Brahmamudi serial today Episode: హాల్లోకి వచ్చిన రుద్రాణి, శాంతను పిలిచి కాఫీ అడుగుతుంది. మీ కాఫీ మీకు రూంలోకి పంపించాను కదా..? అంటుంది. ఇప్పుడు నాకు కాఫీ కావాలని అడుగుతుంది. అయితే ఇస్తాను కానీ ఈ రోజు మళ్లీ మీకు కాఫీ ఇవ్వను అని చెప్తుంది శాంత. ఎందుకని రుద్రాణి అడగ్గానే.. ఈ ఇంట్లో ఎవరికైనా సరే రెండు సార్లే కాఫీ ఇవ్వమని కావ్యమ్మ చెప్పారు అని చెప్పగానే రుద్రాణి కోప్పడుతుంది. అడుగుతీసి అడుగు వేయాలన్నా కావ్యను అడగాలా..? అంటూ తిడుతుంది. ఇంతలో శాంత కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కాఫీ తీసుకుని తాగుతూ బాల్కనీలోకి వెళ్తుంది రుద్రాణి. కింద కార్లను పంపిచి వేస్తుంది కావ్య.
పైనుంచి అంతా చూస్తుంది రుద్రాణి. కింద కార్లు పంపిచాకా ఇక వెళ్దామా అని కావ్య రాజ్‌ను అడగ్గానే కార్లు అన్ని పంపిచేశావు సరే ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పావా అని అడగుతాడు. చెప్తే పంపిచనివ్వరు కదా..? అంటుంది కావ్య. చెప్పకపోతే గొడవ చేస్తారు కదా అంటాడు రాజ్. ఆ విషయం నేను చూసుకుంటాను మనం వెళ్దాం పద అని చెప్పగానే ఇద్దరూ కలిసి వెళ్లపోతారు. పైనుంచి అంతా గమనిస్తున్న రుద్రాణి ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ అంటుంది. ఏంటి తిరగడానికి ఇంట్లో కార్లు లేకుండా చేయడం గుడ్ న్యూసా అని రాహుల్ అడుగుతాడు. ఇప్పుడు కావ్య చాదస్తం పీక్స్ కు చేరి కార్లన్నీ పంపిచింది. ఇన్నాళ్లు ఇంట్లో వాళ్లు కావ్యను వెనకేసుకొస్తారు. ఇప్పుడు ఈ కార్ల వ్యవహారం అందరికీ చెప్పి అది ఈ ఇంట్లో అధికారం చెలాయించడానికి కాదు కదా..? అడుక్కుతినడానికి కూడా పనికిరాదు అని ఫ్రూవ్ చేయాలి. అని చెప్తుంది రుద్రాణి.
ఆఫీసుకు వెళ్లిన రాజ్ టెన్షన్ పడుతుంటే ఏమైందండి అని కావ్య అడుగుతుంది. చెప్తే నువ్వు కూడా టెన్షన్ పడతావు అంటాడు రాజ్. చెప్పకపోతే ఇంకా టెన్షన్ పడతాను అంటుంది కావ్య. ఏం లేదు జగదీష్ గారి కాంట్రాక్ట్ పూర్తి చేయాలంటే మనకు ఇప్పుడు 5 కోట్ల దాకా అవసరం పడతాయి అని చెప్తాడు. కావ్య కూల్‌గానే ఉంటుంది. చెప్తే టెన్షన్ పడతావు అనుకుంటే చెప్పినా టెన్షన్ పడటం లేదేంటి అని అడుగుతాడు రాజ్. మీరు పడకండి నారు పోసిన వాడే నీరు పోస్తాడు అని కావ్య చెప్తుంది. ఇంతలో జగదీష్ వస్తాడు. కావ్య ఫోన్ చేసి అడ్వాన్స్ ఇవ్వమని చెప్పింది. అందుకే 5 కోట్లు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చానని చెప్తాడు. రాజ్ ఆనందంతో షాక్ అవుతాడు. డబ్బులిచ్చి జగదీష్ వెళ్లిపోతాడు. ఆనందంతో కావ్యను ఎత్తుకుని గిరాగిరా తిప్పుతుంటాడు. ఇంతలో శృతి రాగానే కావ్యను కింద పడేస్తాడు.
ఇంట్లోకి వెళ్లిన రుద్రాణి సుభాష్‌కు ఎదురెళ్లి ఏంటన్నయ్యా అంత హడావిడిగా వెళ్తున్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. వాడి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతాయి అని చెప్పి వెళ్లిపోతాడు. రుద్రాణి నవ్వుతుంది. కామ్‌గా వెల్లిపోయే వాడితో పిలిచి మరీ నన్ను తిట్టించినందుకా నవ్వుతున్నావు అని అడుగుతాడు. కాదని ఇప్పుడే ఇంట్లో చిన్నసైజు సునామీ సృష్టించబోతున్నాను అందుకే నవ్వాను అంటూ చెప్పి ఇక్కడే ఉండు అంటూ ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ రెడీ అవుతుంటే.. ఈ ఇంట్లో నువ్వే మహాలక్ష్మీలా కనిపిస్తావు అంటూ పొగడడంతో నాతో ఏమైనా పనుందా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది.
అవునని నా నగలు మెరుగు పెట్టించడానికి బయటకు వెళ్తున్నాను. నువ్వు వస్తావేమోనని అడుగుతుంది. సరేనని ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. బయట కార్లు లేకపోవడంతో ధాన్యలక్ష్మీ కార్లు ఏవీ అని అడుగుతుంది. అన్ని కార్లు వెళ్లిపోయాయని రాహుల్ చెప్తాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ డ్రైవర్‌కు ఫోన్ చేస్తుంది. ఎక్కడ చచ్చారురా అని అడగ్గానే డ్రైవర్ మర్యాదగా మాట్లాడండి అంటూ చెప్పగానే.. మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్లారురా అని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. కావ్య మేడం రెండు కార్లు చాలని మమ్మల్ని పంపించేశారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మీ కోపంగా లోపలికి వెళ్తుంది. అపర్ణను పిలుస్తుంది. ఏమైంది ధాన్యలక్ష్మీ అంతలా అరుస్తున్నావు. అంటూ అపర్ణ వస్తుంది.
అక్కా నీ కోడలు ఏం చేసిందో చూశావా..? అంటుంది ధాన్యలక్మీ. చూడలేదు.. ఏం చేసింది. అని అడుగుతుంది అపర్ణ. నా కోడలు అంత గొప్పది ఇంత గొప్పది అని చెప్తుంటావు కదా..? ఇంకా ఇంకా ఎన్నో విధాలుగా మమ్మల్ని కింది స్థాయికి దిగజారుస్తుంది. మనం కూడా వెళ్లి బొమ్మలకు మట్టి పిసుక్కునేలా చేస్తుందా..? అంటూ ధాన్యలక్మీ ఫైర్ అవుతుంది. దీంతో ప్రకాష్ నీకు ఫీచర్ అలా కనిపిస్తుందా ధాన్యం అనడంతో నీకు కనిపించడం లేదా అన్నయ్య అని రుద్రాణి అడగ్గానే.. ఇంట్లో కార్లన్నీ రిటర్న్ పంపించేసింది అని ధాన్యలక్ష్మీ చెప్తుంది.
అందరినీ తీసుకెళ్లి వీధిలో నిలబెడుతుందా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో కారణం ఏంటో నాకు తెలియదు. కావ్య వచ్చాక విషయం ఏంటో తెలుసుకుంటాను అని అపర్ణ చెప్పగానే ఆ రాణి వచ్చే వరకు నేను ఇలా రగులుతూనే ఉండాలా అంటుంది ధాన్యలక్ష్మీ. అపర్ణ, కావ్యకు ఫోన్ చేస్తుంది. కావ్య తాను బిజీగా ఉన్నానని తర్వాత మాట్లాడతానని ఫోన్ కట్ చేస్తుంది కావ్య. దీంతో మమ్మల్ని పూచిక పుల్లగానే చూస్తుంది. నీకైనా సమాధానం చెప్పాలి కదా అక్కా అంటుంది ధాన్యలక్ష్మీ. కావ్య తప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టే బిజీగా ఉన్నానని అబద్దం చెప్పింది అంటూ రుద్రాని అనడంతో అపర్ణ తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?