దీంతో ఏం కారణాలు అంటూ నిలదీస్తే చెప్పేవే అయితే అక్కడే చెప్పే దాన్ని కదా అంటుంది కావ్య..
దీంతో అసలు మాకు చెప్పలేనంత కష్టం నీకు ఏమి వచ్చింది అని అపర్ణ అడుగుతుంది. నువ్వు చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలం అంటుంది ఇంద్రాదేవి.. వాడిని వద్దూ అనడానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటి..? అని అపర్ణ అడుగుతుంది. వాడి కోసమే బతుకుతున్న నువ్వు ఈరోజు వాడిని అంతలా అవమానించడానికి కారణం ఏంటి..? అని ఇంద్రాదేవి నిలదీస్తుంది. దీంతో కావ్య అయ్యో ఈ విషయం నేను చెప్పలేను అమ్మమ్మ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అంటుంది. దీంతో అపర్ణ సరే అయితే నువ్వే అంత మొండిగా ఉంటే.. ఇక నేనెంత మొండిగా ఉంటానో నువ్వు చూస్తావు. ఇప్పటి వరకు ఆడిన నాటకాలు డ్రామాలు చాలు. ఇక వాడే దూరం అవుతాడని తెలిశాక నిజాలు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏం జరిగితే అది జరిగింది. ఇప్పుడే వెళ్లి వాడికి అన్ని నిజాలు చెప్పేస్తాను. వాడు మర్చిపోయిన గతాన్ని గుర్తు చేసి తిరిగి ఇంటికి తీసుకొస్తాను. వాడికి ప్రాణం పోయిన తల్లిని నేను నిజంగా వాడికి ఏమైనా జరిగితే నా ప్రాణం పెట్టైనా సరే నేను కాపాడుకుంటాను అంటూ అపర్ణ వెళ్లబోతుంటే..
నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య అంటుంది కావ్య. వెంటనే అపర్ణ ఆగిపోతుంది. హ్యాపీగా దగ్గరకు వచ్చి ఏమంటున్నావే నువ్వు అని అడుగుతుంది. అవును అత్తయ్యా నేను తల్లిని కాబోతున్నాను.. అని చెప్పగానే.. ఒసేయ్ పిచ్చి ముఖం దానా..? ఇంత మంచి శుభవార్తని ఎవరైనా ఇలా చెప్తారా..? అంటుంది ఇద్రాదేవి. అసలు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు..? ముందే చెప్పి ఉంటే.. అందరికి చెప్పి ఒక పండగలాగా జరిపించేవాళ్లం అంటుంది అపర్ణ. దీంతో కావ్య ఆయనతో చెప్పేవారా..? నేను కడుపుతో ఉన్నానని ఆయనకు ఎలా చెప్తారు అత్తయ్యా.. దానికి కారణం ఎవరు అంటే ఎవరిని చూపిస్తారు. అందుకే ఈ నిజాన్ని ఆయనకు ఎప్పటికీ చెప్పను.. చెప్పకూడదు అంటే ఆయనకు ఎప్పటికీ ఎదురుపడను అంటుంది. దీంతో ఇంద్రాదేవి, అపర్ణ ఎమోషనల్ అవుతారు. దేవుడు నీకు చాలా పెద్ద మనసు ఇచ్చాడే అంటూ బాదపడుతుంది ఇంద్రాదేవి.
తర్వాత కావ్య ఏడుస్తూ కూర్చుంటుంది.. మరోవైపు రాజ్ రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. రాజ్ కోసం ఇంట్లో వెయిట్ చేస్తున్న యామిని రాజ్ కు కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాప్ వస్తుంది. రాజ్ ఫోన్ స్విచ్చాప్ రావడంతో బావ ఏదైనా రాంగ్ డిసీజన్ తీసుకున్నాడా ఏంటి..? అనుకుంటూ యామిని రాజ్‌ను వెతకడానికి బయటకు వెళ్తుంది. వైదేహి వచ్చి యామినిని ఏమీ వెళ్లొద్దని ఆపేస్తుంది. మరోవైపు దుగ్గిరా ఇంట్లో అందరూ కావ్యను బహిష్కరిస్తారు. కాఫీ తీసుకొచ్చి ఇస్తే సుభాష్ తీసుకోడు. ప్రకాష్‌కు ఇవ్వబోతే ప్రకాష్ కూడా కాఫీ తీసుకోకుండా వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ కూడా కావ్యను తిడుతుంది. రుద్రాణి మాత్రం నవ్వుతూ వచ్చి కాఫీ తీసుకుని కాఫీ వాళ్లకు అవసరం లేదేమో అంటుంది. అంతా గమనిస్తున్న ఇంద్రాదేవి, అపర్ణ బాధపడతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం